Is yours/ నీ తరమా ఇక నా తరమా

తనను తాను తక్కువ చేసుకుంటూ ప్రేయసి కోసం ఉన్నతంగా దాసోహమయ్యే పదాలు 

...నీ తరమా ఇక నా తరమా....!!

మేరు పర్వతమంత ఉన్నతమైనది కావచ్చు నీ మనసు

అంత విశాలమైన నీ హృదయ మందిరం లో నాకు చిటికెడు స్థానం కలిగించావంటే  చాలు...

నీ హృదయమంత లతలతో పందిరిని అల్లుకున్న జాజి మొక్కలాగా నిన్ను నా వశం చేసుకొంటాను.


నీ ప్రేమసాగరం లో మునిగి ఊయలూగు నన్ను నీ నవ్వుతో ఆకసమంటే ఉత్సాహంతో ఎగసిపడే కెరటంలా సాగిపోనీ...!

నాలోని ఆణువణువూ నీ ప్రేమతో జీవం పోసుకుంటే అపుడే కలిగింది అందని ఆనందం.

అది తెలుపుట నీ తరమా ఇక నా తరమా.....!!

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog