Ippudu kaka inkeppudu/ ఇప్పుడుకాక ఇంకెప్పుడు

 


" ఇప్పుడుకాక ఇంకెప్పుడు " తెలుసుకుందాం - జీ-5 OTT 

----------------------------------------------------

హస్వంత్ వంగా , నమ్రత దారేకర్ నూతనజంటలో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ "ఇప్పుడుకాక ఇంకెప్పుడు". కధకి టైటిల్ కి సంబంధం పెద్దగా లేకపోయినా యూత్ ని అలరిస్తుందని చెప్పవచ్చు.అతి జాగ్రత్త వలన జరిగిన తప్పుతో ముడిపెట్టిన ప్రేమబంధం ప్రధానాంశం. వెర్రెక్కించే అడల్ట్ సీన్స్ తో మొదలయి చిన్నగా ప్రేమగా మారిన కధనం. అప్పుడప్పుడు మంచి చెడుల న్యూనతలని , ఆలోచనలని నెమరు వేసుకుంటూ సాగిన ప్రేమకథ పెళ్లితో సుఖాంతం అవుతుంది. యుగంధర్ డైరెక్టర్ గా స్క్రీన్ రైటర్ గా బాగానే రాణించాడు. సీనియర్ నటులు వారి పాత్రలకు తగ్గట్టు నటించారు. హాట్ అండ్ సెక్సీ క్లాసికాల్ బ్యూటీగా నమ్రతా కనిపిస్తుంది. క్యూట్ హీరోగ హస్వంత్ నటన కొంతవరకు ఆకట్టుకుంటుంది. 2.9* / 5*

--

శంకర్🙂

వ్యక్తిగత అభిప్రాయం

#review #whatifacommonmanspeaks #moviereview

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog