Toe Groin / నీ అందెల సవ్వడి

ఓ స్వచ్ఛమైన ఉదయాన పరికిణీలో నడిచే పడతి అందియల ఘల్లు ఘల్లు మని చేసే సవ్వడికి ప్రతి రూపం... 

నా చెలీ..!! ..నీ అందెల సవ్వడి..!! 


నా చెలీ!

నీ కాలి అందెల సవ్వడి అదే నా హృదయస్పందన.

శ్రావణ మాసంలో చిరునవ్వులతో పలకరించు-మధుమాసపు కోయిల వలె నీ పిలుపు నాలో గిలిగింత రేపుతుంది.

సముద్రపు అలలవలె నీలోని అందాలు నాలో భాగస్వామ్యం కాగలవా..!!అంతెందుకు లే ,

నిన్ను వలచిన ఆ బ్రహ్మ ఎంతటి రసజ్గ్నుడో కదా..!!ఈ ఊహను ఆపుటకు ఎవరు సాహసం చేయగలడు.

పిల్లగాలికి పచ్చని పైరు ఎలా నాట్యం చేయునో...అలా నీ..మాటను విన్న మరుక్షణం నా మనసు ఆనంద డోలికలలో ఊగిసలాడుతుంది..!!

నిన్ను తలవని మరునిమిషం నాకొక విషాద సమయంలా తోస్తుంది.

ఓ చెలీ!

నీ పాదాల క్రింద గులాబి రేకులవలె నా ప్రతి రక్తబిందువునూ పరచి నీకు సన్నిహితుడవుతాను.!!

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog