మట్కా

పాఠకులారా.. గత నెల అంటే నవంబర్ మొదటివారంలో థియేటర్ లలో విడుదలయిన వరుణ్ తేజ్ 'మట్కా ' పెద్దగా రాణించలేకపోయింది. ఓ నెల తదుపరి ఇప్పుడు 5 డిసెంబర్ నుండి ఓ.టి.టి. ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శింపబడుతోంది. దాని కధ-కమామీషు, ఆటుపోట్లు ఇప్పుడు మన అవ్యాజ బ్లాగు నందు చర్చించుకుందాం.
బర్మా నుంచి శరణార్థిగా విజాగపట్నంకు చిన్నతనంలో వచ్చిన వాసు (వరుణ్ తేజ్) స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో కరువు లాంటి అణగదొక్కడం అనే పదాలు వింటూ ఆకలి కోసం తన అమ్మని తనఖాకి అడిగిన మూర్ఖుడు నుండి తన అమ్మను ఆ ఆకలిని రక్షించుకోడానికి జరిగిన గొడవలో హత్య చేయటం పడవలని కాల్చి వేసి ఆ నేరంలో జువైనల్ జైలుకు వెళ్తాడు. అక్కడ పి.రవికుమార్ జైలర్ గ ఉంటూ డబ్బుకోసం కుస్తీపోటీలలోకి వాసు బలాన్ని తెలివిని ఉపయోగించుకుంటారు. అలా జైలు శిక్ష పూర్తయి బయటకు వచ్చిన తర్వాత అప్పల్ రెడ్డి (అజయ్ ఘోష్) వద్ద కూలిగా పనిలో చేరుతాడు.
ఆ తర్వాత లోకల్ గా పేరు మోసిన వ్యాపారి, కూల్ స్పాట్ రెస్టారెంట్ ఓనర్ నాని బాబు (కన్నడ కిశోర్)తో చేతులు కలిపి అంచలంచెలుగా స్వంత వ్యాపారాన్ని విస్తరిస్తాడు. ఎంచుకున్న మార్గం ఏదైనా వందల మందికి ఆకలి బాధ తీర్చాలి జీవితం కల్పించాలి అని బట్టల తయారీ వ్యాపారం పెట్టుకోవడానికి సరుకు కోసం ముంబై వెళ్లడం అక్కడ వాసుకి వచ్చిన ఆలోచన హీరో జీవితంని చిత్ర కధని మలుపు తిప్పుతుంది.
బట్టల కోసం ముంబై వెళ్లిన వాసును మలుపు తిప్పిన సంఘటన ఏంటి? సుజాత (మీనాక్షి చౌదరీ)తో ప్రేమ పెళ్లి వ్యవహారం, సోఫియా (నోరా ఫతేహి)తో స్నేహం, కేబీ (జాన్ విజయ్)తో ఉన్న పాత శత్రుత్వం ఏమిటి? చిన్న వ్యాపారం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను విచ్చిన్నం చేయగలిగిన గేమ్ మట్కా కింగ్‌గా వాసు ఎలా మారాడు? అలాగే మట్కా జూదాన్ని నిర్వహిస్తున్న వాసును అరెస్ట్ చేయడానికి వచ్చిన సాహు (నవీన్ చంద్ర) సక్సెస్ అయ్యాడా? చివరకు వాసు జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే మట్కా మూవీ కథ.
ఆస్తులు :
వరుణ్ తేజ్ నటన విషయంలో చాల బాగా అనిపించింది. గద్దలకొండ గణేష్ చిత్ర అనుభవం బాగా కలిసొచ్చింది. వాసు పాత్ర తప్ప వరుణ్ తేజ్ ఎక్కడా కనిపించలేదు. నటుడిగా ఆయన ఈ చిత్రంలో చేసిన నటన స్క్రీన్ మీద చూడాల్సిందే, మీనాక్షి చౌదరీ ఉన్నంత సేపు ఆకట్టుకొనే విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నోరా ఫతేహి పాత్రనిడివి తక్కువయినా కూడా అందంతో పాటు ఫెర్ఫార్మెన్స్‌కు కాస్త ఆసరా ఉన్న పాత్రతో మెప్పించారు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నేపధ్య సంగీతం, క్యాస్టూమ్ విభాగాలు సినిమాకు బలం చేకూర్చాయి.
కుదుపులు:
వైవిధ్యం పెద్దగా లేని కధ, థ్రిల్లింగ్ లేదా ఉత్తేజ పరిచే కదలికలు లేకుండా సాదాగా కథ సాగడం, మాస్ ప్రేక్షకులకి కావలసిన శృంగార భరిత సన్నివేశాలు, నాయిక అందం లేకపోవడం, వామప్ క్లబ్ పాటలు ఆకట్టుకోకపోవడం
నటీనటులు: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరీ, నోరా ఫతేహి, సలోని అశ్విని,సత్యం రాజేశ్, పీ రవిశంకర్, కన్నడ కిషోర్,నవీన్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు
కథ, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజేందర్ రెడ్డి తీగల,రజనీ తాళ్లూరి
సినిమాటోగ్రఫి: కిషోర్ కుమార్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్
-- అవ్యజ్ (శంకర్) 2.8**/5*****
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.