Bhahishkarana - A Zee5 Original

 ఎవరిని బహిష్కరించారు ?


గీతాంజలి ఫేమ్ అంజలి నటించిన వెబ్ సిరీస్ బహిష్కరణ జులై 19 న జీ 5 - ఓ.టి.టి. వేదికగా విడుదలయింది. ఈ సిరీస్ 6 భాగాలుగా వుండి, ఆసాంతం సాదాసీదాగా నడుస్తుంది. మొదటి భాగం అంజలి శృంగార వేశ్యగా అందంతో ప్రారంభమై సాగుతూ అంటరాని ఊరి పొలిమేరలో నివస్తిస్తున్న ఓ వర్గం మరియూ ఆ గ్రామ ప్రెసిడెంట్ మధ్య సాగే కులం-వర్గం వంటి గత సమాజపు హెచ్చు తగ్గులు గురించి తెలియచేసింది. ప్రెసిడెంట్ శివయ్యకు నమ్మినబంటు దర్శి , సూరి వంటి పాత్రల పరిచయంతో మొదలయి ప్రెసిడెంట్ (రవీంద్ర విజయ్) ఆ పెద్దపల్లి గ్రామ ప్రజలకు నమ్మికగా చేసిన దారుణమైన విషయాలు వెలికితీసే కధాంశంతో వచ్చింది ఈ సిరీస్. ఓ రకమైన రంగస్థలం పీఠికను ఐచ్చికంగా తీసుకొన్నారు అనిపించింది. కాకపొతే అందులోని రాజకీయాంశాన్ని తప్పించి, ఈ ఆధునిక సమాజంలో కూడా జరుగుతున్న స్త్రీ స్వేచ్ఛ ఆటంకాలను, బాలికల పై అత్యాచారాలను కధకు చొప్పించి రచించారు. తరువాతి భాగాలలో ప్రెసిడెంట్  శివయ్య ఇంట్లో పనిచేసే సామాజికంగా వెనుకపడ్డ ఓ పనిమనిషి లక్ష్మిగా అనన్య నాగళ్ళ పరిచయం అవుతుంది. ఆ శివయ్య కొడుకు చేయుటలో మోసపోయిన లక్ష్మి తన బావ, అప్పటికే అంజలిని ప్రేమిచిన దర్శి (Shritej) ని ప్రెసిడెంట్ బలవంతంతో పెళ్లిచేసుకోవలసి వస్తుంది. శివయ్య చేసే దాష్టీకాలు మొత్తం సిరీస్ ఆఖరులో తెలుస్తాయి. ఆ భాగాలలో కొంచం భావోద్వేగం ఉంటుంది. ప్రేమ విఫలమైన అంజలి ప్రెసిడెంట్ కి ఉంపుడుగత్తేగా వుంటూ ఓ రకంగా గ్రామంలో ఆడపిల్లలను కాపాడాలి అనే సదుద్దేశ్యంతో పాటు అక్కడి అరాచకాలను అక్కడకి ఓ ఆత్మహత్య కేసు విషయమై వచ్చిన ఆఫీసర్ తో కలిసి శివయ్య చేసిన తప్పుడు పనులను ఎలా బయటపెడుతోంది, దానికి లక్ష్మి తోడ్పాటు ఎందుకు కలిసి వచ్చింది వీరు ఇద్దరు కలిసి ఎలా ప్రెసిడెంట్ దుర్మార్గాన్ని  కాల్చి బూడిద చేయరు అనేది కధలోని ముగింపు. ఆఖరి ఎపిసోడ్స్ భవయోద్వేగం ఉంటుంది. నటుల నటన బావుంది. భారీ సస్పెన్స్ అనిపియ్యలేదు. అంజలి అందాల బాహాటం పెద్దగా ఏమి లేదు. అనన్య నాగళ్ళ కొంచం బక్కచిక్కి , చిక్కపడి చూడచ్చు అనేలా ఉంది. కాకపోతే శివయ్య తన భార్యని కొడుకుని ఎలా అంతమొందించారు అనేది మిస్సింగ్ పాయింట్. ఒక్క భాగంలో మాత్రమే అవసరానికి కనిపించి మాయం అవుతారు. కధ మొత్తం ప్రెసిడెంట్, అంజలి (పుష్ప) , దర్శి ( శ్రీతేజ్ ), అనన్య(లక్ష్మి) మధ్యనే ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఎడిటింగ్ సిరీస్ భాగాలుగా కనుక ముక్కలుగానే ఉంటుంది. 

నటీనటులు: శ్రీతేజ్,  అంజలి, అనన్య నాగళ్ళ, రవీంద్ర విజయ్, షణ్ముఖ్, మహబూబ్,  బాషా, చైతన్య సాగిరాజు
దర్శకుడు: ముకేశ్ ప్రజాపతి 
సంగీతం: సిద్దార్థ్ సదాశివుని 
నిర్మాత:  ప్రశాంతి మలిశెట్టి 

-- అవ్యజ్ (శంకర్) 2.6**/5*****

Sponser Ad

Buy POCO C65 (256 GB)  (8 GB RAM)

  • 17.12 cm (6.74 inch) HD+ Display
  • 50MP + AI Lens + 2MP | 8MP Front Camera
  • 5000 mAh Battery
  • Helio G85 Processor


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog