Fun / హాస్య అల్లరి

 నిన్నటి అరాచక  పోస్టర్ రివ్యూ చదివి కోమాలోకి వెళ్తాడనుకున్న బద్నాం బాలరాజు కళ్ళలో ఆనందం చూడటానికి ఇవాళ ఉదయాన్నే వచ్చేసిన మరో పోస్టర్ ..

డిజిటల్ పార్టనర్: అదే బ్రాండెడ్ డిసౌజా ఎంటర్టైన్మెంట్స్

కధ : ఒకసారి చూసిందే

పాటలు, మాటలు: అర్ధమయ్యీకానట్లున్నాయి

డాన్స్: చతికిల పడింది

నటుడు: పర్సనల్ బిజినెస్ పనుల్లో గజిబిజి

నటి: నటనలో చాలా అనుభవమున్న పెద్ద దిక్కు

డైరెక్షన్- : వివో 65 ai dual camera

సారాంశం:- తిడుతుందో పాడుతుందో తెలియని అయోమయంలో పడేసి ప్రేక్షకులకు పిచ్చి పట్టించిన అద్భుతం.హీరో బిజి అవడం వలన కేవలం వాయిస్ అందించి ఎలాగైన పోస్టర్ జనంపై రుద్దాలి అని పడిన తపన ఉంది చూశారూ అబ్బబ్బ అసలు అర్ధమే కాదు...ఈ పెద్ద దిక్కుకి నటనలో అనుభవం బాగా ఎక్కువయి పోవటం వలన మాటలు తడబడటంతో ప్రేక్షకుల మెదడుని కొంచెం గందరగోళంలోకి నెట్టేస్తుందీ పోస్టర్.తానే సింగర్ అని చెప్పి ఓపాట పాడి ఆ పాటతో భయపెట్టడం భయానకం... పక్కనున్న అసిస్టెంట్ తానో సింగర్ అనుకుంటుంది అని చెప్పినా పట్టించుకోకుండా పాడటానికి చేసిన ప్రయత్నం గొప్పగా చెప్పుకొని రోధించాలి..ఇంత అనుభవమున్న నటి నవరసాలు పండిస్తుంది అనుకుని చూసేవాళ్ళని భయానక రసంతో రక్తపు జ్యూస్ తాగించడం ఆమె అనుభవానికో మచ్చుతునక.

సంగీతం: డించక డించక అయోమయం బ్యాండ్ 

ముగింపు: పోస్టర్ చూశాక మతి పోయి ఏమి రాయాలో మర్చిపోవడం.

రేటింగ్ : పెద్ద దిక్కు కాబట్టి కొంచెం అటో ఇటో పడేద్దాం 3/5/3

వ్రాసినవారు: ఇంకేం చెప్తాం..😊

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog