Matka King Series Telugu review

Amazon Prime Video లో విజయ్ వర్మా క్రైమ్ డ్రామా ఎలా ఉంది?

పరిచయం

"మట్కా కింగ్" ప్రముఖ దర్శకుడు నాగరాజ్ మంజులే తెరకెక్కించిన ఒ క్రైమ్ వెబ్ సిరీస్. విజయ్ వర్మ, కృతికా కర్మ, సాయితహంకర, గుల్షన్ గ్రోవర్ వంటి బలమైన తారాగణంతో రూపొందిన ఈ సిరీస్ Amazon Prime Video లొ ఈ ఏప్రిల్ 17 నుండి స్త్రీమింగ్ అవుతొంది. 1960వ దశకం లో బాంబేలొ జరిగిన మట్కా జూద సామ్రాజ్య పుట్టుక యెమిటి అనేది ఈ సిరీస్ చూపిస్తుంది. 
ఇదే అంశంతో వరుణ్ తేజ్ హీరోగా ఒ చిత్రం "మట్కా" కూడా వచ్చింది.


మీరు క్రైమ్ డ్రామాలు ఇష్టపడితే, మా పాత పోస్టులు కూడా చూడండి: Drive మూవీ రివ్యూ, Sarvam Maayaa

కథాకమామీషు

1960లలో బొంబే నగరం లో  పేదరికం లో బ్రతుకుతున్న బ్రిజ్ భట్టి (విజయ్ వర్మ) ఒక తెలివైన పత్తి వ్యాపారి.
డబ్బు, గౌరవం, సమాజం లో మంచి స్థానం సంపాదించాలని కలలు కంటాడు. అప్పటి ధనిక వర్గాలకే పరిమితమైన జూద ప్రపంచాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఒక కొత్త ఆటను సృష్టిస్తాడు — అదే మట్కా.

ఈ ఆట ఒక్కసారిగా నగరాన్ని కుదిపేస్తుంది. డబ్బు కోసం పరుగులు, రాజకీయ ఒత్తిళ్లు, పోలీస్ వేట, ద్రోహాలు, ప్రేమ, కుటుంబ సంబంధాలు అన్నీ బ్రిజ్ జీవితాన్ని చుట్టుముడతాయి. చివరకు అతడు నిజంగానే “మట్కా కింగ్” అయ్యాడా? లేక తనే వేసిన ఆటలో తానే చిక్కుకున్నాడా? అనేదే అసలు కథ.

విశ్లేషణ :

“మట్కా కింగ్” వెబ్ సిరీస్ ప్రధాన బలం విజయ్ వర్మా నటన. అతడు బ్రిజ్ భట్టి పాత్రలో పూర్తి స్థాయిలో ఒదిగిపోయాడు. సాధారణ మనిషి నుంచి శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగే ప్రయాణాన్ని అద్భుతంగా చూపించాడు.
దర్శకుడు నాగరాజ్ మంజులే 1960ల బాంబే వాతావరణాన్ని బాగా రీక్రియేట్ చేశారు. సెట్స్, కాస్ట్యూమ్స్, మ్యూజిక్ అన్నీ ఆ కాలానికి తీసుకెళ్తాయి. సిరీస్‌లో జూదం వెనుక ఉన్న సామాజిక కోణం, పేదల ఆశలు, ధనికుల ఆధిపత్యం వంటి అంశాలు కూడా చూపించారు.
అయితే కథ కొన్ని చోట్ల నిదానంగా సాగుతుంది. కొన్ని ఎపిసోడ్స్‌లో మరింత టెన్షన్, వేగం ఉండాల్సిన ఫీలింగ్ వస్తుంది. కథ మరింత లోతుగా వెళ్లాల్సిందని కొంతమంది విమర్శకులు భావించారు.

ఆస్తులు (పాజిటివ్ పాయింట్స్):

  • విజయ్ వర్మా అద్భుత నటన – కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌లలో ఒకటి.
  • 1960ల బాంబే సెటప్ – విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
  • సరికొత్త కాన్సెప్ట్ – మట్కా జూదం పుట్టుక కథ ఆసక్తికరం.
  • సపోర్టింగ్ కాస్ట్ బాగుంది – సాయి తమ్హంకర్, కృతికా కమ్రా మంచి నటన.
  • సామాజిక కోణం – డబ్బు కోసం పేదల పరుగును బాగా చూపించారు.

కుదుపులు (నెగటివ్ పాయింట్స్):

  • కథా వేగం నెమ్మదిగా ఉంటుంది – కొన్ని ఎపిసోడ్స్ సాగదీతలా అనిపిస్తాయి.
  • హై టెన్షన్ మూమెంట్స్ తక్కువ – క్రైమ్ డ్రామా స్థాయిలో ఇంకా ఉత్కంఠ కావాలి.
  • కొన్ని పాత్రలు పూర్తి స్థాయిలో వాడుకోలేదు
  • ఎపిసోడ్‌ల సంఖ్య ఎక్కువగా అనిపించవచ్చు

తుది మాట :

“మట్కా కింగ్” ఒక స్టైలిష్ పీరియడ్ క్రైమ్ డ్రామా. వేగవంతమైన యాక్షన్ కంటే, కథ, పాత్రల ఎదుగుదల, వాతావరణం ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక. విజయ్ వర్మా నటన కోసం తప్పక చూడొచ్చు.

Amazon Prime Video లో క్రైమ్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఇది మంచి ఆప్షన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog