Belove search / అన్వేషణ


ఓ ప్రియుడు తన చెలి కోసం వెతుకులాట - చిన్న మార్పులతో  "వార్త" వార్తాపత్రికలో ప్రచురితం అయిన కవిత. 

చెలీ......! 

 నీ సోయగాల కోసం అన్వేషణ,

విరిసీ విరియని మందారమా, తేనే పలుకుల మకరందమా నీ కోసమే ఈ అన్వేషణ!

ఏ చోట చేజారిందో తెలియని నా మనసుకోసం అన్వేషణ.

అపుడే తెలిసింది నీ చూపులోనే అది దాగుందని,

అన్వేషించి తెలుసుకున్నా..నీ మనసు లోని భావం కోసం,

హాయి రాత్రులతో అన్వేషించా నీతో గడపాల్సిన అందాల సుమగంధాల క్షణాలు.

అవే ఈ అన్వేషణకు ఆరాధన..!!

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog