భగీర
భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదల అనేది, ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ సూపర్ హీరో కధ రచన, కె.జి.ఎఫ్. చిత్ర నిర్మాతల పేరుని బట్టి ఆ మాత్రం అంచనాలు ఉండటం - చెప్పడం సహజమే కదా. ఇప్పుడు శ్రీ మురళి, "సప్త సాగరాలు దాటి" గత చిత్ర నాయిక, నిఖిల్ జంటగా రాబోయే "అప్పుడో ఇపుడో ఎపుడో" చిత్ర నాయిక రుక్మిణి వసంత్ తో కలిసి నటించిన ఈ కన్నడ అనువాద చిత్రం భగీర గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యనే కొత్తగా వచ్చినటువంటి కన్నడ అనువాద (డబ్బింగ్) సినిమా ఇది. వేదాంత్ ప్రభాకర్ సూపర్ పోలీస్ కాదు . కానీ చిన్నతనంలో స్పైడర్ మాన్ వంటి వీడియోలు చూస్తూ సూపర్ మాన్ అవ్వాలి స్పైడర్ మాన్ లాగా అద్భుత శక్తులు సంపాదించాలని ఒక మోటీవ్ ఉన్నటువంటి అలా ఉంటూ అతని చేసే చిన్న చేష్టల్ని వాళ్ళ మదర్ భరించలేక అల్లరిని ఆపడం కోసం తనకి సూపర్ మాన్ అవ్వాలి అంటే సూపర్ శక్తులే రావాల్సిన అవసరమే లేదు. ఎలాంటి వ్యక్తి అయినా సూపర్ వ్యక్తులుగా రాణించవచ్చు అనే చిన్న కథ అని చెప్తుంది, అందుకు ఉదాహరణకు వాళ్ళ నాన్నని చూసుకోమని అతనికి బోధిస్తుంది. అలా జరుగుతూ ఉన్న చిన్నతనం తర్వాత వేదాంత్ ప్రభాకర్ పెరిగి పెద్దవాడు అవుతాడు. తను పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించి ఉన్న రోజుల్లో వాళ్ళ నాన్నగారు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అవడం, ఇద్దరు ఒకే శాఖలో పనిచేస్తూ ఉండటం, ఉడుకు రక్తం గల వేదాంత్ పోలీసు విధి నిర్వహణలో చాలా దుడుకు తనం చూపించడం, నేరస్తుల్ని లెక్క చేయక శిక్షలు వేయడం, ఎలాంటి వారికైనా ఎదురు వెళ్లి పోరాడే తత్వంతో ఉండడం వల్ల, అన్ని చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంలో కూడా పేరు మోసిన విల్లన్ ఒకడు ఉండడం, అతనికి ఎదురు వెళ్లి వేదాంత్ ప్రభాకర్ అతనిని తీసుకుని వచ్చి ఖైది చేయడంతో అది పెద్ద ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి వాళ్ళ కొడుకుని వారిస్తారు. తన తండ్రి మరియు కమిషనర్ కలిసి, ఈ ఉద్యోగం కేవలము తన ప్రతిభ వాళ్ళ రాలేదని కోట్లకు బదులు లక్షల్లో తీసుకొని ఉద్యోగం ఇచ్చారు అన్న నిజాన్నీ తెలుసుకొని ఆ డబ్బు ఎలా సంపాదించాడు అని తండ్రిని నిలదీస్తాడు.
రుక్మిణి వసంత్
తానూ కూడా అందరిలాగే సామాన్య మనిషిని అని లంచం తీసుకొన్నారని, కేవలం జీతంతోనే తన తల్లి క్యాన్సర్ వ్యాధి న్యాయం చేయలేకపోవడం, పిల్లవాడికి కావాల్సిన అవసరం తీర్చలేకపోవడం అనే ప్రాపంచిక నిజాన్ని కొడుకుతో చెప్తాడు. అది విన్న వేదాంత్ చాలా బాధపడి ఎంతో గొప్పవాడు అనుకున్న తండ్రి ఇలా చేయడం తన ఉద్యోగం కూడా కేవలం డబ్బుతో కొన్నాడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక కాస్త కుంగుబాటు గురై తన స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో ఆ స్టేషన్ కి వచ్చిన ఆడపిల్ల బలాత్కారం కేసు తన దృష్టికి రావడం, తను ఏమీ చేయలేనని నిస్సహాయతతో ఉండిపోవటం అదే సమయంలో ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవడం పోలీస్ స్టేషన్ ఎదుట బాగా కలిచి వేస్తుంది. అప్పటినుంచి గొప్ప నిర్ణయాన్ని తీసుకోవాలని తను భగీరగా మారి తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్నీ చట్ట పరంగా న్యాయంగా శిక్షించలేము అని, ఎంచుకున్న దారిలో హతమారుస్తూ దొంగలను రౌడీలను ఆ పట్టణంలో లేకుండా చేయడానికి ఉపక్రమిస్తాడు. ఇదే కూలంకషంగా సినిమా యొక్క పూర్తి కథ.
యాక్షన్ సీక్వెన్స్ లో, తర్వాత హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ చాలా తక్కువగానే ఉండి పూర్తి యాక్షన్ వారియర్ చిత్రంగా చూపించవచ్చు. తెలుగులో కూడా నటించిన ప్రకాష్ రాజు వంటి కొంతమంది ఇక్కడ కనబడడం తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. చివరికి అసలు భగీర అనే వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడం కోసం వచ్చిన సి.బి.ఐ. ఆఫీసర్ ప్రకాష్ రాజు అతను ప్రజలకు చేసిన మంచి పనులకు గుర్తించి తన కెరియర్ లో ఓటమి అనేది తెలియని తాను మొదటిసారిగా ప్రజల కోసం వేదాంత్ చేసిన మంచి పనిని గుర్తించి ఓడిపోయినట్టు ఆఫీసర్ల ముందు ఒప్పుకుంటాడు.
చిత్రంలో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయాలేమున్నాయి అంటే కథా నాయకుడుతో పాటు ప్రతి నాయకుల నటన, మిగిలిన నటుల నటనా అనుభవం , అక్కడక్కడ కనిపించేటటువంటి కథనాయక పాత్ర చాల తక్కువ అయినప్పటికీ ఇంటిమసీ కోసం కొంచం ప్రయత్నించారు, కేవలం హీరో ఓరియెంటెడ్ చిత్రంగా చెప్పబడింది.
ఆస్తులు :
ప్రశాంత నీల్ స్క్రిప్ట్, శ్రీ మురళి నటన, పోరాట సన్నివేశాలు.
కుదుపులు :
సాధారణ తెలిసిన కధ, హాస్యం లేకపోవడం
దర్శకత్వం: సూరి
నటీనటులు: ప్రకాశ్ రాజ్, రుక్మిణీ వసంత, శ్రీ మురళి, అచ్యుత్ కుమార్, రామచంద్రరాజు, రంగాయణ రఘు తదితరులు
నిర్మాత: విజయ్ కిరగందూర్
ఓ. టి. టి. ప్లాట్ ఫార్మ్ : నెట్ ఫ్లిక్స్
-- అవ్యజ్ (శంకర్) 2.2**/5*****
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.