I can not wait to see you/ నిను చూడక నేనుండలేను



ఈ పదంతో ఓ సినిమా ఉంది. ఓ ప్రేయసితో ప్రేమికుడు చెప్పే పదాలకి ఆ పేరుని వాడుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో నుండి వచ్చిన పదాల పాదాల గద్యం! 

...నిను చూడక నేనుండలేను...!!

ప్రియురాలా....! వినవా నా ఆవేదన.. నీ కోసం వేచిచూసే  నయనారవిందలు..

ఎన్నో జన్మల అనుబంధం నీది నాది అంటుంది నా మనసు అందుకే నిను చూడక నేనుండలేను...

కిలకిలమనే కోయిల గానంతో పరవశించు యువకుని హృదయం నీ పలుకుల అలజడితో తెలియాడదా మరి !

నీ పలుకు వినని ఆ మరునిముషం నా గుండె చెప్పిన సప్తస్వరాలే నిను చూడక నేనుండలేను... 

నీ చిరుకోపం చేసెను ఎదకు ఓ గాయం , నీతో చెప్పలేని నా హృదయ వేదనే నిను చూడక నేనుండలేను... 

సన్నజాజి అక్షరాల పరిమళం , విరజాజి అక్షరాల ప్రేమ సందేశమే నిను చూడక నేనుండలేను... 

స్వరరాగ గంగ ప్రవాహంలో , త్రివేణి సంగమ స్వరఝరిలో నా మనసు నీతో చెప్పిన మేఘసందేశమే నిను చూడక నేనుండలేను...

ఈ పలుకుల భావార్ధమే నిను చూడక నేనుండలేను...అందుకే చెబుతున్నా ప్రియా "నిను చూడక నేనుండలేనని.. "...!!

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog