Bench-Life

బెంచ్ లైఫ్ 


వచ్చేసింది సోనీ లీవ్ లోకి నిహారిక ప్రొడక్షన్స్ అంటే పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ లో సోనిలివ్ లో ఈరోజు నుండి  ప్రదర్శింపబడుతోంది బెంచ్ లైఫ్ సిరీస్ఒక సాఫ్ట్వేర్ రంగాన్నీ తీసుకొని దాంట్లో ఉండే బెంచి అనే విరామం కోసం పోటీపడే ఉద్యోగస్తుల భవిష్యత్తు, ఉద్యోగుల ఆరాటాన్ని చూపిస్తూ ఆ నేపథ్యాన్ని చక్కగా ప్రజెంట్ చేశారని అనుకోవచ్చు. మొదటి, రెండు ఎపిసోడ్లు అల్లరి చిల్లరిగా సాగుతూ ఉంది. బెంచిలో ఖాళీగా ఉన్నాను ఇంట్లో చెప్పకపోవడం వలన వాళ్ళ జీవితాల్లో జరిగే హాస్యం, కొంచెం బాగానే పండింది. నిహారిక, తనికెళ్ల భరణి కూడా ఎపిసోడ్ లో కనిపించడం సిరీస్ కి , పెళ్లి బంధంలో గాయత్రి - రవిల జంట చూడచక్కగా ఉన్నట్టే ఉంది. కానీ రవి గోవాకి వెళ్లాలని చిరకాల కోరిక గాయత్రీతో చెప్పకుండా మేనేజ్ చేస్తుంటాడు. ఇలా రెండు, మూడు ఎపిసోడ్ల వరకు జరుగుతూనే ఉంటుంది. గాయత్రికి కుంటి సాకులు  చెబుతూ దొరక్కుండా మేనేజ్ చేయడం, ఆ దాపరికంలో వచ్చే సన్నివేశాలలో రవి నటన బావుంది. రాజేంద్రప్రసాద్, వైభవ్, గురు సినిమా హీరోయిన్ రితిక సింగ్ (మీనాక్షి), లాంటి తెలిసిన నటులతో పాటుగా చాలా చక్కనైన ఫ్రెష్ పేస్ తో ఉన్న గాయత్రి (నయన్ సారిక - ఆయ్ చిత్ర నాయకి ), (ఆకాంక్ష సింగ్) ఈషా లాంటి వాళ్లు  ఇంకొంతమంది యూట్యూబర్స్ తో కలిసి తీసిన చిత్రం. అల్లరి చిల్లరగా సాగుతూ ఉండే రెండు మూడు ఎపిసోడ్ల తర్వాత మూడో ఎపిసోడ్లో రాజేంద్రప్రసాద్ గారు ఈషా అలియాస్ జగదీశ్వరికితండ్రి పాత్రలో నటించారు. నిహారిక కొణిదెల డెడ్ పిక్సెల్స్ సిరీస్లో వాడిన ఫౌల్ లాంగ్వేజ్ (అసభ్య పదజాలం)  ఇందులో తగ్గించినట్టుగానే అనిపించింది. ఈ సీరిస్ లో ఏమీ తెలియని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో బాలుగా వైభవ్ రెడ్డి చేశారు. అతని పాత్రకి మాత్రమే అక్కడక్కడ బూతు పదాలు రావడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బాలు ప్రేమించే అమ్మాయి తండ్రిగ రాజేంద్ర ప్రసాద్ తన కూతురు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేని పాత్రలో, కొంత సమయం తర్వాత మళ్లీ అదే కంపెనీలో రిటైర్డ్ ఐపీఎస్ గా ఓ ప్రాజెక్టు నిమిత్తం రావడం ఇది థర్డ్ ఎపిసోడ్ లో  జరుగుతూ ఉంటుంది. అమాయక పాత్రలో గాయత్రి చాలా బాగా అనిపించింది. చక్కని కొత్త ముఖం, అమాయకంగా కలబోసినట్టు ఒక ఇల్లాలు పాత్రలో కనిపించింది. ఈ సిరీస్ లో జాబ్ ఆప్షన్ గా ఉంచుకొని షార్ట్ ఫిలిమ్స్ తీయాలి చిత్ర డైరెక్టర్ అవ్వాలి అనే తన ఆసక్తిని నాలుగవ ఎపిసోడ్లో తన కంపెనీలో జరిగే ఈవెంట్ తీయటానికి వచ్చిన అవకాశాన్ని తన షార్ట్ ఫిలిం తీయడానికి ఉపయోగించుకొని తన డైరెక్టర్ అవ్వాలని కావాల్సిన డెమో చిత్రాన్ని తీసి అందిస్తుంది. నాలుగో ఎపిసోడ్ లో తన ఆశయంతో  ఉద్యోగం చేసుకునే కూతురుని కలవాలని తపనతో క్షమాపణ చెప్పాలని అవకాశం కోసం ఎదురుచూస్తున్న రాజేంద్రప్రసాద్, అలాగే ఎప్పటినుండో ఈషాకు తన ప్రేమని చాలాసార్లు చెప్పాలి అనుకుని చెప్పలేకపోయినా తనకి దొరికే ప్రతి అవకాశం వినియోగించుకోవాలని వైభవ్, గాయత్రి దగ్గర తన గోవా ప్రయాణం దాచి పెట్టినందుకు, ఇంకా తను బెంచ్ మీద ఉన్నాడనే నిజాన్ని తెలియకుండా మేనేజ్ చేయడం కోసం అబద్దాలని చెబుతూ ఉన్న రవి, ఇలా మూడు ముఖ్య పాత్రల మధ్య తిరుగుతూ ఉంది. తన కల నిజం చేసుకోవాలని డైరెక్టర్ ని కలవడానికి వెళ్ళిన మీనాక్షికి  నీకు అవకాశం ఇచ్చినా  రాణించలేవు అని నిర్మాతల మాటల వలన ఎదురు దెబ్బ తగలడంతో బాధపడుతుంది. ఇలా నాలుగవ ఎపిసోడ్ మొత్తము కొంచెం ఎమోషనల్ గా సాగింది. తండ్రి కూతుర్లు కలుస్తారా? మీనాక్షి తన కలనీ నెరవేర్చుకుందా లేక వాళ్ళ అమ్మ చూసిన పెళ్లికి ఎస్ చెప్పి ఉద్యోగం వదిలి  వెళ్లిపోయి వాళ్ళ మదర్ కి సంతోషాన్ని ఇస్తుందా ? రవి గాయత్రిలు ఒకరిపై ఒకరికి  ఉన్న నమ్మకాన్ని ప్రేమని వాళ్ల పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోగలరా ? వైభవ్ కి ఈషా కి ప్రేమని చెప్పే సమయంలో జాబ్ పోవడం, దానిని సీరియస్ గా రియాక్ట్ అయిన ఈషా ఎం చేసింది. ఇలా  జరిగిన ఫలితాలు, మలుపులు తర్వాత భాగాలలో రవి-గాయత్రిలు కలిసి ఉంటున్నారా, వైభవ్ మారి ఉద్యోగం చేస్తాడా లేదా ? రవి గాయత్రిలు పెళ్లి బంధము కొనసాగిస్తారా, ఈషా వాళ్ళ నాన్నని యాక్సెప్ట్ చేసిందా, అనేవి చివరి భాగాల వరకు చూడవలసినవిగా సిరీస్ సాగింది. మొత్తం మీద అల్లరి చిల్లరగా మొదలైనా 4 ఎపిసోడ్ వచ్చేసరికి ఎమోషనల్ కలగలిపి, ఈ ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కంపెనీలో బెంచ్ మీద ఉన్న అవకాశాన్ని వ్యక్తిగత వ్యవహారాలకి ఉపయోగించుకోవడం, ఆ మార్గంలో వాళ్ళకి ఎదురైన సంఘటనలు దానిలో నుంచి వాళ్ళలో ఎలా మార్పు వచ్చింది, అమ్మాయి అంటే పెళ్ళి చేసుకోవడం కోసం మాత్రమే పుట్టింది కాదు అనేది చెప్పటమే ఈ సిరీస్ నకు నిజమైన ముగింపు. 
నటవర్గంRajendra Prasad, Tanikella Bharani,Venkatesh Kakumanu, Nayan Sarika, Ritika Singh, Aakanksha Singh, Charan (Telugu Actor), Vaibhav Reddy
దర్శకత్వం:  
Manasa Sharma
ఛాయాగ్రహణం: Danush 
నిర్మాణం: Pink Elephant Pictures కొణిదెల నిహారిక 
-- అవ్యజ్ (శంకర్) 3***/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog