Lawyer Viswanadham/ లాయర్ విశ్వనాధ్

 



నేరం ఎవరిది ? చేసిన వారిదా లేక చేసేలా రెచ్చగొట్టిన వారిదా?

------------------------------------------------

ప్రస్తుత సమాజ పోకడలనుండి నాలుగు వైవిధ్య పాత్రలు, కధలను - కథనాలుగ తీసుకొని ఒకే విషయానికి జోడించి క్లుప్తంగా చిత్రీకరించాడు దర్శకుడు బాలనాగేశ్వరరావు. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికి వారికి సులభం అనిపించినా జాగ్రత్తగా అలోచించి నిర్ణయం తీసుకోవాలనే పరిస్థితికి అద్దం పడుతుంది . గతంలో జరిగిన నేరాన్ని ప్రశ్నించడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధిస్తాడు. తల్లితండ్రులుగా పిల్లల బాధ్యతకి సమాజానికి మధ్య జరిగే నిత్య సంఘర్షణని చూపించారు. ఓ చిన్నారి తల్లిని అడిగే ప్రశ్న ఆలోచింపచేస్తుంది. తల్లి దండ్రుల పాత్రల్లో అలీ - మలయాళ నటి నియాసంకరతిల్ కొంత ఆతృత కనబరిచారు. ఆలోచనతో ఆచరించటానికి చూడదగిన పాత టైటిల్ తో వచ్చిన కొత్త సినిమా లాయర్ విశ్వనాధ్ .

--

శంకర్🙂

వ్యక్తిగత అభిప్రాయం

#review #moviereview #telugumovies #movie #Ott

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog