Marutinagar Subrahmanyam

మారుతినగర్ సుబ్రహ్మణ్యం (AHA OTT)

మారుతి నగర్ సుబ్రమణ్యం (రావురమేష్) టీచర్ ఉద్యోగం కోసం 1998 డీఎస్పీకి సెలెక్ట్ అవుతాడు. కానీ ఆ ఉద్యోగం రాకుండా కోర్టు స్టే ఇవ్వడంతో, భార్య కళారాణి (ఇంద్రజ) సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నా, ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ ఏదొక ఉద్యోగం చేయడానికి మాత్రం ఇష్టపడడు. కొడుకు అర్జున్ (అంకిత్ కోయా) తన తండ్రి సుబ్రమణ్యం అని చెప్పకుండా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అని చెప్పుకొంటూ సరదాగా సమజవరాగమనా చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటాడు. అలా తన కాలనీలోకి కాలేజి సెలవులకు వచ్చిన కాంచన (రమ్య పసుపులేటి) అనే చిన్ననాటి స్నేహితురాలితో ప్రేమలో పడుతాడు. ఇదిలా ఉండగా, రకరకాల అవమానలతో, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుబ్రమణ్యం బ్యాంక్ అకౌంట్‌లో అనుకోకుండా 10 లక్షల రూపాయలు జమ అవుతాయి. కష్టకాలంలో ఉన్న సమయంలో అకౌంట్‌లో 10 లక్షలు పడితే సుబ్రమణ్యం ఏం చేశాడు,? ఆ డబ్బుతో ఎలాంటి కష్టాలకు గురి అయ్యాడు? 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఎలాంటి క్లారిటీ వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా కథ. ఇటీవల డీఎస్సి పరీక్షపై కోర్టు తీర్పు అనే చిన్న పాయింట్ చుట్టూ ఫన్, కామెడీ, ఎమోషన్స్ తదితరల అంశాలతో రాసుకొన్న కధ పాయింట్ బాగానే ఉంది. కానీ కథలోకి వెళ్లడానికి ముందు కాస్త తడబాటు కనిపించింది. అసలు పాయింట్‌ లోకి వెళ్లిన తర్వాత కథపై సాధించిన పట్టును విడవకుండా రకరకాల పాత్రలు, ట్విస్టులతో కథను ఫీల్ గుడ్‌తో ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు లక్ష్మణ్ కార్య విజయం సాధించాడు. ఇక ప్రథమార్ధంలో కథా స్వభావం, పాత్రల పరిచయం కారణంగా కొంత ల్యాగ్ అనిపించినా, సెకండాఫ్‌లో కథలో అనేక మలుపులతో చకచకా పరుగులు పెట్టించడం సినిమాకు కలిసి వచ్చింది. ఇప్పటి వరకు రావు రమేష్‌ను విల్లన్ రోల్ లో,  ఆర్టిస్టుగా భిన్న పాత్రలతో చూపించిన చిత్ర సీమ ఈ చిత్రంలో మారుతి నగర్ సుబ్రమణ్యంగా పూర్తిగా తన భుజాల మీద చిత్ర బాధ్యతను మోయడమే కాకుండా నటుడిగా తన నైపుణ్యాన్ని కూడా ప్రూవ్ చేసుకొన్నాడు. సినిమాను ఆద్యంతం తానే నడిపించడం, పుల్ లెంగ్త్ క్యారెక్టర్తో చెలరేగిపోయాడు. సెటైరికల్ కామెడీ, కథానాయకుడిగా సినిమాను ముందుకు తీసుకెళ్లే సత్తా తనకు ఉందనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పారు. అంకిత్ కోయా కూడా తన నటనతో రావురమేష్‌ తో పోటీ పడి ఆకట్టుకొన్నాడు.. అలాగే తండ్రి కొడుకులుగా వారిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. రమ్య పసుపులేటితో కలిసి ఉన్న ఒకటి రెండు రొమాంటిక్ సీన్లలో మెప్పించాడు. కాంచనగా రమ్య. గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించింది. ఇంకా చేయవలసినవి ఉంటె బావుండేది. ఇక ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమోషనల్ క్యారెక్టర్‌తోనే కాకుండా డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు. ఆమెలో ఇంకా హీరోయిన్ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇంద్రజాకు అమ్మ పాత్రలో అన్నపూర్ణమ్మ, వడ్డీ వ్యాపారిగా అజయ్ (గంగాధర్), ప్రవీణ్, మిగితా పాత్రల్లో నటించిన వారాంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారనుకోవచ్చు. 
నటీనటులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు 
కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య
నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య
సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల
లిరిక్స్: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి
ఆర్ట్: సురేష్ భీమంగని
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి 
-- అవ్యజ్ (శంకర్) 3***/5*****



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog