A Pic (The story teller) / అనగనగా ఇది ఇంకో బొమ్మ కధ

##** అనగనగా ఇది ఇంకో బొమ్మ కధ**##

ఈ బొమ్మ తగలెట్టడానికి ఎత్తు కొచ్చిన నిప్పులన్నీ రాత్రి బ్రైన్ అనే స్టోర్ రూమ్ లో వేసి ఓ మంచి కోసం ధరలు మండిపోతున్నా బాగా మండాలని ఓ చుక్క పెట్రోల్ యాడ్ చేసి వదిలేశా. తెల్లారి లేచే సరికి మల మల మాడిపోయే ఓ స్పైసీ ఆనియన్ - పెసర బ్రేక్ ఫాస్ట్ రెడీ అయ్యింది, మరి టేస్ట్ జూసీ ఆడియన్స్ పల్స్ చెప్పాల ఎలా ఉందో.....
బొమ్మ బాక్ డ్రాప్ చూసి ఆహా, బుద్ధం శరణం గచ్ఛామి అన్న ముచ్చటైన జంట అనుకున్నా, గాని ఆ తలకోకట్టెట్టి, కళ్ళకు ఓ కనపడని జోడెట్టీ , రెండు హాఫ్ హాఫ్ నల్ల బూట్లెట్టీ, మెడలో వైర్లేసుకుని ఓ ఆత్మాహుతి దళ మానవబాంబులా బిల్డప్ ఇచ్చి ,అంతటితో ఆగకుండా పాత ఎన్టీవోడి (ntr) ప్యాంటేసుకుని అప్పుడే రిలీజైన దెబ్బకు ఠా - దొంగల ముఠా అనే ఒకే ఒక దొంగకి డాన్ అవ్వాలని ఆశతో వాడి భుజంపై చెయ్యేసి, నొక్కేసి, గిల్లేసి, తొక్కేసిన వీరత్వానికి బలైపోయిన "బి భీ  - భీం  " అమాయక ఫేసు జూసి జర్రంత బాధపడ్డా. హ్మ్..మ్..ఇప్పుడే ఇచ్చాడో ట్విస్ట్. కొత్తగా రిలీజైన కె.జి.ఎఫ్. మైన్ పై కన్నేసి, జుర్రేసి, లాగేసి, కొల్లగొట్టేసి, కాజేసి, తెచ్చేసింది పోలీసులకి దొరికేసింది కె.జీ.ఎఫ్. గోల్డ్ మైన్ రాబరీ కేస్ లో కాదనీ సింగరేణి మైన్స్ క్వారీ లూటీ కేస్ లో అనే ఫ్రస్టేషన్ లో వచ్చిన బ్లాక్ లుక్ లో ముఖం నల్లబడ్డ బంగారయ్య అని, ఇంకా ఆ పక్కనున్న డాన్ గిల్లుడుకి కూడా కాదనీ... ఇలా అమాయకంగా ఇద్దరూ ఫోటోలకి నాకూ దొరికిపోతే బాగోదని బెటర్ దొంగలు అవ్వడం కోసం ఏదైనా రీహాబిటైజేషన్ సెంటర్ లో ఇద్దర్నీ జాయిన్ చెయ్యడం బెటర్ అని తెలిసి,అలసి, సొలసి, బోరేసి(బోర్ కొట్టి), వెక్సేసి, ఓ పెగ్గేసి లైట్ ఆపేసి, ఆ పైన బెడ్ షీట్ కప్పేసి, ఇంతటితో ముగించేసీ మళ్ళీ తొంగుంటున్నా..... ఎర్లీగా కంగారు పడి లేచినోళ్ళందరికీ గుడ్ మార్నింగ్ .. 😊🍵
--
శంకర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog