Adi da surprisu- Robinhood (2025)

అదిదా సర్ ప్రైసు - పాటకు

అంటుకుంటున్న సెగ, మండుతుందా చల్లారుతుందా ? 
కొన్ని సినిమాలు విడుదలకు ముందే మంచి ఆడియోగ పేరు తెచ్చుకొంటే ఇంకొన్ని , చిత్రం విడుదల అయ్యాక సన్నివేశాలతో ప్రేక్షకుడి మనసులో ఇమిడిపోయి ఆ పాటలు ప్రజల్లో చిరకాలం జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.  మొత్తానికి పాటలు వాటి సంగీతం అంటే చిత్రానికి వెన్నెముక లాంటివి ఓ రకంగా ఆ చిత్ర గెలుపోటముల భవిష్యత్తుని నిర్ణయించిన సందర్భాలు కూడా లేకపోలేదు. 
    మరి అలాంటి పాటలకు ప్రేక్షకులకు నచ్చిన బాగా మెచ్చిన నటీ నటులు నృత్యం చేస్తుంటే చూసి పరవశించిపోవాలని ఎంతమంది ప్రేక్షకులకి ఉండదు చెప్పండి. మరి ఇంత ఆకర్షణ, ప్రజాదరణ పొందిన "వెండితెర" అనే మాధ్యమంలో తీసుకొనే నిర్ణయాలు ఎంత ఠీవిగా ఉండాలి? అదే అంశం పైన ఈ డిజిటల్ యుగంలో వాడి వేడి చర్చలు విమర్శలు వస్తున్న చిత్రం గురించి ఆ పాటలో నృత్య భంగిమల గురించి విశ్లేషనాత్మక విమర్శ ఇప్పుడు చదివేద్దాం.  అదే మన ఈ అంశం. 

అసలేంటి ఈ వివాదం 

మార్చి 28 న ప్రపంచవ్యాప్తంగా  విడుదలకి సిద్ధం అయిన చిత్రం "ROBINHOOD". నితిన్, శ్రీ లీల జంటగా కేతిక శర్మ ఐటెం సాంగ్ లో వస్తున్న చిత్రం ముందుగానే ఈ పాటతో ఇందులోని నృత్య భంగిమలతో వివాదంలో చిక్కుకుంది. 

శేఖర్ మాస్టర్ సృష్టించిన నృత్యాలు ఆ మధ్య బాగానే పేరు తెచ్చుకొన్నపటికి ఇటీవల వచ్చిన మూడు పెద్ద చిత్రాల నుండి విశ్లేషించినట్లయితే ప్రతి నాయికకి ఇచ్చిన నృత్య భంగిమల్లో కాస్త శృతి మించినట్లే అనిపించింది.మిస్టర్. బచ్చన్ చిత్రం సితార్ పాట , డాకు మహారాజ్ నుండి దబిడి దబిడి , ఇప్పుడు ఈ అది దా సర్ ప్రైజు  పాటలో వేసిన హుక్ స్టెప్స్ జుగుప్స కలిగేలా ఓ స్త్రీ సిగ్గుతనాన్ని బాహాటంగా ఏహ్యంగా వేలం వేసినట్టు ఉంది. 

శృతి మించుతున్న శృంగార సన్నివేశాలు, నృత్యాలు, సాహిత్యం ఇలా ఒకటేమిటి అవకాశం ఉన్న  అన్ని అంశాల్లో సృజనాత్మకత పేరుతో చేస్తున్న ఆగడాలు ఒక్క చిత్రాలలోనే కాదు వాటిని అనుసరిస్తూ చిన్న పెద్ద యువతి, యువకులు, మహిళలు ఇలా కొందరు సోషల్ మీడియాలో అన్వయించుకొని చేసే రీల్స్ కలిసి కుటుంబంతో చూడాలంటెనే ఆలోచించేంత తక్కువ స్థాయిలోకి ఉంటున్నాయి. లే..  లే .. లే.  లేలేలే ... నా రాజా అంటూ మొదలయిన "విలువల - వలువల"  పరిధి దాటడం మొన్నటి డి. జె. (దువ్వాడ జగన్నాధం - నమ్మకం చమకం పాట ) తో కలుపుకొని ఇదిగో ఈ అది దా సర్ ప్రైజు వరకు దశాబ్దాలుగా ప్రచార మాధ్యమాలలో వివాదాలు అవుతున్న ఇల్లాంటి వాటికి  ఎక్కడో ఓ చోట చరమ గీతం పాడాలని సామాజిక ప్రేక్షుకుల మనసు వేదన. కొందరైతే బయటకొచ్చి బాహ్యంగానే విమర్శిస్తుంటారు కూడా.  

 

ఘాటైన విమర్శలు ప్రేమికులకు వ్యతిరేకులకు  

  • దీన్ని వ్యతిరేకిస్తూ చిత్రాన్ని చిత్రంగానే చూడాలి  అని ఎవరైనా అనుకునేవాళ్ళుంటే పోర్న్ కూడా చిత్రమే అనుకుని నటనని కుటుంబంతో హాయిగా చూడగలరా ... ? 
  • ఇదంతా ఓ నెగటివ్ పబ్లిసిటీ స్టెంట్ అని చోద్యం చూస్తున్న మీడియా , సంఘాలు కూడా లేకపోలేదు 
  • పెద్ద పెద్ద మీడియా సంస్థలే పల్లెత్తు మాటైనా మాట్లాడకపోవడంతో సరిపెట్టుకోవాలి అని కొందరు అంటుంటే, ఇలాంటి వాటికి అనవసరమైన ప్రచారం ఇవ్వడం కూడా ఓ ప్రమాదమే అంటున్న గొంతులు కూడా లేకపోలేదు 
  • అసలైన చిక్కల్లా ఇలాంటి పరిధిని మించిన సందర్భాల్లో, సన్నివేశాలైతే - ఇవి చూసి జాగ్రత్తగా ఉండాలి అని మేము మంచే చెప్తున్నాం అని చిత్రీకరించిన వాళ్ళు అంటే , అసలంటూ ఇలాంటి కూడా ఉంటాయా అని, వాటిని ఎలా చేయాలో (యు ట్యూబ్ మాధ్యమాలు చూసి నేర్చుకుని నేరాలు చేస్తున్న వారి సంఖ్యా , వాటి వార్తలు ఓ ఉదాహరణ ) అనే కొందరి ఆలోచనలకి బీజం ఇవి చూసాకే వస్తుంది అనే వాదన కూడా వుంది. 
  • అప్పుడప్పుడు ఇదుగో ఇలాంటి కొన్ని ఆవగింజల్లాంటి విజయాలు కూడా వస్తున్నాయనుకోవటం సర్ది చెప్పుకోవడమే  

ఈ వ్యాసాంశము చదివాక మీరు దీనితో ఏకీభవిస్తున్నారో లేదో కామెంట్ లో తెలియచేయండి .. 👍


Make your own poll

లిరిక్స్ :  

నషా నషా నషా నషా నషా నషా రే  నషా నషా నషా నషా నషా నషా నషా నషా రే .. మెనీ మెనీ డేస్ ఎగో  మామిడి పల్లిలో రాతిరి రైతే తగిలాడే  పైకే ఎగబడు సమయంలో పంట దిగుబడి రాలేదన్నాడే   అలిగానే వాడ్నడిగానే ఆ పంటేదో చూపించాడే 

వరి కాదె మిరపే కాదె  చెరుకె కాదె వాడు పెంచిన పంటే గంజాయే .. 

అదిదా సర్ ప్రైజు  అదిదా సర్ ప్రైజు.. అదిదా సర్ ప్రైజు అదిదా సర్ ప్రైజు

.... మ్యూజిక్ -- 

జూబ్లీ హిల్స్ లో ఒక పాష్ పబ్ లో యమా క్లాస్ కుర్రాడే అలా ఫ్లాషు అయ్యాడే

చిన్ని అన్నాడే నన్ను  మున్ని అన్నాడే  కొంచం దూరమున్నాడే ఏంతో గౌరవించాడే 

తన వెంటే రమ్మన్నాడే తన విల్లాకే నే వెళ్లానే 

వాడికి జోడి కాదంటూ వాడి డాడీకి తోడని మున్నిని పిన్ని గా మార్చాడే

అదిదా సర్ ప్రైజు  అదిదా సర్ ప్రైజు..  అదిదా సర్ ప్రైజు  అదిదా సర్ ప్రైజు  అదిదా సర్ ప్రైజు.. ఉ .. ఉ 

బులి బులి బుగ్గల బాయ్ ఫ్రెండొకడు బాంగ్ళూర్ లోనా కలిశాడే 

హ్యాండేస్తే సెకండ్ హ్యాండయ్యేంత హ్యాండ్సమ్ గా ఉండేవాడే 

వాడి వాలెట్లో క్యూటీ అమ్మాయి ఫోటో చూసానే వీలవేశానే 

మరదలు కాదె గర్ల్ ఫ్రెండ్ కాదె మరి ఎవరంటే అది సర్జరీ ముందర వాడేనే  

అదిదా సర్ ప్రైజు  అదిదా సర్ ప్రైజు..  అదిదా సర్ ప్రైజు అదిదా సర్ ప్రైజు.. ఉ .. ఉ 

మ్యూజిక్... డైలాగ్స్ ... మ్యూజిక్ 

(M ) అదిదా సర్ ప్రైజు  అరే కొట్టిన లాటరీ ఎక్స్ పైర్ ఐతే 

అదిదా సర్ ప్రైజు దాచిన నోట్లు రద్దయిపోతే 

అదిదా సర్ ప్రైజు..   ఆపిల్ ఫోన్ కి ఆపిల్ పండొస్తే 

అదిదా సర్ ప్రైజు.. ఉ .. ఉ  కుండ బిరియానిలో కుండే బాగుంటే

అదిరిపోయింది సర్ ప్రైజు 

..మ్యూజిక్.---END

తన పంతమే నెగ్గించుకున్న డైరెక్టర్ :

చాలా విమర్శలు కాస్త హడావిడి తెచ్చుకున్నాక విదూధలయిన రోబిహ హూద్ చిత్రంలో ఈ పాట గోల పట్టించుకోకుండా ముందుగా చెప్పినట్టే ఈ నృత్య భంగిమలో ఎటువంటి తప్పు బూతు మాకేం కనిపించలేదు అని డైరెక్టర్ వెంకి కుడుముల, డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ తో పాటు కలిసి చిత్రంలో ఈ నృత్య భంగిమను  అల్లాగే ఉంచడం మీడియా మిత్రులని కలిచి వేసిందో లేదో మరి అందరూ అనుకున్నట్టు - ve పబ్లిసిటీ స్టంట్ ఏ అనుకోవడం తప్పేలా కనిపించింది.  సెన్సర్ బోర్డు తో మాట్లాడటం వాళ్ళ సాయ శక్తులా ప్రయత్నించినప్పటికి వారి నుండి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాకపోవడంలా , వారికి కూడా ఇలాంటి సన్నివేశాలకు పెద్ద పట్టించుకోని స్తితిలో విధులు నిర్వహిస్తుండటం అత్యంత ఆశాజనకం అనుకోని అలవాటు చేసుకోవాలని చెప్పకనే చెప్పినట్టులా ఉంది . 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog