Maa Inti Katha - An Etv Win Original

"మా ఇంటి కథ" రివ్యూ – ప్రతి ఇంట్లో జరిగే కథ ఇదేనా?

పరిచయం :

ఈ మధ్య కాలంలో OTTల్లో ఫ్యామిలీ డ్రామాలు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి కోవకి చెందినదే “మా ఇంటి కథ” వెబ్ సిరీస్. దర్శకుడు శ్రావణ్ దాములూరి తెరకెక్కించిన ఈ సిరీస్ ETV Win లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 6 ఎపిసోడ్స్‌తో వచ్చిన ఈ సిరీస్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని చూపించే ప్రయత్నం చేసింది.

ఇలాంటి ఫ్యామిలీ కథలు ఇష్టమైతే, మీరు మా బ్లాగ్‌లో ఉన్న D/o Prasad Rao Review, Sarvam Maayaa Review, Seetha Payanam Review కూడా చూడవచ్చు.

కథాకమామీషు :

వైజాగ్ సమీపంలోని ఓ గ్రామంలో జీవిస్తున్న సామ్రాట్ అనే టైలర్ తన కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. భార్య శివమ్మ, ఇద్దరు పిల్లలు — సూర్య, శ్యామ్ — ఇవే అతని ప్రపంచం.
తన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడే తండ్రి, కుటుంబ అవసరాల కోసం పోరాడే తల్లి, తల్లిదండ్రుల ప్రేమలో తేడా ఉందని భావించే పెద్ద కొడుకు — ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యల మధ్య కథ సాగుతుంది.
ఒక సందర్భంలో తల్లిదండ్రులు బయటికి వెళ్లిపోవడంతో ఇంట్లో పిల్లలు మాత్రమే మిగులుతారు. అప్పుడు జరిగే సంఘటనలు మనకి మన చిన్నతనపు చేష్టలని గుర్తు చేస్తాయి. ఒ మధ్య తరగతి కుటుంబ సమస్యలు ఎలా పరిష్కరింప బడినాయి అనేదే ఈ చిత్ర సారాంశం. 

విశ్లేషణ :

"మా ఇంటి కథ"  వెబ్ సిరీస్ ప్రధానంగా మధ్య తరగతి కుటుంబ జీవితం మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్లుగా  కనిపిస్తుంది. ఓ ఇంట్లో రోజూ జరిగే చిన్న చిన్న గొడవలు, అలకలు, ప్రేమ, బాధ — ఇవన్నీ చాలా సహజంగా చూపించారు.
కానీ ఈ కథలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే — ఇది చాలా రియలిస్టిక్ అయినప్పటికీ, డ్రామాటిక్ ఎలిమెంట్ తక్కువగా ఉంది. కథ మొత్తం ఒకే రకం టోన్‌లో సాగిపోతుంది. కొన్ని సన్నివేశాలు మనకి కనెక్ట్ అవుతాయి, కానీ ఒక బలమైన ట్విస్ట్ లేదా ఆసక్తికరమైన మలుపు లేకపోవడం వల్ల ఎంగేజ్‌మెంట్ తగ్గుతుంది. నటీనటుల విషయానికి వస్తే , తల్లిదండ్రుల పాత్రలు బాగానే న్యాయం చేశారు. పిల్లల పాత్రల్లో ఇంకాస్త సహజత్వం కావాల్సిన ఫీలింగ్ వస్తుంది. టెక్నికల్‌గా చూస్తే — కెమెరా వర్క్, మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది కానీ ప్రత్యేకంగా గుర్తుండిపోయే అంశాలు తక్కువ.

Oppo - F33 5G Mobile

ఆస్తులు (పాజిటివ్ పాయింట్స్):

  • రియలిస్టిక్ ఫ్యామిలీ డ్రామా – ప్రతి ఇంట్లో జరిగే విషయాలు
  • మధ్యతరగతి జీవిత ప్రతిబింబం – నిజ జీవితానికి దగ్గరగా
  • తల్లిదండ్రుల ఎమోషన్స్ – బాగా కనెక్ట్ అవుతాయి
  • సింపుల్ స్టోరీ – హాయిగా చూసే కంటెంట్

కుదుపులు (నెగెటివ్ పాయింట్స్):

  • బలమైన కథ లేకపోవడం – ప్రధాన ప్లాట్ మిస్సింగ్
  • ట్విస్టులు లేకపోవడం – ఆసక్తి తగ్గుతుంది
  • స్లో నేరేషన్ – కొన్నిచోట్ల బోర్ అనిపిస్తుంది
  • క్లైమాక్స్ ఇంపాక్ట్ తక్కువ
  • పాత్రల డెప్త్ తగ్గడం

తుది మాట :

“మా ఇంటి కథ” ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామా. ఇందులో గొప్ప కథ, ట్విస్టులు, థ్రిల్ ఆశిస్తే నిరాశ కలిగించవచ్చు. కానీ మధ్యతరగతి జీవితం, చిన్న చిన్న భావోద్వేగాలు చూసేందుకు ఇష్టపడేవారికి ఇది ఒక ఓకే టైమ్‌పాస్ వెబ్ సిరీస్.
కుటుంబంతో కలిసి హాయిగా చూడాలంటే ట్రై చేయొచ్చు.

Real Me 16 Mobile AI Portrait Star

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog