కరటక దమనక
Hittalaka - Karibeda maawa సాంగ్
కథ : విరూపాక్ష (శివరాజ్ కుమార్) బాలరాజు (ప్రభుదేవా) ఇద్దరూ అనాధలు. చిన్నప్పటి నుంచి తమ మాయ మాటలతో ఎదుటివారిని బురిడీ కొట్టిస్తూ, దొంగతనాలు చేస్తూ జీవినం సాగిస్తూ ఉంటారు. అలవాటులో పొరపాటుగా ఒక మంత్రిని బురిడీ కొట్టించడానికి ప్రయత్నించగా పోలీసులకి దొరికిపోయి జైలు పాలవుతారు. అలా వీరు జైల్లో ఉన్నపుడు, ఆత్మహత్య చేసుకోబోయిన ఒక ఖైదీని తమ మాటలతో ప్రభావితం చేయడం జైలర్ చూస్తాడు. అప్పుడు జైలర్ మదిలో ఓ ఆలోచన స్ఫురిస్తుంది.
ఆ జైలర్ కి తన స్వగ్రామం నందికోలూరు, అక్కడి కరువు పరిస్థితులు, సరిగా పట్టించుకోని ఆ నియోజక వర్గ ఎం.ఎల్.ఏ. , అందరు వలస వెళ్లినప్పటికీ వారి తల్లితండ్రులు ఆ గ్రామంలోనే ఉండటం గుర్తువస్తాయి. ఆ గ్రామ ఇలవేల్పు నందీశ్వరుడు, వాళ్ళ ఆచారం ప్రకారం ఆ నందీశ్వరునికి ఏళ్ళ తరబడి జాతర చేయకపోవడమే ఆ పరిస్థితులకు కారణం అని తలచి ఎలాగైనా జాతర జరిపించమని జైలర్ తండ్రి తణికెళ్లభరణి అడుగుతాడు. అక్కడికి వెళ్లడం ఇష్టంలేని జైలర్ తన తల్లి తండ్రులను ఎలాగైనా అక్కడి నుండి తీసుకొని రమ్మని వీరిద్దరిని పంపడం ఆలా చేస్తే తమ శిక్ష రద్దు చేస్తానని చెప్పి ఒప్పిస్తారు. ఆ పని మీద వెళ్లిన వీరిద్దరికి అక్కడ కధా నాయికలు పరిచయం, వీరి ప్రేమతో పాటు, ఎలా ఆ గ్రామాన్ని, ప్రజలను కాపాడుతారు అనేది కధా సారాంశం.
నిష్విక నాయిడు
ఆస్తులు :
శివకుమార్, ప్రభుదేవాల పాత్రలు, నృత్యం, హితలక-కరిబేడ పాట తో పాటు మరో పాట, సంతోష్ రాయ్ ఫోటోగ్రఫీ, సారాంశము , ముగింపు సన్నివేశానికి దొంగలు ఇద్దరిలో వచ్చిన మార్పు రావడం
కుదుపులు :
మూలకధ పంచతంత్రం నుండి తీసుకొని పేరు పెట్టినప్పటికీ పూర్తిగా కధలో పాత్రలకు న్యాయం చేయలేకపోవడం , అందానికే పరిమితమయిన కధా నాయికల పాత్రలకు పెద్ద ప్రాధాన్యత లేకపోవడం, బలమైన ప్రతినాయకుడి పాత్ర లేకపోవడం
నటీనటులు : శివరాజ్ కుమార్, ప్రభుదేవా, ప్రియా ఆనంద్, నిశ్విక నాయిడు , రవి శంకర్,
దర్శకుడు : యోగిరాజ్ భట్
సంగీతం : హరికృష్ణ
నిర్మాణం : రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్
-- అవ్యజ్ (శంకర్) 2.9**/5*****
దర్శకుడు : యోగిరాజ్ భట్
సంగీతం : హరికృష్ణ
నిర్మాణం : రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.