Janaka ayite Ganaka

 జనక అయితే గనక

నటుడు సుహాస్ యొక్క తాజా హాస్య వినోదాత్మక చిత్రం, జనక అయితే గనక, నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం గత నెలలో చిత్ర ప్రదర్శనశాలలో విడుదల చేసి విడుదలకు ముందు కొంత సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఓ.టి.టి. ఆహా లో ప్రదర్శితమవుతోంది. 

    ప్రతి చిత్రానికి పాత్రలను జాగ్రత్తగా ఎంపిక చేసుకొనే నటుడు సుహాస్ ఇందులో కూడా కొత్తదనం అందుకొన్నాడు.  ఈ పేరు చిత్ర కధకి నిజంగా సరిపోయింది అనే చెప్పచ్చు. పేరుకి తగినట్టు చిత్రంలో కధని రచించారు. కాస్త పాత తరం తెలుగు లాగా అనిపించినా వాడుక భాషలో తండ్రి అయితే గనక  అని సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఓ పెళ్లయిన పురుషుడు తండ్రి అయితే తనది, తనతో పాటు తన పిల్లలది భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే ఇతివృత్తం తీసుకొని రచించిన కధని చివరికి సాంఘిక అంశం మీదుగా మళ్లించి తమాషాగ ప్రశ్నించి ఇప్పుడున్న సమాజ పోకడలను రుజువు చేసాడు. కాకపొతే అక్కడక్కడా కొన్ని నిజాలు, కొన్ని సన్నివేశాలు అబ్బా ఏ తండ్రైనా ఇలా ఉంటారా అనే ధోరణి కూడా కనిపించింది.  మరి ఎంతవరకు ఈ చిత్రం హాస్యాన్ని , సామజిక అంశాలని బోధించిందో చూడచ్చు.  

కథ :

కథానాయకుడు సుహాస్ ప్రసాద్ గ, తన భార్య తో కలిసి ఓ మధ్య తరగతి జీవితం గడుపుతుంటాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చిన్న చిన్న సరదాలు భార్యతో ఉంటు ఆనందంగా ఉండాలనుకునే ధోరణి. ఉద్యోగం వచ్చిన తరువాత తనకు ఉద్యోగానికి రాకపోవడానికి మంచి జీవితం లేకపోవడానికి  తన తండ్రి ఆర్ధిక పరిస్థితి కొంత కారణం అని తలుచుకుంటూ బాధపడుతుంటాడు. ఆ భయమే తనని పిల్లలు కనాలి అనే ఆలోచన వైపు పోనీయకుండా ఆపుతూ ఉంటుంది. కానీ అనుకోకుండా తన భార్య గర్భవతి కావటంతో తన భయం రెట్టింపు ఐ దానికి కారణమైనదాన్ని సాకుగా చూపుతూ, దాని వెనుక సమాజంలో చాలా మంది తల్లితండ్రుల పిల్లలు, వారి బంగారు భవిష్యత్తు అనే చట్రంలో జరుగుతున్న వ్యాపారాలని ఎండకట్టే ప్రయత్నం చేయటం ముఖ్యాంశం.

తన భార్య గర్భవతి అయినప్పుడు , కుటుంబ నియంత్రణ కోసం అతను వాడిన కండోమ్ సరిగా పని చేయలేదని ప్రసాద్ గ్రహిస్తాడు. ఆ కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. ఆ కేసులో గెలుస్తాడా? కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తున్న ప్రసాద్ వాదన ఎలా సాగింది? అనే వాటికి సమాధానాలు తెలుసుకోవడానికి పూర్తి చిత్రం చూడాలి. 

ఆస్తులు : 

సమాజంలో ఉంటున్న మధ్యతరగతి కుటుంబ జీవితాలను ప్రభావితం చేసే సన్నివేశాల చిత్రికరణ , నేటి యువ జంటలు పిల్లలను కనే ముందు ఎంత ఆలోచించాలి అనే ముఖ్యమైన చర్చను ఈ చిత్రం లేవనెత్తింది.  దర్శకుడు సందీప్ రెడ్డి హాస్యం తో పాటు సుహాస్ పాత్రని, తన తండ్రి పాత్రని, స్నేహితుడిగా , వకీలు పాత్రలో వెన్నెల కిశోర్ పాత్రలని మంచిగా రచించి మెప్పించారు. తారల నటన బావుంది. న్యాయస్థానంలో జరిగే సన్నివేశాల్లో భార్యగా నాయిక సహకారం, వెన్నెల కిషోర్ హాస్య భరిత వాదన.  

కుదుపులు : 

కథానాయకి పాత్రని భార్య భర్తల మధ్య పిల్లల విషయంలో ఇంకొంచం సంఘర్షనా పూరితంగా నిర్మించి ఉండాల్సింది, చిత్ర కధకి ప్రధానంగా తీసుకొన్న కండోమ్ అంశం మొదటి భాగంలో కాస్త ఎబ్బెట్టుగా అనిపించటం, అక్కడక్కడా పండని సాధారణ సన్నివేశాలు,  కధనంలో చేయవలసిన మార్పులు

Sangeerthana Vipin
నటీనటులు: రాజేంద్రప్రసాద్, సుహాస్, సంగీర్తన విపిన్ , రమణ, మురళి శర్మ, వెన్నెల కిశోర్
దర్శకుడు : సందీప్ రెడ్డి బండ్ల 
సంగీతం :  
విజయ్ బుల్గానిన్
నిర్మాతలు : హన్షితారెడ్డి, హర్షిత్ రెడ్డి
సినిమాటోగ్రఫీసాయి శ్రీరామ్ 
-- అవ్యజ్ (శంకర్) 2.5 **/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog