Simba 2024

 సింబా

నసూయ (Anasuya), జగపతి బాబు (Jagapathi Babu) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కొత్త సినిమా సింబా. సంపత్ నంది వద్ద పని చేసిన మురళీ మనోహర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కస్తూరీ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్ లాంటి నటులతో సింబా చిత్రాన్ని రూపొందించారు. సంపత్ నంది, రాజేందర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 6 వ తేదీ నుండి ప్రముఖ ఓ. టి టి. వేదిక ఆహాలో ప్రదర్శింపబడుతోంది. 
కథ: ఓ సాధార‌ణ స్కూల్ టీచ‌ర్‌ గా పని చేస్తున్న అనుముల అక్షిక (అన‌సూయ‌) హత్య కేసులో చిక్కుకుంటుంది. వరుస హత్యలపై నిఘా పెట్టిన పోలీసులు.. అనుముల అక్షికతో పాటు ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్ మాగంటి) ఉన్నట్లు నిర్దారణకు వస్తారు. వారిని అరెస్ట్ చేసి, జైలుకు త‌ర‌లిస్తారు. అంత‌లోనే వాళ్లిద్ద‌రినీ అంతం చేయ‌డానికి రంగంలోకి దిగిన మ‌రొకరు పోలీసుల ముందే హ‌త్య‌కు గుర‌వుతారు. హత్య చేయబడుతున్న వారంతా పారిశ్రామిక వేత్త పార్థ (క‌బీర్‌సింగ్‌)తో సంబంధం ఉన్న వాళ్ళే. అయితే ఈ కేసు విచారణలో మాత్రం ఈ హత్యలతో త‌మ‌కెలాంటి సంబంధం లేద‌ని చెబుతుంటారు ఈ ఇద్దరూ. ఇక పోలీసుల పరిశోధనలో ఈ మ‌ర్డ‌ర్స్‌కు పురుషోత్త‌మ్ రెడ్డికి (జ‌గ‌ప‌తిబాబు) ఉన్నట్టు అనుమానాలు వస్తాయి. మరి ఈ పురుషోత్త‌మ్ రెడ్డి ఎవరు? ఇంతకీ ఈ హత్యలు చేసేదెవరు? ఎందుకోసం చేస్తున్నారు? అనేది చూడవలసిన చిత్ర కధాంశం. 
కథనం: అక్షిక పాత్ర ప‌రిచ‌యం, ఓ వ్య‌క్తిని ఆమె మ‌ర్డ‌ర్ చేసే సీన్‌తో సినిమా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ చేసి క్రమంగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు డైరెక్టర్ మురళీ మనోహర్. అనురాగ్ (వ‌శిష్ఠ సింహా)ఇన్వేస్టిగేష‌న్ చేసే సీన్స్‌తో అనేక ప్ర‌శ్న‌లు, చిక్కుముడుల‌ నేపథ్యంలో ఫస్టాఫ్ ఆసక్తికరంగా మలిచి సెకండాఫ్ లోకి తీసుకొచ్చారు. దాదాపు అన్ని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టే ఉన్నాయి కానీ ప్రెజెంట్ చేయడంలో కొత్తదనం చూపించారు. జ‌గ‌ప‌తిబాబుని చిన్న‌సైజ్ భార‌తీయుడుగా తెర‌పై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. బ‌యోలాజిక‌ల్ మెమ‌రీ పాయింట్ ప్ర‌ధానంగా సెకండాఫ్‌ నడిపిస్తూ హత్యల వెనుక ఉన్న మిస్టరీని రివీల్ చేశారు. క్లైమాక్స్ లోని సన్నివేశాలు సగటు ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకున్నాయి. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేపథ్యంలో కథ రాసుకొని ఆసక్తికరంగా ఎగ్జిగ్యూట్ చేశారు డైరెక్టర్. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించాయి.

నటీనటులు : అనసూయ, జ‌గ‌ప‌తిబాబు, శ్రీనాథ్ మాగంటి, అనీష్ కురువిల్లా, గౌత‌మి, క‌స్తూరి , వ‌శిష్ఠ సింహా
దర్శకుడు :  మురళీ మనోహర్ (మొదటి చిత్రం)
సంగీతం
కృష్ణ‌ సౌర‌భ్
కెమెరా : కృష్ణ ప్రసాద్ 
-- అవ్యజ్ (శంకర్) 2.9**/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog