Fun review 3/ రౌడీ పిల్ల రివ్యూ


మూవీ
 ఓల్డ్ దే ఐనా కొత్తగా వచ్చే  రివ్యూకోసం ఘోరంగా ఎదురు చూస్తున్న ఆడియన్స్ ఆశల్ని ఆపేయటానికి అనుకున్నరోజు కంటే ముందే హడావుడిగా వచ్చేసిన మసాలా బ్రేక్ ఫాస్ట్  ..

మల్టి అడ్వర్టైజింగ్ మీడియా : షీబా కమ్ తోషిబా కమ్ అమీబా కంపెనీ

కధ : ఓ పాత అరిగిపోయిన రికార్డ్ 

పాటలు, మాటలు : రాయనైనా రాయలేను భాషరాని వాడనూ...

డాన్స్ : ఉన్నదదొక్కటే 

నటుడు : కనబడుటలేదు

నటి : లాయర్ గా పేరు మార్చుకున్న ఓ పాత రౌడీ పిల్ల

డైరెక్టర్ : దాచివేయబడ్డారు

సారాంశం :-  ఒకే ఒక శుభ్రమైన స్టెప్ తో ముగించేసిన విజువల్ ఎంటర్ టైనర్. వీడియో పాతదవడం వలననేమో కనిపించీ కనిపించకుండా బ్లాక్ & వైట్లో మేనేజ్ చేసినట్టుంటుందీ పోస్టర్. చిన్నప్పుడు నేర్చుకున్న ఎం.ఎస్. పిడకల స్టెప్ కి అప్డేటెడ్ స్టెప్పే ఈ గ్లాస్ క్లీనింగ్ బ్రేక్ డాన్స్. వావ్ అనిపించే ఓ నాలుగు క్లీనింగ్ స్టెప్పులు, లాయర్ గా మారినా కూడా గ్రూప్ డాన్సర్స్ ని బతకనీయకుండా తానె హైలైట్ అవ్వాలని ఈ రౌడీ పిల్ల చేసిన స్టేజ్ ప్లేస్ మెంట్ కబ్జా అంతా ఇంతాగాదు. హాండ్స్ తో ఎదురుగా లేని గ్లాస్ ని ఉన్నట్టు ఊహించుకొని, లెగ్స్ తో డాన్స్ ఫ్లోర్ ని ఊడ్చేస్తూ, మధ్య మధ్యలో దండం పెట్టే స్టెప్స్ ఐతే అందరి చేతా చప్పట్లు కొట్టించేలా చేస్తాయి. అన్నిటినీ మించి అవలీలగా ఒళ్ళంతా తీగలా తిప్పేసిన నాజూకైన నాట్య సౌందర్యం చూసి తీరాల్సిందే. ఇంతకు మించి పొగడాలని ఉన్నా పరిస్థితుల వలన రివ్యూయర్ భావాలనే కలానికి మౌనమనే ముసుగేసి  గుండెల్లో కప్పెట్టేశాం..

కాస్ట్యూమ్స్ : ఓ ప్యాంట్ - ఓ చొక్కా , ఓ జత రెడ్ క్యాజువల్ షూ

సంగీతం : హిప్ హిప్ హుర్రే మేళం

ముగింపు : అరుకుట్ బుక్కా - ఫేసు బుక్కా ఎక్కడ పోస్టాలో అని ఆలోచిస్తూ గుర్రెట్టి నిద్రపోవడం

రేటింగ్ : చాలా మాచ్ ఫిక్సింగ్ సిట్టింగ్ ల తర్వాత ఓ 3.5*** కి అన్యాయం చేశాం

వ్రాసినవారు : గప్ చుప్ సాంబార్ బుడ్డీ ..😊

--

 శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog