A Pic (The story teller) / అనగనగా ఓ బొమ్మ కధ

##** అనగనగా ఓ బొమ్మ కధ**##

పొదుగాల పొదుగాలే లేచి గుడ్ మార్నింగ్ మెసేజ్ కోసం వాట్సాప్ చూస్తాంటే  ఏం రా బట్టే బాస్ నా గురుదచ్చిన  ఏడరా అంటూ అడిగినట్టు రెండు ఫొటోలు అడిగినయ్.....అసలే మోమాటమాయే అడిగితే కాదనగలనా...ఇక సూడుండ్రి అని అప్పుడు షురూ జేసినా..
గీ పోటోల స్టోరీ ఏందా అని థింకుతాంటే తళుక్కన్నవిరా ఓ నాల్గైదు పాత జ్ఞాపకాలన్నట్టు గీ మిడ్డీ పోటోల , ఇంకా పింక్ శారీలొ ఉన్న గుర్రుమనే చూపుల టీచర్.ర్.ర్.ర్..ర్ .ర్ ....
ఎందుకా అని సోచాయించుతాంటే అప్పుడు ఎలిగింది గా సిమెంట్కలర్ మిడ్డీ పోటో , టీచర్ తాన ఎవరో లాలీపాప్ లాక్కున్నప్పుడు తీసిన పిక్ అని..గప్పటి నుండీ ఈక తోక వచ్చి, అప్పటికింకా ఆమె వయస్సు నిండా పదారే అన్నట్టు అర్దమయ్యే పింక్ & గ్రే పంజాబీ పోటో. గేమాట గామాటే జెప్పాలా , గా ఫోటొలబ్బాయెవరో గానీ లాలీపాప్  ఎత్తుకెళ్ళిన ఏజ్ నుండి ఈకతోక ఏజ్ వరకూ ఒకే మూడ్ కాప్చర్ జేయనీకీ ఎంత కిందామీదా అయ్యాడో అని.... పదో క్లాస్ ఏజ్ వచ్చినా లాలీపాప్ తినుడెందిరా అనుకుంటాంటే , అనుకోకుండా ఎవడో ప్రపోజ్ చేస్తే వచ్చిన గులాబీ చెట్టు, ఎవరో ఎత్తుకెళితే కోప్పడ్డట్టుందీ ఈకతోక ఏజ్ పిక్.. గానీ గస్సల మాటర్ అదిగాదట ఆ గుర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్రనే పింక్ చున్నీ పిల్ల , ఎర్రబడ్డ తెల్లటి కళ్ళ ఎనకాల స్టోరీ. ఈకతోక ఏజోచ్చినా ఎవడూ ప్రపోజ్ చేయలేదని బుంగమూతి పెట్టబోయే ప్రయత్నంలో ఫెయిల్ ఐ బోయపాటి సినిమాలా అగ్గిమీద గుగ్గిలమై హిట్ ఐ ఫట్ ఐ ఆ పైన సెట్ ఐన ఆవేశం అట. నాకైతే అయ్యేమి కనిపియ్యలే, తలపై నుండి కళ్ళదాకా జడనుకుని ముందుకేసుకున్న ఆ నల్లని సన్నని వెంట్రుకల సమూహం ఒక్కటే కనిపించింది.... ఇప్పటిదాకా ఆ ఎర్రబడ్డ తెల్ల కళ్ళ కోసం, చెట్ల వెంటా , పుట్ల వెంటా, పచ్చని పరికిణీ ఏసిన ప్రకృతి గెస్ట్ హౌస్లో ఓ పెగ్ వేస్తూ రాతలు రాసే సినిమాకవిలా స్టార్ట్ చేస్తే, ఆ పెగ్ గొంతులో దిగేసరికి, తాగినోళ్ళ తందనాలూ అంటూ తాగి వాగినట్లు నా కలం రాసిన తాగుబోతు నిజాల ☺️ గురుదచ్చిన స్టోరీలోని ఆ టీచర్..ర్..ర్.... కళ్ళ వేడికి కిక్ దిగి బక్కచిక్కి డ్రై అయిపోయిన కలం ఆగిపోనాది. అందుకే ఇంతటితో ముగించేశా😢.....
ముగింపు :- ఇవన్నీ మనసులోవి గాక, స్టోరీకోసమే ఎత్తుకొచ్చి రాసిన యాంత్రిక భావాలు  మాత్రమే... నో అదర్ పీలింగ్స్ , నో అదర్ హర్టింగ్స్. సమఝయిందా... ? అవుతదిలే..

--
శంకర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog