Manorathangal-Series

 మనోరతంగల్ వెబ్ సిరీస్

అలనాటి ప్రముఖ మలయాళ సాహితీ కధకుడు, దర్శకుడు, పద్మభూషణ్, ఙ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అయిన ఎం.టి.వాసుదేవన్ నాయర్ వ్రాసిన నవలలు, రచనల నుండి ప్రముఖ కధలను తీసుకొని నూతనంగా జీ -5 వేదికగా  జీ - 5 తానె స్వయంగా నిర్మించిన 9 భాగాల వెబ్ సిరీస్ ఇది, ఆగస్టు 15 నుండి ప్రదర్శనలో ఉంది. నాయర్ కుమార్తె అశ్వతి V. నాయర్ వాసుదేవన్ నాయర్ 90వ పుట్టినరోజును పురస్కరించుకుని మనోరతంగల్ అనే ఈ దూరదర్శని (టి.వి.) సంకలనాన్ని రూపొందించారు. బహుముఖ నటనాశాలి శ్రీ కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రతి భాగం మొదట్లో తన స్వరాన్ని జోడించి ఆయా భాగాల ప్రాముఖ్యతను, కథను, పాత్రల అవసరాలను క్లుప్తంగా విశదీకరిస్తూ ప్రసారం చేస్తున్న ఈ సిరీస్ లో  భాగం 1, 3,4, 7, 5, 9 కొంచం ఆకట్టుకున్నాయి. ప్రఖ్యాత మలయాళ కధానాయకులైన మమ్మూటీ, మోహన్ లాల్, వినీత్, ఫహద్ ఫాసిల్ తో పాటు మధుబాల, నదియా మోతీ, దుర్గకృష్ణ లాంటి చాలామంది తమ నటనతో సహకరించారు. మొదటి భాగంలో మధుబాల వ్యాపారస్తుడు పారికర్ భార్యగా, భర్త దృష్టిలో ఏ విధమైన  విలువ లేని, కుటుంబ అవసరాలను కూడా చూసుకోలేని స్త్రీగా తనను తానూ నిరూపించుకుంది. 3వ భాగం షెర్లాక్క్ లో ఫహద్ ఫాసిల్, నదియాలు పుట్టిన భూమిని వదిలి అమెరికాలో ఉండే వ్యక్తుల జీవితాల్ని భావాల్ని ఉద్వేగాల్ని చూయించారు. 4వ భాగంలో అపర్ణ బాలమురళి, ఇంద్రజిత్ సుకుమారన్ జంటగా వివాహం తర్వాత బంధాల భావాల్ని, అవివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త నుండి విరహ బాధను ఎదుర్కొన్న అమాయకపు భార్యపాత్రలో అపర్ణ దాని నుండి భార్య బయట పడినప్పడు పొందే ఆనందంలో, ఏవి నిజమైన బంధాలు, ఏవి కలకాలం ఉండేవి అనేది, ఇలా మిగిలిన 5, 7 భాగంలలో వినీత్, మమూటి, మోహన్ లాల్ వంటి అగ్ర హీరోలు నటించి మెప్పించారు. కాకపోతే ఈ సంకలనం మొత్తం చాలా నిదానంగా సాగుతూ ఒక్కో భాగం కనీసం 40ని" నిడివితో వీక్షకుడి ఓపికని పరీక్షించింది. కానీ కేరళ ప్రశాంతత, పురాతన కేరళ సంస్కృతి నేపధ్యం, అందమైన పరిసరాలు ఆహ్లాదంగ ఆకట్టుకుంటాయి. ప్రతి భాగం ప్రారంభంలో మేటి గాయని కె. చిత్ర  పాడిన (శీర్షిక పాట) టైటిల్ సాంగ్ వినసొంపుగా ఉంది. అక్కడక్కడా కేరళలోని ప్రకృతి పసందైన వాతావరణానికి ప్రతీకగా మెల్లగా సాగే పిల్లనగ్రోవి సంగీతం ఆ పచ్చదనంలో సాగుతూ నేటి వర్షాకాల ఆహ్లాద వాతావరణాన్ని మనకి కూడా గుర్తుచేసి ఆస్వాదించేలా చేసింది.

-- అవ్యజ్ (శంకర్) 3***/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog