Na telugu / నా తెలుగు



తెలుగు భాష దినోత్సవాన నాలో అనుకోకుండా ఉదయించిన ఆలోచనాత్మక గద్యం 

'' అమ్మాయిని అందంగా పొగడటం ఎలానో చెప్పింది నా తెలుగు,

అందాన్ని అందంగా రాయడం ఎలాగో చెప్పింది నా తెలుగు,

అమ్మ అని ఆప్యాయంగా పలకడం నేర్పింది నా తెలుగు,

అమ్మా ..! అని ఆర్ద్రంగా పిలవడం నేర్పింది నా తెలుగు,

సఖి అలకలను కులుకుగా మార్చడంలో మాధుర్యం ఈ తెలుగు,

సృష్టి కార్యాన్ని అందమైన శృంగారంగా సింగారించింది ఈ తెలుగు,

పద్యమైనా అది గద్యమైనా లేక వేనోట పాడుకునే పాటైనా హృద్యంగా తీర్చిదిద్దింది  ఈ తెలుగు,

శిలలైనా సిగ్గుమొగ్గలయ్యేంత వర్ణనలు రాయడం తెలుగునకే సాధ్యం ,

కవులకైనా కావ్యాలకైనా అందమే తెలుగులో నుడికారం చుట్టుకుంటే,

భాషంటే బ-భ లోని గుణింతం కాదని, భావంతో కొంగుముడివేసి బాస చేయడమని నేర్పినా,

భావానికి కూడా భాష్యం రాయవచ్చని చెప్పినా,

తేనెలా, పాశ్చాత్య భాషలను తెనుగీకరించటానికైనా ,

శుభ్రమైన అచ్చులు , స్వఛ్చమైన హల్లులతో సంధి కలిపి,

ఛందస్సులతో సమాస సమూహంలా నవీకరించిన మన తెలుగునే తేజస్సు ఉషస్సులా భాసించాలని ఆశిస్తూ ... "

--

శంకర్ !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog