Malli modalyindi / మళ్లీమొదలైనది

 

"మళ్లీమొదలైన " - సుమంత్ సినీ కెరీర్

***************************************

ఈ టైటిల్ తన నిజ జీవితానికి అన్వయించుకోని పెట్టినట్టు ఉంటుంది. వ్యక్తి గతంగా వెళ్ళకూడదు కాబట్టి మల్లి సినిమాల్లోకి రాబోతున్నారు అని ముందుగానే సినీ ప్రపంచానికి చెప్పాలి అనుకున్నాడేమో సుమంత్. కథ కూడా దాదాపు విడాకులు , తరువాత జీవితం ఏంటి అనే కొంత ఒంటరిభావనతో ఏకీభవించేలా తెరకెక్కించారు. వర్ష మొదటి భార్యగానూ , నైనా గంగూలీ లాయర్ పాత్రలో నటించారు. వర్షిణి ని బుల్లి తెరపైన చూసుంటాం కాబట్టి పెద్దగా పరిచయం చేయనవసర్లేదు. నైనా గంగూలీ కూడా తక్కువ సినిమాలే చేసిన ఇందులో మంచి పాత్ర నే ఎంచుకున్నట్టు ఉంటుంది. అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి. ఇంకొంచం ఎక్కువ సన్నివేశాలు పెట్టిన బావుండు అనిపిస్తుంది. మొత్తం మీద "సెహరి" లాగా ఈ సినిమాలో కూడా "నిర్ణయాలు తేల్చుకోలేని కన్ఫ్యూషన్ " పాత్రలో కనిపించాడు సుమంత్. కాకపోతే "పవిత్ర"గ నటించిన నైనా "రీసెట్" అనే చిరువ్యాపారం మొదలు పెట్టాలనే ఆలోచన బావుంటుంది. "సుహాసిని మణిరత్నం" సుమంత్ తల్లి పాత్రలో, అన్నపూర్ణ గారు అమ్మమ్మ పాత్రలో తమకు ఇచ్చిన పాత్రల నిడివికి న్యాయం చేసినట్టే అని చెప్పచ్చు. వెన్నెల కిశోర్ కామెడీ కొంచమే ఉన్న ఒకానొక ఎమోషన్ సన్నివేశంలో బాగానే పండించాడు. డివోర్స్ కి అప్లై చేసిన, డివోర్స్ ప్లాన్ చేసుకొనే వాళ్ళకి ఎదో కొంత చెప్పాలనిపించేలా తీశారు ఈ సినిమా. కొత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావనిరెడ్డి వైష్ణవిగా, మంజుల ఘట్టమనేని కౌన్సిలింగ్ ఇచ్చే సైకియార్టిస్ట్ పాత్రల్లో సహకరించారు.

--

శంకర్ (వ్యక్తిగత అభిప్రాయం)

2.3**/ 5

😊

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog