Jigris మూవీ రివ్యూ - Review Telugu

 Jigris మూవీ రివ్యూ (తెలుగు) – Amazon Prime & SunNXT OTT బడీ-కామెడీ-డ్రామా విశ్లేషణ


Shlokas online classes,Nitya pooja vidhanam training, Online pooja classes Telugu, Learn shlokas Telugu English, Daily pooja training online

 ఆస్తులు (పాజిటివ్ పాయింట్స్) :

పరిచయం

ఐ.ఎం.డి.బి . లో 9 పైగా రేటింగ్ నమోదైన ఈ “Jigris” సినిమా హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో 2025 నవంబర్ 14న థియేటర్ లలో విడుదలైంది. ఇది క్రిష్ణ బురుగుల(కార్తీక్), రామ్ నితిన్ (ప్రవీణ్), మణి వక్కా (ప్రశాంత్),  ధీరజ్ ఆత్రేయ (వినయ్) వంటి యంగ్ నటీనటులతో రూపొందిన బడీ-కామెడీ-డ్రామా చిత్రం. ఇప్పుడు ఈ మూవీ Amazon Prime Video మరియు SunNXT వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లపై 2026 జనవరి 6న నుండి స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది.

కథాకమామీషు :

“Jigris” కథలో నలుగురు చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్స్ — కార్తిక్, ప్రవీణ్, వినయ్, ప్రశాంత్ — కార్తీక్ నాయకత్వంలో తమ చిన్ననాటి జ్ఞాపకాలతో ప్రాణస్నేహాన్ని చూపిస్తారు. కాలేజ్ తర్వాత వారి బిజీ జీవితాల్లో గడిపేస్తుండగా, ఒకసారి మిత్రుడు ప్రశాంత్‌కు కాన్సర్ వస్తుంది. ప్రశాంత్ చివరి కోరికగా చాలాసార్లు అనుకుని వెళ్లలేకపోయిన గోవా ట్రిప్‌కు వెళ్లాలని అతను కోరడంతో, నలుగురు మారుతీ 800లో క్రేజీ ప్రయాణానికి బయలుదేరుతారు. ఆ ప్రయాణంలో మొబైల్, డబ్బులు మర్చిపోవటం, కార్ ట్రబుల్‌లు, కొన్ని పాత జ్ఞాపకాలు, హాస్యం-ఎమోషనల్ ఇలాంటి సన్నివేశాలతో ఈ ట్రిప్ వారి జీవితాలను మార్చి వేస్తుంది — అదే కథకి ప్రధాన ఆకర్షణ.

విశ్లేషణ :

“Jigris” సినిమా అభిమాన బడ్డీ - కామెడీ తరహా భావాన్ని అందరికీ అందేలా ఉంచుతుంది. ఈ కామెడీ-ఎమోషన్ కథలో హాస్యం, సన్నివేశాల మధ్య సహజంగా ఎమోషనల్ భావాలు కలిసిపోయాయి. నటీనటుల ప్రదర్శన కథని కొత్తగా కాకపోయినా, క్రిష్ణ బురుగుల తన కామెడీ-టైమింగ్ మరియు భావోద్వేగ నటనతో ప్రేక్షకులను ఆకర్షించాడు.
నూతన దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల సాహస డైరెక్షన్ మరో దర్శకుడి చేయాలనుకున్న ప్రయోగానికి కొత్త అనుభవాన్ని ఇస్తుంది. స్నేహం-ప్రయాణం తాలూకు స్వభావంగ జరిగే గోవా ట్రిప్ లో ఎదురైన సంఘటనలు, ఫ్రెండ్‌షిప్‌ భావాలు యువతకు మరియు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరగా చేరి వారికి కొన్ని పాత జ్ఞాపకాలను కూడా దగ్గర చేస్తాయి.

సాంకేతిక అంశాలైన సంగీతం, కెమెరా వర్క్ సినిమా యొక్క విజువల్ ప్రెజెంటేషన్‌ను మెరుగుపరచి ప్రయోజనాన్ని ఇచ్చాయి. కానీ, కథలో పెద్ద మలుపులు లేకపోవడం మరియు సమీక్షకులు దృష్టిలో  “గ్లామర్ ప్రదర్శన లేకపోవడం - వ్యాపారాంశాల బలానికి లోటు” అనే విమర్శ కూడా ఉంది — ఇది కొంతమంది పరిమితిగా ప్రేక్షకులకు మాత్రమే చెందినది అనే అనుభూతి అనిపించవచ్చు.

Shlokas online classes,Nitya pooja vidhanam training, Online pooja classes Telugu, Learn shlokas Telugu English, Daily pooja training online

 ఆస్తులు (పాజిటివ్ పాయింట్స్) :

ఆస్తులు:

  • కృష్ణ బురుగుల నటన (కార్తీక్) కామెడీ-ఎమోషన్ మధ్య తన పాత్రకు అనువైన ప్రదర్శన ఇచ్చాడు.
  • స్నేహం పరిభాషగా  నలుగురు మిత్రుల బంధం, వారు చేసిన గోవా ప్రయాణ కథ నిర్మాణం మంచి థ్రిల్‌ని ఇస్తుంది.
  • OTT-ఫ్రెండ్లీ లెంగ్త్ : Amazon Prime & SunNXT వంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌లపై ఇంట్లోనే సరదాగా వీక్షించడానికి సరిపోతుంది.
  • ఎమోషనల్-కామెడీ బ్యాలెన్స్ డ్ గా ఉంటూ నవ్వులతో పాటు ఎమోషన్ కూడా చూపుతూ ప్రేక్షకుల గుండెల్ని తాకుతుంది.

కుదుపులు:

  • కధనం కొంచెం సాదాగా సాగి, పెద్ద మలుపులు లేకపోవటంతో కొంత నిర్లక్ష్యం జరిగిందేమో అనిపించవచ్చు.
  • ఫ్లాష్-బ్యాక్ స్థాయిలో కథ మొత్తం మధ్యలో కొంత నిదానంగా సాగడానికి కారణం అనిపించింది.
  • గ్లామర్-పాళ్ళు అసలు లేకపోవడం అనేది సామాన్యంగా ఇలాంటి చిత్రాలలో ఎక్కువ గ్లామర్ ఆశించే ప్రేక్షకులకు కొంచెం అసంతృప్తి అనే చెప్పవచ్చు 
  • మొదటి ప్రయత్నంగ చేసిన దర్శకత్వంలో  కొంత అస్థిరత కనిపించటం సహజమే.

తుది మాట :

“Jigris” — మంచి బడీ-కామెడీ-డ్రామా అనుభవం కోసం OTTలో చూడదగ్గ చిత్రం. ఇది ప్రధానంగా ప్రేమ, స్నేహం, ప్రయాణం, హాస్యం-ఎమోషన్ వంటి అంశాలు కలిపి కుటుంబం మొత్తం కలిసి వీక్షించదగిన కథగా నిలుస్తుంది. పెద్ద థ్రిల్లర్ కోసం కాదు, కానీ సరదా నవ్వులు, స్నేహ బంధాలకు సంబంధించిన అనుభూతులు మీ హృదయాన్ని తాకేలా మాత్రం ఉంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog