35 Chinna Kadha Kaadu

35 (౩౫) చిన్న కధ కాదు - ఆహా..!

సరదాగా, అందరికి ఈ 35 సంఖ్య చూడగానే ఏమైనా గుర్తొచ్చిందా.. 🤔మ్మ్... గుర్తొచ్చే ఉంటుందిలేండి, వెనుక బెంచ్ వాళ్లకి మాత్రం తప్పకుండా... 🤣🤣చిన్నతనంలో పోటీ పడలేని విసుగు చెంది వన్ డే మ్యాచ్ మాదిరి కుస్తీ పడే సగటు విద్యార్థుల మనోగతానికి మాత్రం ఖచ్చితంగా తగిలే వుంటుంది. గత నెలలో థియేటర్లలో వచ్చి అలరించిన ఈ చిత్రం అక్టోబర్ 2 నుండి ఆహా OTT లో ప్రదర్శింపబడుతుంది. అసలేం చెబుతోంది ఈ 35 ఇపుడు చూద్దాం.  ఈ 35 సంఖ్య ప్రతి విద్యార్థి ఈవితంలో ఎప్పుడోకపుడు కనిపించైనా  వినిపించైనా ఉండే ఉంటుంది. శ్రీమతి శ్రీపతి  .................. బాల సరస్వతి పాత్రలో నివేదా థామస్ అలరించింది. కాస్త బ్రాహ్మణ ఆచారం చిత్తూరు జిల్లా యాస కలిపి తిరుపతిలో ఉండే ఓ చిన్న కుటుంబం చుట్టూ జరిగే కుటుంబ కధనే ఈ చిత్రం. తన బావని ప్రేమ వివాహం చేసుకొని తిరుపతిలో స్థిరపడిన బాల సరస్వతి (నివేత థామస్) సత్య ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) దంపతులకి ఇద్దరు సంతానం అరుణ్ (అరుణ్ దేవ్ పోతుల) వరుణ్ (అభయ్ శంకర్) లు. వీరంతా కలిసి ఎలాంటి చీకూ చింత లేకుండా ఒక సుఖమైన జీవితమని సాగిస్తారు. అన్నిటిలో ముందుండే తన పెద్ద కొడుకు అరుణ్ వేసే ప్రశ్నలు చాలా లాజిక్ గా సమాధానం చెప్పలేకుండా ఉంటాయి. ఇవి ప్రేక్షకుడిని కూడా కొంత ఆలోచింపచేసేలా చేస్తాయి. దీనితో లెక్కల సబ్జెక్టులో తాను వెనకబడతాడు. మరి లెక్కల సబ్జెక్టు మూలాన తన జీవితంలో, తన తల్లి సరస్వతి జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? ఆ లెక్కల సబ్జెక్టులో కనీస వంతు 35 మార్కులతో అరుణ్ పాస్ అవ్వాలనే సందర్భం ఎలా వస్తుంది? చివరికి ఈ కథ ఎలా సుఖాంతం అయ్యింది అనేది చిత్రం. అన్నిటిలో తెలివైన పిల్లవాడు తనకి వచ్చే అనుమానం వలన చదువును పాడుచేసుకోకుండా, తాను అడిగే ప్రశ్నలకు విసుగుకోకుండా సమాధానం కోసం తనని తాను మార్చుకుంటూ ప్రయత్నం చేసే తల్లిగా నివేద పాత్ర చిత్రీకరణ చిత్రానికే ప్రధానాకర్షణ. 
Niveda in 35-Chinna kadha kaadu

ఆస్తులు : 

సినిమా కథనం మొదలైన మొదటి నిమిషం నుంచి ఆర్.పి.పట్నాయక్, కళ్యాణ్ మాలిక్ చాలాకాలం తర్వాత ఇచ్చిన ఇంపైన సంగీతం, నేపథ్య సంగీతం, తిరుపతి వాతావరణం అంతా చాలా రిఫ్రెషింగ్ గా ఆహ్లదంగా కనిపిస్తాయి. మరి వీటికి తగ్గట్టుగానే సినిమా కొంత వినోదాత్మకంగా నడుస్తుంది. చిన్న పిల్లల మధ్య ఉండే స్నేహం, కలగలిసి ఒకటిగా ఉండే తత్వం, తల్లిగా బాలసరస్వతి తీసుకొనే నిర్ణయం కధని నడిపించిన విధానం బావుంది. పిల్లలు, గౌతమి, నివేద, పాఠశాల ఉపాధ్యాయుడుగా ప్రియదర్శి రామ్ కొంచెం నెగిటివ్ కోణంలో కనిపించి అలరించాడు. భానుచందర్ నటన బావున్నాయి. సెకండాఫ్ లో నివేదా పై నడిచే ప్రతి సన్నివేశం బాగుంది. తన కొడుకుతో సంఖ్య ’10’ కోసం చెప్పే డైలాగ్ అయితే సినిమాలో వావ్ అనిపించేలా ఎగ్జైట్ చేస్తుంది అనే చెప్పాలి. చిత్రంలో కదిలించే భావోద్వేగాలు కొంచం బాగానే ఆకట్టుకుంటాయి. 

కుదుపులు: 

చిత్రంలో మొదటి భాగం కథనం కొంచెం నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. అలాగే ద్వితీయ భాగం కూడా ఒకటి రెండు చోట్ల కొంచెం నిదానంగా ఉందనే భావన కలుగుతుంది. అలాగే ఈ చిత్ర మూల కథ చాలా తేలిపోయినట్టుగానే అనిపిస్తుంది. దీనితో మరీ ఎక్కువ కొత్తదనం కోరుకునేవారు కొంచెం నిరాశ చెందవచ్చు. కొడుకు అరుణ్, నివేత థామస్ నడుమ రెండవ భాగంలో కనిపించే సన్నివేశాలు కొంచెం ముందు నుంచే ఉండుంటే ఇంకాస్త ఆసక్తికరంగా ఉండేదేమో అనిపించింది. 

OTT విడుదల తేదీ : అక్టోబర్  02, 2024 
నటీనటులు : నివేతా థామస్, విశ్వదేవ్ రాచకొండ, మాస్టర్ అరుణ్ దేవ్, మాస్టర్ అభయ్ శంకర్, గౌతమి, ప్రియదర్శి.
దర్శకుడు : నంద కిషోర్ ఇమాని 
నిర్మాతలు : సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి 
సంగీత దర్శకుడు : వివేక్ సాగర్ 
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మిరెడ్డి 
ఎడిట‌ర్ : టీసీ ప్రసన్న
సమర్పణ : సురేష్ ప్రొడక్షన్స్ 
-- అవ్యజ్ (శంకర్) 2.8**/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog