Fun review / హాస్య అల్లరి

 అందరూ ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న పోస్టర్ ఏ హడావుడి లేకుండా రానే వచ్చింది. దాని కధా కమామీషు ఏంటో జర్రంత సూద్దాం....

ఎవడ్రా నాయక్ పేరుతో చూడాలంటావా ప్రొడక్షన్స్ పతాకంపై విడుదలైన పోస్టర్.

మార్కెటింగ్ పార్టనర్: డిసౌజా ఎంటర్టైన్మెంట్స్

కధ : పాతదే

పాటలు, మాటలు : కాపీ కొట్టినవే

డాన్స్: అదీ కాపినే

నటుడు: ఖాళి - నూతన పరిచయం

నటి: ఎవరు నటించటానికి ఒప్పుకోలేదు

డైరెక్షన్ : ఎవరి పేరు వాడాలో ఇంకా తెలియాల్సి ఉంది.

సారాంశం:- ఈ పోస్టర్ మొదట్లో కాస్త ఆశించినట్టే ఉన్నా పోను పోను భయానకంగా ఉంటుంది. పోస్టర్ మొత్తం కాస్ట్యూమ్స్ ఒకటే వాడినా  జీన్స్ పైకి ఫార్మల్ షూ ఏంటిరా అనుకునేలోపు జాగింగ్ షూస్ వాడి సడన్ గా ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యం పరుస్తుంది. రాబోయే డైరెక్టర్ ఎవరో గాని ముందుగానే వాళ్ళ అరాచకాన్ని హీరోపై రుద్ధినట్టు హీరో ముఖంలో అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపించింది. హాఫ్ హాండ్స్ షర్ట్ తో వేసిన చేతులు పైకి లాక్కునే ఫుల్ హాండ్స్ స్టెప్ చూసిన వాళ్ళు పిచ్చెక్కి బట్టలు చించుకోవడం ఖాయం... పాడయిపోయిన బ్రాండెడ్ వాచీని మార్చుకోటానికి పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు.కానీ అదికూడా ఓ స్టెప్ లా అందరినీ అలరించింది..మొత్తానికి వారాంతంలో నవ్వుకోదగ్గ మంచి అభిరుచి ఉన్న పోస్టర్ ...

సంగీతం: సున్నా 

ముగింపు: ఈ పోస్టర్ లో ఎవరిని హింసించలేదు.

రేటింగ్ : మనసు చంపుకుని మంచి భవిష్యత్ ఉన్న నటుడి కోసం 3/5

వ్రాసినవారు: ఎవరికి తెలుసు, మళ్ళీ అడిగితే తంతా😀🤣


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog