Sakhi/ సఖీ..!



సఖీ..!

నీ హృదయ పంజరం లో బంధీని చేశావా?

ఒక్క క్షణం నీ హృదయ తలుపులు తెరచి చూడు నాలో ధ్వనించే నీ ప్రేమ స్వరాలను ఆస్వాదించగలవు.

సిరిసిరి మువ్వల సందడి వోలె నీమాటలు నా మదిని వెచ్చగా కదిపాయి.

ఓ చెలీ! గులాబి రేకుల వంటి నీ పెదవుల వోలె నా అణువణువునా నీ ప్రేమ సుగంధాలే వెదజల్లుతున్నాయి.

♫ పున్నమి నాటి చంద్రుడయినా  నీ చూపుతో చిన్నబోడా.!

అమావాస్య చీకటి లాంటి విరహ వేదన లో ఉన్న నేను నీ తొలి పలకరింపుతో పండు వెన్నెలలోని చందమామ లా ప్రకాశిస్తాను...!!

నీ ప్రేమే దొరకని నాడు మరణాన్నయిన ప్రేమిస్తానేమో....!!!

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog