R.R.R./ రౌద్రం , రణం, రుధిరం

 


ఆర్. ఆర్. ఆర్. 

-----------------------

రాజమౌళి బాధ్యతని 1000 % పెంచిన సినిమా. అవును ఖచ్చితంగా వేయి శాతం. ప్రతి ఒక దృశ్యం అపురూపం అద్భుతం అనే చెప్పాలి. వెండితెర పైన రగిలే బంగారపు కొలిమిని చూడచ్చు. ప్రేక్షకుడు థియేటర్ లో అడుగుపెట్టినప్పటినుండే కథలో కలిసి ప్రయాణిస్తాడు. టైటిల్స్ అనేవి పాత్రలని పరిచయం చేస్తూ చూపించే సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. ఎక్కడైనా చూపు మరల్చుకొంటామేమో అనే భయాన్ని విడిచిపెట్టి చెవులు రిక్కించి , ఊపిరి బిగపట్టి, పిడికిలి బిగించి తెల్ల దొరల తూటాలకు ఎదురెళ్లి ఏనుగులాంటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకిలించేలా పిడిగుద్దులు గుద్దుతూ అన్యాయాన్ని ఏకిపారేసిన రాజమౌళి సృష్టిలోని కొమరం భీం , రామరాజులు నిజమైన వందేమాతర భారతమాత ముద్ర. ఒకరిని మించి ఒకరు పోటీపడి జీవించారు. సున్నితమైన స్నేహబంధాన్ని ఎక్కడా ఇబ్బందిపెట్టకుండా ప్రాణం ఇచ్చేలా కధనాన్ని అళ్లిన రాజమౌళి కి హ్యాట్సాఫ్. నిజజీవితంలో ఎవరికి తెలియని స్నేహితులు చరణ్, తారక్ ఇందులో భిన్న ధృవాలుగా పాత్రలో కలిసిపోయిన నడిచారు. పోరాట  సన్నివేశాలకు భావోద్వేగాన్ని జోడించి ప్రతి వ్యక్తికీ ఒక ఉద్వేగ ఆయుధాన్ని ఎక్కుపెట్టేలా చిత్రీకరించారు. ఛాయాగ్రాహకుడి సెంథిల్ కుమార్ నైపుణ్యం అపూర్వం. సన్నివేశానికి తగినట్టు కీరవాణి అందించిన నేపధ్య సంగీతం ఓ పెద్ద ఆస్తి. నాయక నాయికలు శ్రీయ, అజయ్ దేవగన్ , అలియాభట్ పాత్రల నిడివి తక్కువే ఐనా అవి లేకపొతే కథకి జీవం లేదు అనేలా ఉన్నాయి.మొదటి భాగం సినిమాటిక్ గ ఉన్నట్టున్నా విరామ సమయం ముందున్న సన్నివేశంతో కధకి పట్టు బిగుస్తుంది.అక్కడక్కడా కళాత్మకత కనిపించినా అవి సినిమాకి సహజంగా ఉంటాయి. ఉద్వేగాన్ని మనసంతా నింపుకుని చూసే ప్రేక్షకుడికి ఆహ్లాదాన్ని ఇచ్చి తీరుతుంది ఈ సినిమా. 

-------------

3.5***/5

శంకర్😊 (వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే) 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు

మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.

Search This Blog