Rowdy boys/ రౌడీబాయ్స్

 

రౌడీబాయ్స్ - జీ 5 మార్చ్ 2022 :

*************************

తార తళుకు తార : ఆశిష్(అక్షయ్), అనుపమ పరమెశ్వరన్ (కావ్య), సాహి దేవ్ (విక్రమ్)

సాంకేతికవర్గమ్ : కొంగునూరి డైరెక్టర్, సినిమాటోగ్రఫీ - ఆర్.మాడి , నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్,

కధా కమామీషు :

ఓ బాడ్ బాయ్ మ్యూజిక్ బ్యాండ్ కథ. హాట్ న్ క్యూట్ అనుపమ పరమేశ్వరన్ మంచి బూమ్ ఇచ్చింది మూవీకి. ఆశిష్ కొత్త కుర్రాడు పరిచయం అయ్యాడు. శ్రీ హర్ష కొంగునూరి వ్రాసి డైరెక్ట్ చేసిన ఓ మెడికల్ స్టూడెంట్ , బి.టెక్ విద్యార్థులు మాదే జరిగే ప్రేమ తో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అనుకోవచ్చు. కొత్త డైరెక్టర్ మంచిగానే తీసాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా కొంతవరకు అస్సెట్ ఐతుంది ఎమోషనల్ సీన్స్లో ఇద్దరు బాగానే నటించారు. అక్షయ్-అనుపమల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది. కొంచం మనసుకు హత్తుకునేలా ఉంది. అనుపమని ఇలా ఈ మూవీలో చూసి ఉంటాం. టీనేజ్ లో వచ్చే ప్రేమ ఆకర్షణల మధ్య సంఘర్షణతో పాటు పరిస్థితుల వలన వచ్చే బాధ్యతలని కూడా ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచింపచేసే సినిమా. కొత్త కథ కాకపోయినా ఇలాంటి సినిమాలు ఇప్పుడే వచ్చే కొత్తతరానికి ఎప్పుడు కొత్తగానే ఉంటాయి.2 పాటలు కొంచం తేలిపోయినా ఆఖరి పాట, బృందవనంలో కృష్ణుడు వచ్చాడు పాటలు కధకి తగినట్టు అర్ధవంతంగా ఉంటాయి. ఫోటోగ్రఫీ, సెట్టింగ్స్ బావున్నాయి.ఓ పాటలో బి.టెక్. విద్యార్థుల క్రియేటివిటీ ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తానికి చెప్పదలుచుకున్న వాటిని డిస్టర్బ్ చేయకుండా సాఫీ గానే తీసుకెళ్లినట్టు ఉంటుంది మూవీ.

--

శంకర్

3***/5😊

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog