Corruption / అవినీతి

 ...చలి చీమలు సంకలనంకి అవినీతి అనే అంశం పైన రాసిన నా చిరు  ప్రయత్నం....

....అవినీతి....

ఏమి చెప్పాలి,ఎలా రాయాలి, అవినీతి గురించి,అడుగడుగునా అవినీతి,

చితివరకు అవినీతి,ఈ జగమంతా అవినీతి మాయం.


భగవంతుని నీటి అవతారాలు ౧౦ అయితే అసలు నీతే ఎరుగని అవినీతి అవతారాలు వేల వేలు...

కాలేకడుపులు ఎన్నున్నా , తీరని బాధలు ఏమైనా అవినీతి పరులకు ఇవేమీ పట్టవు ...


మనసెరుగని అవినీతి పరులను ఇకనైనా అదిలించి ముక్కుతాడు వేయాలి.

పుట్టుకనుండి మొదలుపెట్టి .......

పురుడెరిగిన మంత్రసాని చేతల్లో అవినీతి,

భవిత కొరకు చదువు" కొంటే " భవితంతా అవినీతిమయం...

ఇదేనా మననీతి...?ఇంతేనా జగనీతి....?


కలి'నాటిన' ఈ అవినీతిన్ ఎండగట్టే మనసున్న 

ప్రతి వ్యక్తి కలములోని ఒక్కొక్క సిరాచుక్క ఒక్కొక్క అస్త్రమై అవినీతిని చీల్చి చెండాడుతుంది...

కలమెరుగని ప్రతిమనిషికి మనసేగా బ్రహ్మాస్త్రం...!!


స్వరానికి దూరమైతే - పదాలే కరువైనట్ల్డు 

నీతికి దూరమైతే - కన్నతల్లికి దూరమైనట్లే.....

అవసరమా ఈ అవినీతి చర్యలు...?


ఏ జాతికి చెందిందని , ఏ మతానికి చెందిందని,

ఎవరికి కన్నబిద్దవని, ఎవరికి తోబుట్టువని,

నీకు భయపడాలి.


ప్రజాస్వామ్యం రాజ్యంలో ప్రజలేగా ప్రభుత్వము..ఆ ప్రజల్లో...

ఒక్కదినని భీతిపడక - ఒక వెలుగై దారిచుపాలి.


నీ అరచేయి ఒక్కటే - అని నువ్వు తలిస్తే 

ఆ అరచేతిలోని ఐదువ్రేళ్ళు నీ పిడికిలి అని మరువకు.


అవినీతి రెచ్చిపోతే ఉందా మన భావితరం...?

అవినీతి చచ్చిపోతే భవితేగా తరం తరం ...అందుకే.


బెబ్బులివై తొడగొట్టు - అవినీతిని తరిమికొట్టు.

ఆదరగొట్టు బెదరగొట్టు - అవినీతిని అణచిపెట్టు.


ఎంతటి అవినీతి సర్పమైనా '' చలిచీమలు '' చేతిలో చావవలసిందే.


- - శంకర్  - -  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog