Ramayana - A Nitish Tiwari's pic'k'

'రామాయణ' మొదటి భాగం ట్రైలర్ విడుదలైంది: రాముడి పాత్రలో రణబీర్ కపూర్...

'చిత్రాల'నే కాక దేశ చారిత్రక చరిత పుటల్లో కూడా రామాయణం అనగానే ఓ విలువైన ప్రత్యేక స్థానం గుర్తుకు వస్తుంది. చాలా మంది ఈ అంశం లేదా గ్రంధం లేదా పురాణం ఇలా ఏమైనా ప్రయోగాలు లేదా ప్రయత్నాలు చేశారు. 

మొట్టమొదటి 'రామాయణ్' దూరదర్శన్ ధారావాహిక మొదలుకొని నిన్నటి ఆదిపురుష్ వరకు ఎవరి నిర్మాణ - రచనా శైలి వారిదిగ పోటీ పడుతూనే ఉన్నారు. 
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబోయే ఈ చిత్ర 
సిరీస్‌లో కూడా, రాముడి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ నిర్మాతలు పలు ట్రైలర్లను విడుదల చేశారు. ఈ ట్రైలర్లు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీశాయి. కేవలం ఈ ట్రైలర్ల ఆధారంగానే ఈ చిత్రం అన్ని భారతీయ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

GT Dedicated servers


ట్రైలర్లలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటన అద్భుతంగా ఉంది. అతని కళ్లలోని నిబ్బరం, గంభీరత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శక్తివంతమైన రావణుడి పాత్రలో రాక్ స్టార్ యష్ నటిస్తున్నాడు. ట్రైలర్లలో యష్ పూర్తి రూపాన్ని కాకుండా, కేవలం అతని వీపు భాగాన్ని మాత్రమే చూపించారు. ట్రైలర్లలోని విజువల్స్, పాత్రల పరిచయం చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలను బాగా పెంచేలా ఉన్నాయి. ఈ ట్రైలర్లలో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్లకు దీటుగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ ఒక చిత్రపటంలా మన కళ్ల ముందు ప్రాచీన భారతీయ సంస్కృతిని ఆవిష్కరిస్తుంది. అంతేకాకుండా, ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన సంగీతం అద్భుతంగా ఉంది. సంగీతం, దృశ్యాల పరిపూర్ణ సమ్మేళనం ఈ చిత్రానికే అతిపెద్ద ఆకర్షణగా నిలిచేలా ఉంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని రాజీపడని నైపుణ్యంతో తీర్చిదిద్దారు. రామాయణ సిరీస్‌లోని మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుండగా, ఇది ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం అని కొందరు అనుకుంటుంటే, ఇంకొందరు పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్ దరిదాపుగా కృత్రిమ మేధకి దగ్గరగా ఉందని  చెప్పుకుని విమర్శిస్తున్నారు. 

ఎవరు ఎన్ని చెప్పినా, ఏమి అనుకున్నా ఇలాంటి ఇతిహాసాల చిత్రీకరణలో మన ఋషులు వ్రాసిన పురాణాల మూలాలు దెబ్బతినకుండా, గతంలో పలు చిత్ర రంగాల్లో, వివిధ చిత్రీకరణలలో జరిగిన జయాపజయాలను దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్తలు తీసుకుని వారి నిర్మాణ-రచన శైలిని జోడించాలని ప్రేక్షకులు, దేశచరిత్ర ప్రేమికులు కోరుకుంటున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog