Unimaginable girlfriend / ఊహకందని ప్రేయసి


"కలగంటి కలగంటి" అని ఆధ్యాత్మికంలో అన్నమయ్య అన్నట్టుగా , యవ్వనంలో ఓ ప్రేమికుడు అంటే ఎలా ఉంటుంది అనే అంశం. అన్నమయ్యకు దేవుడు ఎలానో యవ్వనంలో ఓ యువకునికి ఆ ప్రేయసి అలానే అనిపిస్తుంది. అదే ప్రేమ అనే సృష్టి రహస్యం.  

..ఊహకందని ప్రేయసి..!

ప్రియతమా....!

నీ లో చంద్రుని చూసి వెన్నెల వంటి నీ చూపుల వలలో చిక్కుకున్నాను.

నీ కౌగిలి కోరుటకు నేను సరితూగనా....?చిరునవ్వులొలికించే నీ పెదవుల మధురిమలో నన్ను తేలియాడనీ..


నీ ప్రతి చుంబనము నాలో కలిగించే కొండంత ఆశ....! 

నీ నవ్వును వర్ణించ తగునా...అది పలికించే నాలో మూగబోయిన నా ప్రేమను.

వలపుల పులకింతతో రేగిన నా చిన్నారు మనసు వేగము ఆపుట ఎవరితరము.


నీతో గడిపే మధుర క్షణాలతోనే వసంత కాలము సమీపించును.

నీ సొగసుతో ఓ ప్రియా...!  ప్రకృతినే పులకింత లో ఇరుకున పడవేశావు..


నీవులేని ఈ జీవితము వ్యర్ధము అని తలపు తెచ్చిన ఓ మయూరీ...! ఇంతకీ నీ పేరేమిటి..?

ఈ ప్రేమికుని కోసం దివినుండి దిగివచ్చిన దేవకన్యవా (లేక) రమ్యమైన శిల్పాలకు ఊపిరినిచ్చిన శిల్పుల చేతిలో మలచబడ్డ అపురూప  శిల్పానివా...?

కలలా వచ్చిన నీ తలపు కల్లకాదు గదా..?

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog