Freedom /స్వాతంత్య్రమా....! ఇది

 ...స్వాతంత్య్రమా ....! ఇది.

కోట్ల మంది ప్రాణత్యాగం - లక్షల మంది రక్తపాతం.

చివరికేగా స్వాతంత్య్రమ్ ..

ఎవరికోసం ఈ స్వాతంత్ర్యం ..? ఎందుకీ రక్తపాతం..?

సాధారణ మనిషికి ఉందా  స్వాతంత్య్రమ్ ..?

కేవలం డబ్బు - పరపతి ఉంటేనేనా స్వేచ్చ...?

అపుడేమో పరాయి వారని వేల్లగోడితే , ఇపుదేమో మన వేలితో...మన కంటినే పొడుచుకుంటున్న దుస్థితి.

అపుడూ...ఇపుడూ...ఎప్పుడూ...ఒకేబాట...!!

తరాలు మారినా అంతరాలు వేరైనా....స్వాతంత్య్రమ్ మాత్రం గోప్పవారికే....!


వారు ఇది చేసారు, వీరు ఇలా అన్నారు - అంటారే తప్ప 

ఎవరైనా ఎపుడైనా ఆ...మాటలు ఆచరి౦చారా...?

ఒకవేళ ..

పొరపాటున ఎవరైనా అలా ఆచరిస్తే...

తుపాకీల చప్పుళ్ళు ....కొడవళ్ళ నరికివేతలు...!

వారికి ఈ లోకం నుండే శాశ్వత స్వాతంత్య్రమ్..!

బహుశా ఇదేనేమో స్వాతంత్య్రమ్ అ౦టే ....!


ఓ దేవుడా.....!!

ఈ మనసులని నువ్వే మార్చాలి.

ఆ...ఆ స్వాతంత్ర్యమే నీకుంటే ...నీ భూములను నువ్వే కాపాడుకొనే వాడివేమో కదా...!!!


- - శంకర్  - -  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog