Radhesyam / రాధేశ్యామ్


తార తళుకు తార : మనందరికీ తెలిసిన ప్రభాస్, పూజ హెగ్డే, జగపతి బాబు, కృష్ణంరాజు, సచిన్ ఖేద్కర్, మురళీశర్మ

సాంకేతిక వర్గం : సినిమాటోగ్రఫీ - మనోజ్ పరమ హంస, 

ఎడిటర్:- కోటగిరి వెంకటేశ్వర్ రావు,

 సంగీతం:- తమన్ , రైటర్ & డైరెక్టర్:-రాధా కృష్ణ కుమార్

కథా కమామీషు : భారీ అంచనాలతో విడుదలై, ఎంతోకాలం ఎదురు చూసిన ప్రేక్షకులకు తెలుగులో సాహసం, ప్రయాణం, లాంటి మూవీస్ చేసిన డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ మూవీ. ఖచ్చితమైన పాల్మీస్ట్రీ ని మనిషి ఆత్మవిశ్వాసానికి మధ్య ముడిపెట్టిన సంఘర్షణలతో కూడిన ప్రేమకథ. కథ ఎక్కువభాగం పూజ హెగ్డే - ప్రభాస్ ల మధ్యనే తిరుగుతుంటుంది. మిగిలిన పాత్రలు అవసరానికి వచ్చి కనపడిపోతూ ఉంటాయి. పామిస్ట్రీ ఐంస్టీన్ విక్రమాదిత్యగా ప్రభాస్ - డాక్టర్ ప్రేరణగా పూజహెగ్దే పాత్ర పోషించారు. అనుభవమ్ ఉన్న నాయికా నాయికలు కాబట్టి నటన గురించి చెప్పేటందుకు మాటలు అవసరం లేదు. ఏమాయ చేశావే మూవీకి పనిచేసిన, బెస్ట్ సినిమాటోగ్రఫీ ఫిలింఫేర్ అవార్డు గ్రహీత పరమహంస అందించిన చాలా క్వాలిటీ రిచ్ విజువల్స్ , ఫోటోగ్రఫీ లుక్ వున్న సినిమా. మొత్తం యూరప్ లోనే తీసిన కథలా ఉంటుంది. యాక్షన్ మూవీ కాదు కాబట్టి తక్కువ సీన్స్ లో తప్ప బాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఎక్కువ స్కోప్ లేదనే చెప్పవచ్చు. ప్రభాస్-పూజల మధ్య ట్రైన్ లో చిత్రీకరించిన సన్నివేశం బావుంటుంది. ప్రేమ, ముద్దు సీన్స్ నచ్చినవాళ్ళ మనసుకి హత్తుకుంటుంది. క్లైమాక్స్ కోసం మాత్రం గొప్పగా ఖర్చుచేశారని చెప్పవచ్చు.యాక్షన్, మాస్ ప్రభావం వున్న ప్రభాస్ చేత ప్రేమకోసం కంటతడి పెట్టించిన సినిమా. ప్రభాస్ ని అలా చూడటం కొంచం నప్పక పోవచ్చు. పాన్ ఇండియా ప్రేక్షకుల మదిలో మాస్, యాక్షన్ హీరో అనే అభిప్రాయం నాటుకు పోయి ఉన్నప్పటికీ ఆ చట్రం నుండి ప్రభాస్ బయటపడడానికి ఓ ప్రయత్నం చేశాడనుకోవచ్చు. పాటలు, లిరిక్స్ పెద్దగా ఆకట్టుకోవు. కథలో కలిసిపోయి ఉన్నట్టే ఉంటాయి.ఎడిటింగ్ పరంగా బాగానే ఉంది. అనవసరం అని అనిపియ్యకపోయిన పెద్ద ముఖ్యం కాదు అనే సీన్స్ ఉన్నాయి. అవి విక్రమాదిత్య టాలెంట్ కి, బ్రాండ్ ని మరోసారి సపోర్ట్ చేసేవిగా ఉంటాయి.మొత్తానికి ప్రభాస్ పూజల పెయిర్ చూడటానికి విజువల్ల్స్ కోసం ఒకసారి వెళ్లి రావచ్చు అనిపించేలా ఉంటుంది మూవీ.

---

శంకర్

2.95** / 5

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog