No Parking/ ఇచ్చట వాహనాలు నిలుపరాదు

 


#Notarecentmoviebut tsalatestreview

#commonmanspeaks

#what_if-a-common-man-speaks

ఇచ్చట వాహనాలు నిలుప (_రాదు_) వచ్చు :-

-------///////---------//////---------

సుశాంత్, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వచ్చిన " ఇచ్చట వాహనాలు నిలుపరాదు " పేరుకి తగినట్టే కథని ఎంచుకుని సమకూర్చుకున్నారు దర్శకుడు. అలాగని వాహనాల రద్ది గురించి ఎక్కువగా సొద పెట్టకుండా అర్ధం చేసుకునేలా ఒక కారణంగా చూపించి కధని ఆకర్షణీయంగ మలిచారు.ఫోటోగ్రఫీ బావుంది.ఒకపాట ఓ మాదిరిగా ఉన్నా అన్ని పాటలు అలరించకపోవచ్చు. నూతనంగ పరిచయమైనప్పటికీ నటిస్తున్నట్టు తెలిసినా రొమాన్స్ చేయటానికి రెడీ అన్నట్టు మీనాక్షి  మురిపించింది.చాలా కాలం తరువాత సుశాంత్ కి మంచి కథ దొరికిందనే చెప్పవచ్చు.కొత్త దర్శకుడే ఐనా అన్ని రుచులతో మంచి గోదారోల్ల అభిమాన భోజనం వడ్డించటానికి ప్రయత్నించాడు. గుప్పిట ఏదో ఉన్నట్టు చూయించటానికి ప్రయత్నించి ఓస్ ఇదేనా అన్నట్టు తేల్చేశాడు.ఫేమ్ ఉన్న హీరో ఐతే చిత్రానికి అస్సెట్ అయ్యెది. చాలాకాలం తర్వాత కనిపించినప్పటికీ వెంకట్ కూడా బాగానే నటించాడు. వెన్నెల కిషోర్ మార్క్ హాస్యం పెద్దగా లేదనే చెప్పవచ్చు.ఈ వారాంతంలో చూడదగిన సినిమా అనిపిస్తుంది.

-----//-శంకర్😊 (వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే) -//----

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog