Hisab-barabar

 హిసాబ్-బరాబర్ (జీ-5 ఓ.టి.టి)

ప్రముఖ తమిళ నటుడు ఆర్.మాధవన్ నటించిన హిసాబ్ బరాబర్, ZEE5 లో ప్రసారం అవుతున్న తాజా హిందీ, ఇతర భాషల అనువాద చిత్రం ఎలా ఉందొ తెలుసుకుందాం.  

కధా కమామీషు

ఈ చిత్రం ప్రధానంగా బ్యాంకర్ల మోసాలపై తీసిన వినోదాత్మక, సమాచార సంహిత, సందేశాత్మక చిత్రం అని చెప్పవచ్చు.  రాధా కృష్ణ మోహన్ (మాధవన్), ఒక నిజాయితీ కలిగిన రైల్వే టికెట్ కలెక్టర్ మరియు చార్టర్డ్ అకౌంటెంట్, లెక్కలు చూస్తూ ఖర్చు చేసే పద్దతి కలిగిన తత్వం ఉన్న ఉద్యోగి. అతనికి డూ బ్యాంక్ నందు కలిగి ఉన్న ఖాతా నుండి 27.50 రూ. తొలగింపబడుతుంది. అది ఎలా లెక్క తప్పిందో అని తెలుసుకునే ప్రయత్నంలో, అది ఆ బ్యాంక్ యజమాని వ్యాపారవేత్త మిక్కీ మెహతా (నీల్ నితిన్ ముఖేష్) చేస్తున్న కనిపించని, ఖాతాదారులు గుర్తుపట్టలేని మోసంగ అనుమానిస్తాడు. తన విచారణలో బ్యాంక్ CEO,  నేతృత్వంలోని 2000-కోట్ల స్కామ్ ఎలా బయటపెట్టాడు? అది ఎలా ముగుస్తుంది? అనే సమాధానాల సమాహారమే ఈ చిత్ర సన్నివేశాల కధ.

విశ్లేషణ

ప్రతి బ్యాంక్ లో  జరిగే డిపాజిట్ మరియు వడ్డీ లావాదేవీల చిట్టాను బయటకి తీయడమే ఈ చిత్రంలో ప్రధాన అంశం. ప్రతి బ్యాంకులు ఇచ్చే రుణాలు వడ్డీలు, నికర ఆదాయ ఖాతాల నుండి తీసుకొనే వడ్డీకి ఖాతాదారులకు ఇచ్చే రాయితీలలో జరిగే సూక్ష్మ మోసాలను, సమయన్నీ లెక్కించి వడ్డీ చెల్లించే విధానాలు, ఖర్చులనుఁ సంవత్సరాంతంలో నిర్వహణ(మెయింటనెన్స్) పేరుతో చేసే వసూళ్లు వాటి విధానాలు దాని ద్వారా బ్యాంకు యజమానులు ఎలా లబ్ది పొందుతున్నారు అనే అంశాలను చూపించారు.  

కుదుపులు

మంచి సందేశం ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది, సంగీతం, హాస్యం అసలు లేకపోవడం, నిరాశ మిగిల్చింది. ఎంచుకున్న కధాంశం చూపించటంలో కొంత జాప్యం ఉందనిపించింది. పాటల ఆస్కారం లేదు.

ఆస్తులు

కధా నాయకుడి మాధవన్ నటనా అనుభవం కనిపించిందనే చెప్పాలి.  పోలిస్ ఆఫిసర్ గ నాయకి కీర్తి కుల్హారి చేసిన  నటన ఒకే. మధ్యతరగతి ఖాతాదారులు ఎదురయ్యే సమస్యలు బాగా చూపించారు.  

నటీనటులు :  మాధవన్, నీల్ నితిన్ ముఖేష్, కీర్తి కుల్హరి మరియు ఇతరులు హిందీ నటులు   
దర్శకుడు:  అశ్విని ధీర్    
సంగీతం :  అమన్ పంత్    
బ్యానర్ :  శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ 
నిర్మాత : KT కుంజుమోన్, జియో స్టూడియోస్, SP సినీకార్ప్    

-- అవ్యజ్ (శంకర్) 2.5 ***/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog