In love/ ప్రేమలో

 ప్రేమలో.....

ప్రణయ రాగ ప్రేరేపణలో  చిగురించినావే... నీవే జీవనలహరి,సరసరాగా స్వరఝరి, అందాల మయూరీ..!



అందుకో కుసుమాంజలి ఇదే నా ప్రణయ ప్రేమాంజలి

పురివిప్పిన యవ్వనంలో శృతి తప్పిన ఆలోచనలో 

మొలకెత్తిన నీపై ప్రేమ  చిగురుటాకుల మధ్య ఉదయించిన రవికిరణాల వలె వికసించింది.

అందుకున్నా నీ ప్రేమలోని తియ్యదనం అదే నాకు ఎనలేని స్వేఛ్చ , మోయలేని తాపం....

తొలిచూపుల పులకింతకు మలిచూపుల కవ్వింతలో దాచలేని మోహంతో ఊగిసలాడు వేళలో ఇదేమి వ్యామోహం,

ప్రణయ రాగ ఆలాపనలో శృతి చేసుకొన్న సరిగమల బంధమా....

సరసరాగ మధువనిలో చోటుచేసుకొన్న సరాగాల పంతమా..

నీలోని అందాలని రుచిచూసే మన్మధుడిని నేనే కావాలి..

అదే నా ఆశ , నా శ్వాస....!! 

--

శంకర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog