ponman

 పొన్ మన్(హాట్ స్టార్) 

మలయాళ కథా నాయకుడు బసిల్ జోసెఫ్ (Basil Joseph)కు తెలుగు లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటె అతను నటించి మెప్పించిన 'జయ జయ జయ జయహే', 'సూక్ష్మదర్శిని' సినిమాలు తెలుగు ప్రేక్షకులను యెంత ఆకట్టుకున్నాయో తెలియంది కాదు. ఆయన నటించిన మలయాళ సినిమా 'పొన్‌మాన్' తాజాగా (మార్చి 14న) జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సినిమా కథా కమామీషు ఏమిటో ఈ రివ్యూలో చదివేయండి.

ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవసరం కోసం చేయిచాచి అడగటం అనే అలవాటు సహజంగా చాలామందికి ఉండే ఉంటుంది. అది బంగారం అయినా, డబ్బులు అయినా, వస్తువులు అయినా. కాకపొతే తిరిగి ఇవ్వాలి అన్నప్పుడే వస్తుంది అసలైన చిక్కు , ఇవాళ - రేపు అంటూ వాయిదాలు వేస్తూ మనసొప్పకుండా చికాకు చిరాకు తెప్పిస్తుంటారు. మరీ గట్టిగ అడిగితె అంతటితో తెగిపోయేలా " ఇవ్వకుండా ఏమైనా పారిపోతామా" అంటూ వెతకరిస్తూ ఉండేవాళ్ళు లేకపోలేదు. తీసుకునేప్పుడు ఉన్న వినయం అవసరం బాధ్యత ఇవ్వటంలో కనిపించదు. ఈ చిత్ర కదా కూడా ఇంచు మించు అలాంటి సన్నివేశాలతో తిరుగుతుంటుంది. 

కధా కమామీషు 

పి. పి. అజేష్ పాత్రలో జోసెఫ్ నటించాడు. జోసెఫ్ నగలను అమ్మే ఓ అమ్మకం వ్యక్తిగా పని చేస్తుంటాడు.  అది నగల దుకాణాలలో కాకుండా వివాహాది శుభకార్యాలు జరిగే ఇళ్ల వారికి, పేదవారికి అప్పుగా ఇవ్వటం వాటికి రావలసిన డబ్బులను ఆ శుభకార్యాలకు వచ్చే చదివింపుల నుండి తీసుకోవడం వృత్తిగా సాగిస్తుంటాడు. దీనికోసం ముందుగానే ఒప్పందం చేసుకుని అన్ని లావాదేవీలలో స్పష్టంగా ఉంటాడు. అలా ఓ  కొల్లంలో ఉండే ఓ కుటుంబం బ్రూనో స్టెఫీ వాళ్ళది. బ్రూనో తన చెల్లెలి పెళ్లికోసం మంచి సంబంధం అని అబ్బాయి వాళ్ళు అడిగినట్లు నగలు పెట్టడానికి ఒప్పుకుంటారు.  ఉద్యోగం లేని కారణంగా లోకల్ పార్టీ కార్యకర్తగా ఉంటూ అవి సమయానికి సంపాదించ లేక తాను  నమ్మిన పార్టీ కోసం జరిగిన గొడవలో  ఏ సహాయం చేయలేమని చెప్పటంతో తెలిసిన స్నేహితుడి దగ్గర సలహా కోసం వెళితే ఆటను ఇష్టం లేకపోయినా పార్టీ కోసం రాజేష్ ని అడగడం ఆలా 25 తులాల నగలు తీసుకుని పెళ్లి జరిపిస్తారు. అనుకున్నట్లు చదివింపులు పెద్దగా రాకపోవడంతో  కధ అడ్డం తిరుగుతుంది. అక్కడి నుండి పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ నగలను ఎలా సాధించాడు అనేది ఈ చిత్ర కథ. 


విశ్లేషణ :  

ముఖ్యంగా ఇది కూడా ఓ కధే నా అనుకున్న ప్రేక్షకుడు అడుగడుగునా లీనమవుతూ ఉంటాడు. ఏంటి అసలు ఇది అనుకున్న ప్రతిసారి బోర్ కొట్టకుండా అక్కడొక ఉద్వేగ అనుభవాన్ని హాస్యాన్ని అలా ఏదొక సన్నివేశాన్ని అందించి ప్రేక్షకుడిని 2 గంటల పాటు కట్టి పడేస్తారు దర్శకుడు జోతిష్ శంకర్

నాయకుడు ఓ తాగుబోతులా వుంటూ తాను కావాలనుకున్న దాన్ని ఎలా దక్కించుకున్నాడు అనేది చూడవలసినది. పెళ్లి అయి నగలు తిరిగి ఇస్తారనుకున్న అత్తారింటికి వెళ్లిన అమ్మాయి అక్కడి మనుషుల మనసులు వ్యక్తిత్వాలు తారసపడి ఇక అవ్వదు ఈ ప్రయత్నం కూడా ఆగిపోయింది అనుకున్న ప్రతిసారి కధని ముందుకు నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. 

ఆడపిల్లల పెళ్లిళ్లు పూర్తిగా వారి ఇష్టంతో జరగట్లేదు అని,  మతం మనకు అన్నం పెట్టదని, ఏ పార్టీలు రాజకీయాలు అవసరానికి ఆదుకోలేకపోవచ్చు అని, పట్టుదల ఉంటె సాధించలేనిది ఏమి లేదు అని ఇలా పరోక్షంగా చాలా విషయాలు తెలుసుకోవచ్చు.  

సమయానికి తగినట్టు జోసఫ్ చెప్పే మాటలు పరోక్షంగా ఒక్కో సమస్యను పరిష్కరించి సహాయాన్ని అందించేలా ఉంటాయి. 

ఆస్తులు : 

జోసెఫ్ మరియు ప్రధాన పాత్రల నటన, థిన్ లైన్ కథ , దర్శకత్వం, లిజోమోల్ జొస్ నాయిక సహజత్వం, కుటుంబం కూర్చుని చూసే చిత్రం  

కుదుపులు :

కాస్త నెమ్మదిగా సాగే రెండవభాగం, దీపక్ పరాంబోల్ పాత్ర పేరు మార్కండేయ శర్మ అని పెట్టి అతని చేత ఓ సన్నివేశంలో స్నేహాన్ని మాటని కాపాడటం కోసం ఓ నాటకంలో జీసస్ వేషం వేయించటం 

నటీనటులు :  బాసిల్ జోసెఫ్, లిజోమోల్ జోస్ , సజీన్ గోపు, ఆనంద్ మన్మధన్,దీపక్ పరంబోల్ తదితర నటులు    
దర్శకులు :  జోతిష్ శంకర్   
సంగీతం : 
 జస్టిన్ వర్గహేశ్ 
నిర్మాత : వినాయక అజిత్

ఎడిటర్ : నిదిన్  రాజ్ ఆరోల్   

-- అవ్యజ్ (శంకర్) 2 .95 ***/5*****





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog