ZEBRA

 జీబ్రా-ఆహా 

జీబ్రా చిత్రం ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ఆహా లో డిసెంబర్ 20 నుండి సాధారణ ప్లాన్ ఉన్న వారికిఅందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 18వ తేదీన ముందున ఆహా గోల్డ్ ప్లాన్ ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 

కధ వృతాంతం కొంత లక్కీ భాస్కర్ మూవీ పోలికలో ఉండడం జీబ్రా చిత్రానికి పెద్దగా కలిసి రాలేఅనే చెప్పలేదు. బ్యాంకింగ్  మోసాలు, బ్యాంకుల పనితీరు చుట్టూనే ఈ చిత్రం తిరుగుతుంది. కాస్త బ్యాక్‍ డ్రాప్‍లో పోలికలు ఉన్నా జీబ్రా విభిన్నమైన స్టోరీతో, స్క్రీన్‍ప్లేతో సాగుతుండటంతో కొంత మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సత్యదేవ్ నటనకు ప్రశంసలు చెప్పవచ్చు. 

సత్యదేవ్ సూర్యగ ఓ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంటాడు. అతను బ్యాంకులో జరిగే లావాదేవీల లోటుపాట్లు తెలిసి డబ్బు మార్పిడి చేయటం, అవసరంలో వాడుకోవడం అతనికి కాస్త వెన్నతో పెట్టిన విద్య. అలా ఉంటున్న  సూర్య అనుకోకుండా తన ప్రియురాలు ద్వారా చేసిన చిన్న తప్పు టైపో ఎర్రర్ వలన 5 కోట్లు వేరే వ్యక్తుల ఖాతాలోకి జమ చేయబడుతాయి. ఆ వ్యక్తి  వాటిని తిరిగివ్వకపోవడంతో తనకున్న తెలివితో తిరిగి రాబట్టే ప్రయత్నంలో పూర్తిగా మునిగిపోతాడు. భారీగా డబ్బు అవసరమైన సూర్య ఏం చేశాడు.. అనుకోకుండా కన్నడ నటుడు డాలి ధనంజయ్ కధలోకి రావడంతో సూర్యకి ఎదురైన సవాళ్లు ఏంటనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంట్రెస్టింగ్ డ్రామాతో రూపొందించారు. ఆలా ఆసక్తిగా సాగుతున్న క్రైమ్ థ్రిల్లర్ లో కాస్త కామెడీని కూడా జోడించారు.

జీబ్రా సినిమా తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ మంచి వసూళ్లు సాధించినప్పటికీ లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాల నుంచి కూడా ఈ మూవీకి థియేటర్ లో  మంచి పోటీ ఎదురైంది.
విశ్లేషణ: బ్యాంకింగ్‌ సెక్టార్‌ నేపథ్యంలో తెరకెక్కి, నేటి బ్యాంకింగ్‌ వ్యవస్థలు, వ్యక్తులలోని కొద్దిపాటి లోపాలను ఆధారంగా ఎలాంటి ఆర్థిక నేరాలు జరుగుతాయనేది చూపించడానికి ప్రయత్నించారు దర్శకుడు. అలాగే దీనికి గ్యాంగ్‌స్టర్‌ కథను జోడించాడు. బ్యాంకింగ్‌ వ్యవస్థలోని విధి విధానాలు, దాని ద్వారా మోసాలు జరిగే మార్గం, దినచర్యలో బ్యాంక్‌ లావాదేవీలు చేసే వాళ్లకు మాత్రమే అర్థమయ్యే విషయాలను కూడా స్పర్శించారు.
కొన్ని సన్నివేశాలు కేవలం బ్యాంక్‌ ఎంప్లాయిస్‌కి మాత్రమే అర్థమయ్యేలా ఉన్నాయి. సాధారణంగా సగటు మనిషికి బ్యాంకింగ్‌ కార్యకలపాలనేవి ఓ చిక్కుముడిలా అనిపిస్తాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు  కూడా ఓ పజిల్‌ ఛేదిస్తున్నట్లుగానే ఫీల్‌ అవుతాడు. అలాంటివి ఇంకొంచం అర్ధమయ్యేలా తీయటంకి వీలు చేసుకొని వుంటే బావుండేది అనిపించింది. సత్య వైపు నుంచి అక్కడక్కడా చోటు చేసుకున్న కాసింత వినోదం మాత్రమే రిలీఫ్‌గా అనిపిస్తుంది. 


ఆస్తులు:  సూర్య పాత్రలో సత్యదేవ్‌ నటన, సూర్య, ప్రియురాలిగా ప్రియా భవానీ తన పరిధి మేరకు ఒకే, దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ కథగా అనుకున్న పాయింట్‌లో కాస్త కొత్తదనం, స్క్రిప్ట్ పనితీరు, ప్రేక్షకుడిని లాజిక్ ఆలోచించకుండా సినిమాటిక్ గా కూర్చోపెట్టాడు. కధ చివరలో ఇచ్చిన మంచి కోసం హీరో కష్టపడటం అనే అనునాయింపు చిత్రానికి కాస్త ఉపశమనం.
కుదుపులు: తేలిపోయిన కధానాయకి పాత్ర, పాటలు, హీరో-హీరోయిన్ ల మధ్య రొమాన్స్ - లవ్ ఆశించినంత లేకపోవడం, ప్రతినాయకుని పాత్ర సాధారణంగా ఉంది, ప్రధమంలో కాస్త నెమ్మదిగా ఉన్న కధనం 

VPS Hosting

టీనటులు: సత్య దేవ్, డాలి ధనంజయ, సత్యరాజ్, ప్రియ భవాని శంకర్ , సునీల్ 
దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్
సంగీతం : రవి బసరూర్ 

-- అవ్యజ్ (శంకర్) 2.98 ***/5***** 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog