Leela Vinodam

లీలా వినోదం

ఇండియన్ తెలుగు యు-ట్యూబర్ మరియు చిత్ర నటుడు షణ్ముఖ్ జశ్వంత్ కి తాను చేసిన షార్ట్ ఫిల్మ్స్ , వెబ్ సిరీస్ ల వలన యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించాడనే చెప్పవచ్చు. వెండితెర పైన ప్రయత్నించిన చిత్రం ఈ లీలా వినోదం కధా కమామీషు ఎంతో తెలుసుకుందాం.

Web Hosting

శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్ సుంకర దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం నిన్నటి (19) నుండి ఈ.టి.వి.విన్ ప్లాట్ ఫార్మ్ లొ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్ర కధ 2008 నాటి 'తణుకు' ప్రాంత మధ్యలొ నడుస్తుంది. ప్రసాద్ (షణ్ముఖ్)  ఓ మిడిల్ క్లాస్ కి చెందిన కుర్రాడు, రాజీవ్, అశోక్, సాగర్ అనే స్నెహితులతో కాలేజ్ చదువు పూర్తి చేసుకుని  పోలీస్ డిపార్టుమెంటులో ఉద్యోగం చేయాలి అనే ఆలోచనలో ఉన్న  తనకి , గడిచిన మూడేళ్ల డిగ్రీలో  తనతో పాటు చదువుతున్న లీలా( అనఘ అజిత్)ను ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పకుండా మౌన ప్రేమ సాగిస్తుంటాడు. 

ప్రతి విషయానికి అనవసరంగా ఏదేదో తనలో తానే ఊహించుకుని కంగారు పడిపోయే మనస్తత్వం కల పాత్ర ప్రసాద్ గ షణ్ముఖ్ జస్వంత్ కనిపిస్తాడు. తనకి బాగా దగ్గరైన బాల్య స్నేహితుడు రాజీవ్ అన్నిటిలో తోడుంటూ ధైర్యం చెబుతుంటాడు. అలాగే ప్రసాద్ ప్రేమ విషయంలో కూడా సహకరించి తన ప్రేమని లీలాతో చెప్పేలా ధైర్యం చెప్పటంతో ప్రసాద్ లీలకి ప్రేమను వ్యక్తం చేస్తాడు.. ఆ తరువాత లీల దగ్గరి నుండి సమాధానం కోసం చాలా మదన పడుతున్న ప్రసాద్ కి లీలకి మధ్య ఏం జరిగినది వారి స్నేహితుల ద్వారా ఎలా విజయం వచ్చింది అనేది తెలుసుకోవడమే ప్రధానాంశం. అసలు లీల ఎందుకు మౌనం వహించిండో తెలుసుకోవటానికి పడే ఆతృత , అక్కడి పరిణామాలు ఏమిటి అనేవి చిత్ర కథ.

విశ్లేషణ : 

పాత నోకియా 1100 గుర్తులు సింబోలిక్ గా  టైటల్స్ లో చూపించి, దాన్ని అనుసరిస్తూ చిత్రంలో కూడా లవర్స్ అదే ఫోన్ వాడుతూ చేసిన సృజనాత్మక విభిన్నత చిత్రంలో కధనంలో పెద్దగా కనిపించదు. 

అలనాటి కాలేజీ రోజులు కొంచం జ్ఞాపకానికి వస్తాయి. తొలిప్రేమ చిత్రం విడుదలయిన రోజుల్లో ఉన్న యువత మనసును ప్రతిబింబించేలా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు. యువతకి ఎపుడోకప్పుడు సాధారణంగా ఎదురయ్యే తొలిప్రేమ దానికోసం పడే తపన, ఓ అమ్మాయికి ఆ కాలం యువత ప్రేమ వ్యక్తం చేసేందుకు పడే గుండెదడ, అల్లరి పనులు, అది బెడిసికొడితే పడాల్సిన విరహ బాధని చూపించటంలో షణ్ను బానే నటించాడు. నాయకి, అనఘా అజిత్ లీలగా పాత్ర కొద్ది మాత్రంగానే అనిపిస్తుంది. చిత్రం మొత్తం షణ్ణు మరియు వారి స్నేహితుల చుట్టూ తిరుగుతున్నట్టు వుంది. 

ఇక హీరో తల్లి పాత్రలో ఆమని, హీరోయిన్ తల్లిదండ్రులుగా రూప లక్ష్మి - గోపరాజు రమణ కనిపించారు. ఈ కారణంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఉండవచ్చని ఆశించిన ప్రేక్షకులకి నిరాశే అనిపిస్తుంది. ఈ ముగ్గురు ఆర్టిస్టులు కూడా ఒకటి .. రెండు సన్నివేశాలలో మినహా చిత్రంలో పెద్దగా కనిపించరు.  ఏదో జరిగిపోయి ఉంటుంది' అనే హీరో ఊహ తప్ప అసలు కథ మాత్రం నడవలేదు. ముగింపు కూడా అసంపూర్తిగా అనిపించింది, అలా ఉండటమే కొత్తదనం అనుకుంటే ఏ గొడవా లేదు😀😀.

ప్రతీ విషయాన్ని గురించి అతిగా ఆలోచించడం .. ఏదేదో ఊహించుకోవడం హీరోకి అలవాటు అనే అంశం మొదట్లో , సంభాషణాల్లో చెప్పినప్పటికీ అవి పూర్తిగా ఆసాంతం తీసుకోవడంలో విఫలం అయ్యాడు కొత్త డైరెక్టర్ పవన్ సుంకర. తల్లిదండ్రుల పాత్రలను, ఆర్టిస్టులను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఫ్రెండ్స్ వైపు నుంచి కూడా బాగానే హాస్యం రాబట్టవచ్చు. ఫరవాలేదు అనిపించిన ఒక ప్రేమ కథను అసంపూర్తిగా ఆపేసినట్టు అనిపిస్తుంది. 

అనుష్ కుమార్ ఫొటోగ్రఫీ , తాను తెరపై చూపించిన గ్రామీణ నేపథ్యం బాగుంది. పంటకాలువలు, పొలం గట్ల నేపథ్యంలో సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు, ఎలాంటి ఎఫ్ఫెక్ట్స్ లేకుండా సాదాగ సహజత్వాన్ని ప్రతిబింబించాయి. కృష్ణచేతన్ అందించిన రెండు పాటల నేపథ్య సంగీతం ఫరవాలేదు.

నటవర్గం :  షణ్ముఖ్ జస్వంత్, అనఘ అజిత్, ఆమని, రూపాలక్ష్మి, గోపరాజు రమణ,
దర్శకుడు : పవన్ సుంకర 
సంగీతం : కృష్ణ చేతన్ 
బ్యానర్ శ్రీ అకీయన్ ఆర్ట్స్ 

-- అవ్యజ్ (శంకర్) 2.2 **/5***** 

అరె ఏంట్రా ఇది 😝😋

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog