Devara - ౨౦౨౪

దేవర పార్ట్-౧ (ఎన్. టి. ఆర్.)

ఆర్. ఆర్. ఆర్. తరువాత అంత భారీ అంచనాలతో ఎన్.టి.ఆర్. జతగా కాకుండా వస్తున్న మొదటి,  మరియు తన నట జీవితంలో ౩౦వ చిత్రం. దీనికి కొరటాల శివ రచన, దర్శకత్వం చేశారు. కళ్యాణ్ రామ్ ఎన్. టి. ఆర్. ఆర్ట్స్ పతాకంలో సహ నిర్మాతలతో కలిసి, దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన స్వంత చిత్రం. అలనాటి అందాల తార, అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ కధానాయకిగా చేసిన చిత్రం కూడా కావటంతో ప్రేక్షకులలో అంతులేని మోజుని సొంతం చేసుకుంది. ఇందులో ఎన్. టి. ఆర్. ద్విపాత్రాభినయం చేశారు. వి.వి.వినాయక్ దర్శకత్వం చేసిన ఆంధ్రావాలా చిత్రం తరువాత ఎన్.టి.ఆర్. మరలా తండ్రిగా - కొడుకుగా  ద్విపాత్రాభినయం  చేసిన చిత్రం ఇదే. మొదటి నుండి ఆకర్షణీయమైన ఛాయాచిత్రాలతో, అద్భుతమైన కళా దార్శనికత (art-direction) కలిగిన బొమ్మలతో ఆకట్టుకుంది. మరియు దఫ దఫాలుగా విడుదల చేసిన అనీరుధ్ సంగీతంలోని పాటలు విజయంతో పాటు ఒక పాట (చుట్టమల్లె) కాస్త విమర్శలని కూడా అందుకుంది. సెప్టెంబర్ ౨౭(27) న విడుదల కాబోతున్న ఈ చిత్ర నిజమైన అనుభవ విశేషాలు ఇపుడు చూద్దాం.

కధనం: 

దేవర - వర ఇద్దరు తండ్రికి కొడుకులు. భారతదేశంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. వాటి రక్షణ బాధ్యత దృష్ట్యా ఢిల్లీ మంత్రుల చర్చలు జరగుతుంటాయి. ఆ మాటల్లో యతి అనే ఓ అక్రమ ఆయుధ సరఫరా చేసే స్మగ్లర్ వలన ఇబ్బందులు రావచ్చు అనే భయం వస్తుంది. అక్కడి పోలిస్ ఉన్నతాధికారులను అతన్ని పట్టుకునే విషయమై ఆరా తీయమని చెపుతారు. ఆ పోలీస్ ఆఫీసర్ అజయ్ యతిని వెతుకుతూ ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో ఉండే ఎర్రసముద్రము ద్వీప గ్రామానికి వస్తారు. అక్కడికి వచ్చిన పోలీస్ అధికారులకి ప్రకాష్ రాజు (సిద్ద) కనిపించడంతో డీజీపీగా వర్క్ చేస్తున్నటువంటి పూర్వ ఆఫీసర్ కలవడం అక్కడినుంచి తనని పట్టుకోవడం కోసము ఒక అబద్ధం చెప్పి ముంబై నుంచి ఆయుధాలు వస్తున్నాయి వాటిని మాకు అందించాలి అని పనిమీద వచ్చాము, ఇక్కడ ఎర్ర సముద్రంలో ఆ పనిని విజయవంతంగా చేసే వాళ్ళు ఉన్నారని చెప్పారు. వారు ఎవరు అని అడుగుతారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆ పూర్వ డి. జి. పి.  ఎర్ర సముద్రంలో ఉన్న వ్యక్తి , భైరా పాత్రలో నటించే సైఫలీఖాన్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. అతను దానికి ఒప్పుకోకపోవడంతో ఎంత డబ్బైనా ఇస్తాను, లేకపోతే చంపుతానని భయపెట్టడంతో భైరాకె భయం చెప్తావా, ఎర్ర సముద్రం వచ్చి ఏం మాట్లాడుతున్నావ్ అని చెప్పి తరిమికొడతారు. మధ్యవర్తిత్వం చేయమని చెప్పి ఆ పోలీసులు ప్రకాష్ రాజుని, ఎర్ర సముద్రం అనేదానికి పాత్రలో ప్రాతినిధ్యం ఏమీ లేకపోయినా ద్వీపం పెద్ద వ్యక్తిగా, అక్కడ జరుగుతున్న విషయాలను గమనిస్తూ ఉంటూ ఉండే  ప్రకాష్ రాజుని సహాయం చేయమని అడుగుతారు. అప్పుడే దేవర పేరు తెరమీదకి వస్తుంది. అసలు దేవర పాత్ర ఏమిటి, ఎలా ఉండేవాడు, ఇప్పుడు వీళ్లు ఆ ఆయుధ దొంగతనం చేయకపోవడానికి గల కారణం ఏమిటి అన్న కధ మొదలవుతుంది. అలా జరుగుతూ ఉన్న సమయంలో దేవర రావడం దేవర పాత్ర వచ్చిన దగ్గర నుంచి సినిమా కాస్త ఆశాజనకంగా అనిపించింది. ఎర్ర సముద్రం అనే ద్వీపంలో మూడు ఊర్లు ఉంటాయి. వీళ్ళు వేటకి సముద్రంలోకి వెళుతూ, వచ్చే ఆయుధాల్ని సముద్రం దాటనీయకుండా దాచి వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ రాజకీయ నాయకులు మురుగ(మురళి శర్మ) కి అమ్ముతూ ఉంటారు. మొదట్లో అవి అక్రమ ఆయుధాలు అని వారికే తెలియకుండా జరుగుతూ ఉంటుంది. వీళ్ళ పూర్వీకుల నుంచి బ్రిటిష్ వారి కాలంలో వాళ్ళకి ఆయుధాలు చిక్కకుండ అడ్డుపడటం కోసం వీళ్ళ ముందు తరం వారు దేశం మంచి కోసం దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నారు. వీళ్ళ పూర్వీకులు దాన్నే వీళ్ళ ఆచారంగా, జీవనోపాధిగా సాగిస్తూ వస్తారు. కాకపోతే దారితప్పి ఆయుధాలు అక్రమార్కులు చేతుల్లోకి వెళ్లడం, దాని ద్వారా జరిగిన కాల్పుల్లో, తమ దగ్గర వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అనేది కొంత సమయం తర్వాత తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి దేవర మార్పు చెంది, ఇకపైన ఎవరూ సముద్రంలో ఇలాంటి ఆయుధాలను తీసుకురాకూడదు, వాటిని అమ్మకూడదు అని శాసనం చేస్తాడు. మూడు సమూహాలలో పెద్దగా మంచితనం కలిగిన, చెడుని భయపెట్టే వ్యక్తిగా దేవరపాత్ర చిత్రీకరించబడింది. ఇంతలో అతనే న్యాయంగా ఉండి, అతనే గౌరవంగా, అతను నెగ్గుతూ ఉండటం నచ్చని భైరా తన సహచరులతో కలిసి దేవరని చంపడానికి దేవరని నమ్మిన వారిచేతనే పథకం రచిస్తాడు. అది విఫలం అవుతుంది. సాహసవంతుడైన దేవరకి కొడుకు వర. దేవర ఎంతో ధైర్యశాలి. వర మాత్రము అందుకు భిన్నంగా చిత్రంలో కనిపిస్తాడు. ఇంతవరకు మొదటి భాగం జరిగిపోతూ ఉంటుంది. రెండో భాగంలో వర పాత్ర చిత్రీకరణ ఎక్కువ ఉంటుంది. దేవర మాట మీద నిలబడి, భయపడి నచ్చకపోయినా కూడా సాధారణ జీవులుగా ఉన్న జనాలు దేవర ఎప్పుడు కనపడతాడా, చంపాలి అనే ఉద్దేశంతో ఉంటుండగా ఒకానొక సమయంలో మళ్ళీ భైర తనే పెంచి  పోషించి, సొంతంగా తయారు చేసుకున్న ఒక 20 మంది సైన్యం  సహకారంతో దేవరని చంపడం కోసం, మళ్ళీ అదే ఆయధాల చోరికి సముద్రంకి వెళ్తే, దేవర వస్తాడు అనే ఆశతో ఆయుధాల వేటకి వెళ్తారు. ఆ సముద్రం వేటకి వరని కూడా తీసుకుని వెళ్తారు. నటిస్తూ కనిపించడం ద్వారా నిజానికి దేవర రక్తం పునికి పుచ్చుకొని దేవర ధైర్యంని కూడా పునికుపుచ్చుకునే వాడిలా కాకుండా అదే భయాన్ని నటిస్తూ ఉన్నాడు అని ఎవరికి తెలియకుండా కాలం జరుపుతూ ఉంటాడు వర. కొత్త కథ కాకపోయినప్పటికిని ఎన్టీఆర్ భావోద్వేగాలని పండించడంలో విజయం సాధించాడు. కాకపోతే తంగమ్  పాత్రలో జాహ్నవి కపూర్ పాత్రని అర్ధాంతరంగా ముగించేస్తాడు. ఆమె అందాల ఆరబోతకే తప్ప, ఎపుడు వెళ్తుందో తెలియదు, కేవలం ఒక పాట కోసం మాత్రమే వరని  ప్రేమించే వ్యక్తిగా ఆ ఎర్ర సముద్రం అనే  ద్వీపంలో ఉంటుంది. విలన్ గా భైర పాత్రకి న్యాయం చేశారు సైఫ్ అలీఖాన్. అలాగే దేవరా-వరా రెండు పాత్రలకి కూడా ఎన్టీఆర్ న్యాయం చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పోరాట సన్నివేశాలు వాటి వెనకాల వచ్చేటువంటి సంగీతం మనస్సుకి హత్తుకునేలా ఉంది. సినిమాలో రెండు మూడు పాటలు మాత్రమే చూపించడగలిగారు. సినిమా నిడివి దృష్ట్యా ఎక్కువ పాటలకు ప్రాధాన్యం ఇవ్వలేదని అనుకోవచ్చు. కాకపోతే దేవరని వర చంపాడు అనేది ప్రేక్షకులందరికీ ఓ ప్రశ్నార్ధకంలా  ఉన్నప్పటికి, చివరిలో దేవరను చంపింది తన కుమారుడు వర అనేది ప్రకాష్ రాజ్  ద్వారా వినడంతో కథ సుఖాంతం అయిపోతుంది. అందరం అనుకునేలా దేవరని కొడుకు ఎందుకు చంపాడు అనేది పార్ట్ 2  లో చూడాలని, కాకపోతే తన కొడుకు ఎలా అయితే మంచితనం కోసం చివరలో తనని తనే ఆత్మార్పణ చేసుకుంటాడో, అలాగే దేవర కూడా ఊరి మంచి కోసం చంపబడ్డాడు అనేది చెప్పకనే చూయించాడు కొరటాల శివ. కధా ప్రారంభంలో కొంచెం అలజడిగా కనిపించినప్పటికీ ఎన్టీఆర్ రావడంతో కథలో ఉత్సాహం రేగుతుంది. అప్పటినుంచి చివరి వరకు అక్కడక్కడా చిన్న చిన్న సంఘటన పెద్దగా తీసివేసే సన్నివేశాలు అయితే ఏమీ లేవు.  మొత్తం మీద ఒకే కథనం,  పాత కధ  అయినప్పటికీ కొత్తదనంగా మంచి కోసం నిలబడే వ్యక్తిగా ఎన్టీఆర్ పాత్ర , తనని ప్రేమించే వ్యక్తిగా జాన్వికపూర్ పాత్ర , ఊరు కోసం దేవర తన ప్రాణాల్ని కూడా లెక్కచేయని పాత్ర గురించి చెప్పే సన్నివేశాలలో ప్రకాష్ రాజు నటన కలిసి దేవర చిత్రాన్ని మిశ్రమంగా నిలబెట్టాయని చెప్పవచ్చు.

ఆస్తులు: 

ద్విపాత్రాభినయంలో తారక్ అభినయం,ఎన్టీఆర్‌ నటించిన విధానం, భారీ విజువల్స్ , సైఫ్‌ అలీఖాన్‌ ‘భైర’ పాత్ర, ముగింపు ముందు, ముగింపులో వచ్చే నీటిలో జరిగే పోరాట దృశ్యాలు , సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌.రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ , విజువల్స్ , ఎమోషనల్ యాక్షన్ డ్రామా, వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్

కుదుపులు :

కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ , ప్రధమ భాగంలో ఉన్న హైప్ ను సినిమా ఆసాంతం కంటిన్యూ చేయలేకపోవడం, జాన్వీ కపూర్ – ఎన్టీఆర్ ల మధ్య అనుకున్నంత లవ్ ట్రాక్ లేకపోవడం, కొన్ని సన్నివేశాల్లో  నెమ్మదిగా కనిపించిన కధనం

పాత్రధారులు ఎన్టీఆర్ (దేవర, వర ), జాన్వి కపూర్ (తంగమ్), శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సైఫ్ అలీ ఖాన్ , మురళి శర్మ, హరిప్రియ, అజయ్,  హిమజ, గెటప్ శ్రీను 
నిర్మాత మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్
సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్ 
సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు
పోరాట దృశ్యాలు : హిషామ్ ఛోటాని 
కళా దర్శకత్వం: సాబు సిరెల్ 
-- అవ్యజ్ (శంకర్) 2.9**/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog