Aye Amaayikaa..

ఏయ్ అమాయిక

అందరూ టాలీవుడ్ చిత్రాలపై తమ తమ రివ్యూలను రాస్తూ వారి వారి సహకారాలు సహాయం అందిస్తున్నటికీ నేటి నుంచి ఈ బ్లాగులో చిన్న చిత్రాలు లేదా చిన్న సంకలనాలతో (సిరీస్) కూడిన విడివిడి భాగాలతో వచ్చేటువంటి వీడియోలకి చిత్రాలకి కూడా నా వంతు సహకారంగా కాబోయే ఔత్సాహికులైన నటులు, నాయికా-నాయకులు, దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, ఛాయాగ్రహకులు, రచయితలకి ఓ చిన్నపాటి ఆనందాన్ని విమర్శనల్ని, సహకారాన్ని అందజేయాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది. ప్రధానంగా నేను చూసిన నాలుగు నెలల నాటి ఓ వెబ్ సంకలనం "ఏయ్ అమాయక". ఇది మూడు భాగాలతో విడుదలై కొంత ఆశావాహ దృక్పథంతో సాగేటువంటి సంకలనం. డియర్ కావ్య అనే చిన్న చిత్రంతో ప్రజల ముందుకు వచ్చినటువంటి చందన పయ్యావుల మరియు కన్న జోడితో సైన్మా  క్రియేషన్స్ నిర్మాణంలో వచ్చినటువంటి సంకలనం. డియర్ కావ్యతో చిన్న సినిమా (షార్ట్ఫిల్మ్) ప్రేక్షకులనాకట్టుకున్నటువంటి చందన పయ్యావుల నాలుగు సంవత్సరాల నుంచి యూట్యూబ్ మాధ్యమంలో విరివిగా వివిధ నిర్మాతల, నిర్మాణ సంస్థల సహకారంతో చిన్న సినిమాలు చేస్తూ ఉంది. ఈ మధ్యనే ఒకటి రెండు వెండితెర చిత్రాలలో కూడా నటించడం జరిగింది. మరి ఇంకా కన్న అటువైపుకి ధ్యాస మళ్లించలేదు దానికి కారణం ఏమిటో తెలియవలసి ఉన్నది. ఇక కథ విషయానికి వస్తే ఈ సంకలనం ఒక చిన్న సినిమాలో ఓ అబ్బాయి  ప్రేమని చెప్పే సన్నివేశంతో ప్రారంభమవుతుంది. అందులో మన చందన పయ్యావుల (చైత్ర) తన కెరియర్లో ఎలా అయితే నాయకిగా ఉంటూన్నట్టే, ఈ సిరీస్లో కూడా ఒక నాయికగా పరిచయం అవుతుంది. ఒక సాధారణ నటిగా కొంచెం విశాలమైన ఆలోచనలో ఉన్నటువంటి నటిమణిగా ఇందులో ఉంటుంది. మన కన్నా మాత్రం ఒక అంతోర్ముఖుడు (ఇంట్రావర్ట్) అంటే మనసులో ఉన్న ఆలోచనలని బాహాటంగా చెప్పాలనుకున్న కూడా చెప్పలేని మనస్తత్వంతో ఉంటాడు. దానికి చిన్న చిన్న కారణాలు తన చిన్నప్పుడు జరిగినవి, ప్రస్తుతం జరుగుతున్న కారణాలు. ఆ తర్వాత కన్నా ఉద్యోగం చేస్తూ అది నచ్చకపోయినా కూడా సర్దుకుపోతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇలాంటి మనస్తత్వానికి పూర్తి భిన్నంగా ఉండేది మనం చందన పాత్ర. మొదట్లో ఉన్నంత అందము కొంచెం తగ్గినప్పటికీ అభినయం మాత్రం బాగానే ఉందని చెప్పొచ్చు. ఇలా జరుగుతున్న ప్రయాణంలో మొదటగా కన్నా తన స్నేహితులతో ఓ పార్టీకి వెళ్లడం జరుగుతుంది. ఆ పార్టీకి చందన నటిస్తున్న నిర్మాతలు తరపు వాళ్ళు చేసుకునే పార్టీకి ఆహ్వానం అవడం ఇద్దరు కలిసి ఒకే పబ్బులో ఆ కార్యక్రమం జరగతూ ఉండటం వల్ల అక్కడ కన్నా మన నాయకి చందనాన్ని చూస్తారు. కానీ దీనికి ముందుగానే చందనాకి షార్ట్ ఫిలిం డైరెక్టర్ వంశీ  ప్రేమిస్తున్నానని చెప్తాడు. కానీ దానిని చాలా సున్నితంగా చాలా ఆశవాహ దృక్పథంతో కాదు అని చెప్తుంది చందన. అది మనసులో పెట్టుకొని తన నిర్మాతలు ఏర్పాటు చేసినటువంటి ఈ పార్టీలో తనకి మద్యాన్ని ఇచ్చి దురుసుగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాడు ఆ దర్శకుడు. అందులో ఆకస్మాత్తుగా ఈ కన్నా తనను చూడటం తను అక్కడి నుంచి తప్పించుకోవడానికి కన్నా తెలిసిన వాడిలా నటిస్తూ బయటికి రావడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈలోపులే తన స్నేహితులు తన సహోద్యోగులు కలిపి ఇచ్చిన మత్తు పానీయం తాగిన చందన అక్కడి నుంచి బయటికి వచ్చి తను ముందుగానే బుక్ చేసుకున్న క్యాబ్ అనుకోని కన్నాని అతని కార్ లో ఎక్కి అక్కడినుంచి తప్పించుకోవడానికి మత్తులో ఉండటం వలన చందన క్యాబ్ ను సరిపోల్చుకోలేక పోతుంది. అలా కొంత దూరం సాగిన తర్వాత తన తేరుకొని అప్పుడు కన్నాతో మాటలు కలుపుతుంది. ఇక్కడ చందనా పాత్ర చాలా బాగుందని చెప్పాలి. అంటే నటించే అమ్మాయిలకు ఎదురయ్యే సంఘటనలు ఎదురయ్యే ఇబ్బందులు చాలా సులభంగా వాటిని మనసుకి తీసుకోకుండా బాధపడకుండా తన జీవనాన్ని సాగించేటువంటి పాత్రలో ఒదిగిపోయింది చందన. ఈ కారు ప్రయాణంలో ఇంటికి వచ్చే మార్గంలో కన్నాకి చందనకి మధ్య జరిగిన స్నేహం చివరి వరకు వారికే తెలియకుండా ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం కలిగి కాస్త ప్రేమ అనే ఫీలింగ్ మొదలవుతుంది. వీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం ఒక మనసుతో ఒకరు తెలుసుకొని ప్రయత్నించడం తనతో పాటుగా అప్పుడప్పుడు జరిగేటువంటి అడ్డంకులు మార్గమధ్యంలో ఓ భార్యాభర్తల కి సహాయం చేయడం, భార్య భర్తలు రోజు గొడవ పడుతున్నప్పటికీ కలిసి ఉండేటటువంటి, సర్దుకుపోయేటువంటి మనస్తత్వానికి వీళ్లు ఆశ్చర్యపోయి ఆనందిస్తారు. ఏది చెప్పుకోలేని బయటకి వేటికి పోరాడలేని సాదాసీదాగా గడిచిపోతూ ఉన్న కన్నా మనస్తత్వానికి,  అంతా ఆనందంగా గడుపుతూ ప్రతి చిన్న విషయాన్ని కి పొంగిపోతూ మన చేతిలో ఉన్నది మనకు జరిగేది ప్రస్తుతం ఉన్న దాంట్లోనే తన ఆనందాన్ని చూసుకునేటువంటి మనస్తత్వం కలిగిన కావ్య బాగా నచ్చుతుంది.  అంటే ఎంత చిన్న విషయంలో అయినా కూడా ఆనందాన్ని వెతుక్కోవచ్చు కేవలం డబ్బు, పరువు, విలాసాలు అలాంటి గొప్ప గొప్ప సంపాదన లేదా గొప్ప జీవితంలోనే కాదు ఆనందం ఉండేది అని అర్థం చేసుకుంటాడు. సాగుతున్న ప్రయాణంలో ఒకరినొకరు అర్థం చేసుకొని వారి మధ్య జరిగిన శృంగార భరిత సన్నివేశాలు చాలా చిన్నవైనప్పటికీ మనసుకు హత్తుకునేలా ఉంటాయి. కేవలం శరీరంతో జరిగేది కాకుండా ఎక్కువ శాతం మనసుకు సంబంధించిన భావోద్వేగాలు పండించడానికి కాకపోతే ఇందులో ఇటు కన్నా వైపు కాని అటు చందన వైపు కానీ వాళ్ళ కుటుంబ వ్యక్తుల ప్రత్యక్ష జోక్యం  లేకపోవడం కొంచెం ఆలోచించదగింది. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు మనస్తత్వాల మధ్య జరిగే ప్రేమ సన్నివేశాన్ని చిత్రీకరించారు. అది రెండు గంటల ప్రయాణంలో కేవలం మాటలు ద్వారా మాత్రమే ఒకరినొకరు అర్థం చేసుకొని తమకు తెలియకుండా ఇష్టపడడం అనేది చాలా బాగా చూపించారు. పెద్దగా నచ్చేది ఏంటంటే కావ్య తన వృత్తిని ఎదుర్కొనే సమస్యల్ని మనం చాలా తరచుగా ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ లాంటివి కాకపోయినా చాలామంది హీరోయిన్ గురించి చిన్నచూపుగా మాట్లాడే మాటలను ఎంత తేలికగా తీసుకొని సరదాగా అధిగమిస్తూ వస్తుందని అదే గొప్ప విషయం. అది ఆకట్టుకునే విషయం.  నిజంగా ఆడవారు అంత సులభంగా తీసుకోగలరా అనే సన్నివేశాన్ని బాగా చూపించారు. కొంత ఆశ్చర్యపరిచినా అది నిజమే ఉండొచ్చేమో. మన కన్నా మనస్తత్వం ఈ జరిగిన సన్నివేశాలు అన్నీ కూడా ప్రారంభంలో వాళ్ళ ఫ్రెండ్ స్నేహితులతో పంచుకుంటూన్నా ఆ సమయంలోనే ఈ కథ మొత్తం సాగుతూ వచ్చింది. ఎలాగూ సుఖాంతం అవుతుంది అందరికీ నచ్చే విధంగా ఇద్దరు ప్రేమను అంగీకరించడం అనేలా  ముగింపు పలకటం మెచ్చుకోదగింది. చందన క్యారెక్టర్ రేషన్, కన్నా క్యారెక్టర్ అయినప్పటికీ కొంత అక్కడక్కడ చందన వాడినటువంటి నగలు కానీ ఆభరణాలు కాని, అవి తన అందాన్ని కొంత  తగ్గించినట్టుగా అనిపించినా యూట్యూబ్ నాయకిగా అందరి మనసులను కొల్లగొట్టిన చందనకు అదే సందర్భాన్ని క్యారెక్టరైజేషన్ లో కూడా రచయిత చూపడం అనేది బాగుంది. కథ జరుగుతున్నంతసేపు చూడాలనే ఆసక్తి రేపించడము దర్శకుడు యొక్క నైపుణ్యాన్ని చూపించాడు. విడివిడి భాగాల కన్నా మొత్తంగా చిత్రంలాగా చూడడం మనిషికి మనసుకి ఇంకా బాగా దగ్గరవుతుంది.

ప్రతికూల విషయాలు: పదాలలో భాష అక్కడక్కడా పోయింది, (లెవ్వు, వస్తది, పోతది ఇలా మాండలికం), చందన మేకోవర్, మంచి ఆకర్షణీయమైన దుస్తులు), దారిలో లిఫ్ట్ ఇచ్చిన జంట (అమెరికాలో చదువుకునే  కొడుకు ఉండటం, ఇన్నాళ్లు మాకోసం కష్టపడి ఇపుడు ఎంజాయ్ చేస్తున్నాడు అనే మాటల్లో వయసు ఎక్కువ అనిపించాలి ) తగిన పెయిర్ దొరకలేదేమో

సానుకూల విషయం: సహాయం చేసే మనస్తత్వం, గొడవలొచ్చినా బంధాన్ని కాపాడుకునే జంటలు, కన్నా మనస్తత్వాన్ని ప్రేరేపించే చైత్ర పాత్ర,  నటుల అభినయం, దారిలో వచ్చే చిన్న పాట 
రచన,  దర్శకత్వం:  కుషాల్ 
నటులు: చందాన పయ్యావుల , కన్నా 
పాట , సాహిత్యం: జె. వి. సుధాన్షు, వందన ద్విభాష్యం 
కత్తిరింపు:  వివేక్ నెక్కల 
నిర్మాత: ఉపేందర్ రెడ్డి ఎక్కటి

-- అవ్యజ్ (శంకర్) 3***/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog