Ramam-Raghavam

  రామం రాఘవం(థియేటర్)

ఈటీవీ హాస్య ప్రేరిత, బు ల్లితెర బ్లాక్ బస్టర్ గా నిలిచిన, కొందరికి స్ట్రెస్ బరస్టర్ అయిన జబర్దస్త్ వారావాహిక ఫేమ్ ధనా ధన్  "ధన్ రాజ్ " తొలిగా దర్శకత్వంలోకి అడుగు పెట్టి శివ ప్రసాద్ యనలతో కలిసి  తీర్చి దిద్దిన కథ, సన్నివేశాలతో తయారు చేసుకొని వచ్చిన తెలుగు చిత్రం ఈ రామం - రాఘవం
ఈ చిత్రం
టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులకు ఓ మంచి ఉద్దేశాన్ని అభిప్రాయాన్ని కలిగించటం శుభసూచికం. ఐ.ఎం.డి.బి. లో 9.3 రేటింగ్ నమోదు చేసుకున్న , 21 ఫిబ్రవరి నుండి థియేటర్ లలో ప్రదర్శింపబడుతున్న సందేశాత్మక భావోద్వేగ చిత్రం ఎలా ఉందో పూర్తి విషయం ఇప్పుడు తెలుసుకుందాం. 


సముద్రఖని తండ్రి ప్రధాన పాత్రలో, ధనరాజ్ తానే నటించి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పూర్తి ఎమోషనల్ డ్రామాగా చెప్పవచ్చు. అసలు నటించడానికి ఒప్పుకుంటారో లేదో అనుకున్న సీనియర్ నటులు సముద్రఖని ధన్ రాజ్ చెప్పిన ఈ చిత్ర కథ విని పొగడంతో పాటు తానే దర్శకత్వం కూడా చేయాలనీ ప్రోత్సహించారని ఈ చిత్ర ప్రచార సమావేశంలో ధన్ రాజ్ చెప్పిన విషయం గుర్తుచేసుకుందాం. మరి ఈ చిత్రంలో మిగిలిన అంశాలు ఏవేవి ఎలా ఉన్నాయో వాటి కధా కమామీషు ఇప్పుడు చదివేద్దాం. 
Moksha Actress - Instagram

కధా కమామీషు 

ఓ నిజాయితీ గల తండ్రికి తప్పుడు దారులు తొక్కే కొడుకు ఉండటం సాధారణ కధల్లో ఉన్నప్పటికీ ఈ మధ్య వస్తున్న వార్తల నుండి తీసుకున్న ఈ చిత్ర కధలో, ఈజీ మని కోసం తండ్రిని చంపటానికి కూడా వెనుకాడని కొడుకు చివరికి ఎలా మారాడు అనేది చూడవలసిన కధ. డాక్టర్ చేయాలనే ఆశతో కొడుకే పూర్తి లోకంగా బ్రతుకుతున్న తండ్రికి ఎదురైన చేదు అనుభవాల్ని తట్టుకుని ఆ తండ్రి నిలబడ్డాడా లేదా అనేది అంతరార్ధం.

విశ్లేషణ: 

ఓ తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంవాదమే అయినా, అపార్థాల వెనుక వున్న ప్రేమని అర్ధం చేసుకోలేని కొడుకు పాత్రలో రాఘవ (ధన్ రాజ్) ఇమిడిపోయాడు. ఓ నిజాయితీ కల ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో జీవించిన అనుభవ నటుడు సముద్రఖని రామం పాత్రకి న్యాయం చేశారు. సాధారణంగా తండ్రి కొడుకుల మధ్య బంధం చాలా చిత్రాలలో ఎప్పుడు చూసేదే అయినా కానీ ఇందులో ధన్ రాజ్ ఆ బంధాన్ని కొత్తగా చూపించటానికి ప్రయత్నం చేశాడనే చెప్పాలి. 
భావోద్వేగాలను పండించడంలో ధన్ రాజ్ కంటే తండ్రిగా రామం చేసిన నటన కళ్లు చెమర్చేలా చేసి తండ్రి అనే బంధం పైన, రక్త సంబంధాల పైన మరింత గౌరవాన్ని నింపుతుంది. హాస్యానికి పెద్దగా తావివ్వకుండా పూర్తి ఎమోషన్ తో నడిచిన కధనం. నాయిక మోక్ష ప్రేమ పక్షిలా చేరువవుతుందనుకొనే లోపే ఎగిరిపోతుంది. ప్రేమ వల్ల నాయకుడు మంచిగా మారితే సాధారణ కథ అయిపోయేది. వ్యాపార  అంశాలు ఐన శృంగారం, పాటలు, యుద్ధ సన్నివేశాలు లేకుండా పూర్తి అనుభవాల భావోద్వేగాల పైనే దృష్టి పెట్టిన చిత్రం. 
Amazon Deals

ఆస్తులు : 

మంచి కథ, ధన్ రాజ్ డైరెక్ట్ చేసి సీరియస్ గా నటించిన తీరు, చివరిగా తండ్రిని కాపాడుకోడానికి చేసిన యత్నంలో నటన, విరామం ముందు ఇచ్చిన మలుపు, సముద్రఖని అద్భుత నటన

కుదుపులు : 

మొదటి ప్రయత్నం కనుక దర్శకత్వంలో పరిణితి చెందాలనిపించిన కొన్ని సన్నివేశాలు, హాస్యం లేని, పాటలు లేని ఒకే మూడ్ ఉండటం, సాదాగా తెలిసినట్టు సాగే ప్రథమార్ధం, చాలా అవసరమైనవే అయినా మళ్లీ మళ్లీ చూసినవే అనిపించే కొన్ని సన్నివేశాలు 

Moksha Instagram

నటీనటులు :  ధన రాజ్, పృధ్వీ 30 yrs ఇండస్ట్రీ , సముద్రఖని, మోక్ష , సునీల్, హరీష్ ఉత్తమన్, సత్య , రాకెట్ రాఘవ, చిత్రం శ్రీను, రచ్చ రవి, శ్రీనివాసరెడ్డి తదితర నటులు    
 దర్శకులు :  ధనరాజ్ కొరనాని   
సంగీతం :  అరుణ్ చిలువేరు      
 
నిర్మాత : పృధ్వీ పొలవరపు 

ఎడిటర్ : మార్తాండ్ .కె వెంకటేష్  

-- అవ్యజ్ (శంకర్) 2 .999***/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog