Be with me / నీవుంటే..

నచ్చిన చెలి తన దగ్గర ఉన్నప్పుడు, లేనపుడూ పడే ఆనంద ఆవేదనల ప్రతిరూపం 

............నీవుంటే.......!!!!

తొలకరి జల్లుతో పుడమి ఎలా పరవశించునో,

అదేవిధంగ నీ స్పర్శ తో నేను పరవశిస్తాను.!


అనావృష్టి కాలం లో ఒక తొలకరి జల్లు కోసం రైతు ఏవిధంగా ఆశతో ఎదురుచూస్తాడో అలా నేను నీ దర్శనం కోసం వేచివుంటాను.

వెచ్చగా నా హృదయాన్ని తాకినా నీ తలపుతోనే నాకు వసంత కాలం ప్రారంభం.

ఓ ప్రియా...!! నీ ఊహ లేని నాడు నాకు లోకమంతా గ్రీష్మంగ అగుపిస్తుంది.

నీవు నా చెంతలేని సమయాన సకల భూ మండలము ప్రళయ కాలం వలె తోస్తుంది.

నిర్మలమైన ఆకాశంలో పున్నమి చంద్రుని అపురూపమైన వెన్నెలలో నీ సాంగత్యం ఆహా.....!!!

ఈజన్మకు ఈ కొద్దిపాటి వరము దొరికితే చాలు అనిపిస్తుంది.

ప్రియతమా!! నీ సాంగత్యం లేని నేను శిశిరం లో ప్రకృతి వలె వెలవెల పోతాను.

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog