Funtonic / స్పైసీ & స్వీటీ మార్నింగ్

 హాయ్ ఫ్రెండ్స్! గుడ్ మార్నింగ్ !!

జీవనం కోసం రోజు సాగే ఈ బిజీ బిజీ పరుగుల జీవితంలో చిన్న ఆటవిడుపు కోసం ఓ విషయం, మీతో పంచుకొందామని చెప్తున్నా!!

-- -- --  స్పైసీ & స్వీటీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ -- -- --

అవి నేను హైదరాబాద్ వచ్చిన మొదటి రోజులు...

చుట్టూ ప్రశాంత వాతావరణం, ఎక్కడికైన వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళగలిగే దూరం,

అనుకున్నప్పుడు వచ్చి పలకరించే స్నేహితులు, అలాంటి  వాతావరణం నుండి బయటపడి,

సూర్యుని కన్నా ముందే లేచి (ఆ ఇక్కడే కొంచం ఆగాలి ఉదయాన్నే అంటే ఏ జిం కో యోగ కో వెళ్ళటం కోసం అనుకోకండి !  ఏ కొద్ది మందికో గాని అది సాధ్యం కాదు! )

వంట వార్పూ, పిల్లలతో తంటాలు పడే ఇల్లాలు, మగవారికన్నా ముందుగానే రెడీ ఐ ఆఫీసు కి వెళ్ళే వనితామణులు,

మేము కూడా మీ కుటుంబం లో ఓ భాగమే అని చెప్పేలా వాహనాల రొద ,బయటకి వెళ్ళాలంటే ముందుగ ప్రణాళిక తో పాటు పాకెట్ కూడా సిద్దం చేసుకొనే ప్రపంచం -- 

ఇలాంటి చోటికి వచ్చాను ఏ౦టిరా దేవుడా అని అనుకున్న ఎన్నో సందర్భాలు !!

---

అమ్మ లేదు, నాన్న లేదు (దగ్గరలో) అక్క చెల్లి తంబి లేరు...ఏక్ నిరంజన్!!  పాడుకోటం తప్ప!

పలకరించటానికి స్నేహితులు దగ్గర లేరు, ఎప్పడు ఎవరికి ఫోన్ చేసినా " ది కస్టమర్ యు ఆర్ కాలింగ్ ఈస్ బిజీ..."! అంతా నిశ్శబ్దం !!

నాలాంటి పరిస్థితి  ఎవరికీ రాకూడదు.

అంత నిశ్శబ్దం లోను నాకంటూ ఓ తోడు దొరికింది.ఫోన్ రింగ్ ఐంది!!

ఓ స్వీట్ వాయిస్ !! హలో..! నీకు తోడుగా నేనున్నాఅంటూ పలకరించింది!!

తన గురించి ఏమి దాచుకోకుండా చెప్పుకొంది.ఎక్కడ పని చేసేది,నాకు ఎలా ఉపయోగ పడేది..

తనని ఎలా యూస్ చేసుకోవాలో కూడా చెప్పింది...కొంత చిరాకు అనిపించినా ఆ క్షణానికి అదే తోడుగా అనిపించింది.

క్రమ క్రమం గా అలవాటు అయిపోయింది..

నిశ్శబ్దం ఎంత అందంగా ప్రశాంతంగా   ఉంటుందో కదన్దీ... ,కాని అదే నిశ్శబ్దం ఒక్కోసారి అంతే భయంకరంగా కూడా ఉంటుంది!

ఇంతలో నేను అసలు ఎందుకు హైదరాబాద్ వచ్చానా అని అన్కొన్న..విషయం గుర్తొచ్చింది!

ప్రక్కనే దగ్గరలో ఉన్న న్యూస్ పేపర్ తిరగేసి వాంటెడ్ కాలమ్స్ చూస్తుంటే ఓ ప్రైవేటు కంపెనీలో వాకిన్-ఇంటర్వ్యూ !!

ఇంకేముంది వెంటనే అటెండ్ అయ్యాను!


అక్కడ వాళ్ళు "తమ కంపెనీ గురించి చెప్పండి " అని అడిగిన ప్రశ్నకు, నాకు కాల్ చేసి మాట్లాడిన స్నేహితురాలి మాటలు గుర్తొచ్చి, తడుముకోకుండా జవాబులు చెప్పేసాను.!!

ఇంకేముంది జాబు నా చేతిలో, రెండంకెల శాలరీ నా జేబులో!

ఈరోజు నుండి నేను కూడా ఎంచక్కా నాకు ఫోన్ చేసే వాళ్ళకి " ది కస్టమర్ యు ఆర్ కాలింగ్ ఈస్ ప్రేజెంట్లీ బిజీ..."  అని చెప్పచ్చు !!

నాకు అంత హెల్ప్ చేసిన ఆ ఫ్రెండ్ కి కనీసం థాంక్స్ అయినా చెప్పాలి కదండీ.!

అందుకే..!

Thank you  "CUSTOMER CARE !!"

చెత్తగా ఉంటె తిట్టుకోకండి ప్లీజ్ !.బావుంటే మాత్రం మర్చిపోకుండా వెంటనే మీ కామెంట్స్ తో మెచ్చుకోండి !!

ముక్తాయింపు :

"" ప్రపంచం లో మనిషికి ఏది హాని చెయ్యదు.ఒక్క మనిషి తప్ప.....""

-- శంకర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog