Pratichaaya- OTT review-Telugu

Prathichaya OTT Review Telugu – పాలిటిక్స్, పవర్ గేమ్స్, థ్రిల్!

పరిచయం :

మలయాళ స్టార్ నివీన్ పొలి  ప్రధాన పాత్రలో నటించిన “ప్రతిచాయ” ఒక రాజకీయ నేపథ్య థ్రిల్లర్. ప్రముఖ దర్శకుడు బి. ఉన్నికృష్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు JioHotstar OTT లో తెలుగు డబ్బింగ్‌ తో స్ట్రీమింగ్ అవుతోంది.
సినిమా ప్రధానంగా అధికారం, కుటుంబ వారసత్వం, రాజకీయ కుట్రలు, ఇమేజ్ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుంది.

కథాకమామీషు :

కేరళలో ప్రభావశీల రాజకీయ నాయకుడు కే.ఎన్. వర్గీస్ (బాలచంద్ర మీనన్) ఒక భారీ అవినీతి కేసులో చిక్కుకుంటాడు. అతని పెద్ద కుమారుడు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నా, ప్రజల్లో మంచి ఇమేజ్ కలిగిన చిన్న కుమారుడు జాన్ (నీవిన్ పౌలి) రాజకీయాలకు దూరంగా జీవిస్తుంటాడు.

తండ్రి ప్రతిష్ఠ దెబ్బ తినడంతో , తదుపరి వారసుడిగా యెవరిని నియమించాలి అనే ఆలోచన చేస్తున్నప్పుడు అకస్మామాత్తుగా  జరిగిన ఒ సంఘటన ద్వారా జాన్ రాజకీయాల్లోకి అడుకుపెడతాడు. ఒక సాధారణ వ్యక్తి ఎలా రాజకీయ యంత్రాంగంలోకి లాగబడ్డాడు? అతను నిజం కోసం పోరాడాడా? లేక వ్యవస్థలో భాగమైపోయాడా? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది.

విశ్లేషణ :

“ప్రతిచాయ”లో ప్రధాన ఆకర్షణ నీవిన్ పౌలి నటన. సాధారణ యువకుడిగా మొదలై, పరిస్థితుల వల్ల రాజకీయ నాయకుడిగా మారే పాత్రను సైలెంట్ ఇంటెన్సిటీతో పోషించాడు. అతని పాత్రలో అంతర్గత సంఘర్షణ బాగా కనిపిస్తుంది.
దర్శకుడు ఉన్నికృష్ణన్ కథలో రాజకీయ ఇమేజ్ మేనేజ్‌మెంట్, మీడియా ప్రభావం, కుటుంబ వారసత్వం వంటి అంశాలను టచ్ చేశారు. కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి.
అయితే స్క్రీన్‌ప్లే మరింత పదునుగా ఉండాల్సింది. కొన్ని భాగాలు పాత తరహా రాజకీయ సినిమాలను గుర్తు చేస్తాయి. మలుపులు ఊహించదగ్గలా ఉండటం వల్ల థ్రిల్ తగ్గుతుంది.
సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కథకు బలం ఇచ్చాయి. రాజకీయ వాతావరణాన్ని గంభీరంగా చూపించడంలో టెక్నికల్ టీమ్ మంచి పని చేసింది.

ఆస్తులు (పాజిటివ్ పాయింట్స్):

  • నీవిన్ పౌలి నటన – గంభీరమైన పాత్రలో మంచి మార్పు చూపించాడు.
  • రాజకీయ కాన్సెప్ట్ – కుటుంబం vs అధికారం మధ్య ఆసక్తికర పోరు.
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ & విజువల్స్ – థ్రిల్లర్ ఫీల్‌ను పెంచాయి.
  • కొన్ని బలమైన సంభాషణలు – రాజకీయ వాస్తవాల్ని గుర్తు చేస్తాయి.
  • OTTలో చూడడానికి సరైన కంటెంట్ – థియేటర్ కంటే ఇంట్లో చూసే వారికి బెటర్ ఫీల్.

కుదుపులు (నెగటివ్ పాయింట్స్):

  • కథా గమనం నెమ్మదిగా ఉంటుంది – ముఖ్యంగా మొదటి భాగంలో జరిగే సన్నివేశాలు. 
  • మలుపులు ఊహించదగ్గవి – పెద్ద సర్‌ప్రైజ్‌లు ఉండవు.
  • పాత తరహా ట్రీట్‌మెంట్ – కొత్త తరం ప్రేక్షకులకు కొంత నెమ్మదిగా అనిపించవచ్చు.
  • సహ తారాగణం యొక్క పాత్రల చిత్రీకరణ, తమ నటనను దర్శకుడు పూర్తి స్థాయిలో వాడుకోలేదు అనిపించింది. 

తుది మాట :

ప్రతిచాయ” ఒక గంభీరమైన ఉద్వేగభరిత రాజకీయ నాటకం. వేగవంతమైన మాస్ మనోరంజకమైన చిత్రం కాదు. కానీ, అందులో ఉన్న రాజకీయ నేపథ్యం, పాత్రల అంతర్గత సంఘర్షణ, నీవిన్ పౌలి నటన కోసం చూడదగిన సినిమా. థ్రిల్ కంటే పవర్ గేమ్స్ & రాజకీయ జిత్తులు ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక.
OTTలో కూర్చొని నెమ్మదిగా ఆస్వాదించే సినిమా కావాలంటే “ప్రతిచాయ” ట్రై చేయొచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog