Oka family story/ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

 


ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ :- 

-----------------------------------------

19 నవంబర్ OTT జీ 5 లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ , కొణిదెల నీహారికచే పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ లో విడుదలయింది . మొదటగా ఈ ప్రొడక్షన్స్ నుండి వచ్చిన MAD HOUSE వెబ్ సిరీస్ ఓ రకంగా అనిపిస్తుంది. నటీ నటుల ఎంపిక బాగుంటుంది.వీటి నుండి వచ్చిన సిరీస్ లో కొత్తదనం కనిపిస్తుంది. కధ పరంగా కాకపోయినా టేకింగ్ ప్రెసెంటేషన్ ఎలెమెంట్స్ సాఫ్ట్ గా వెళుతుంటాయి. ఇక ఈ చిన్న సిరీస్ 4 ఎపిసోడ్స్ తో విడుదలై ప్రైమ్ జీ 5 లో ప్రీమియర్ అవుతుంది. ఇక కథా కమామీషు విషయానికొస్తే ఓ తండ్రి కొడుకుల మధ్య జరిగే కధ. చాలామందిలానే తండ్రి కొడుకుల మధ్య ఉండే మామూలు అపార్ధాలు, ప్రేమ గురించి చెప్పారు. హీరోయిన్ సిమ్రాన్ శర్మ సో సో గా ఉంది. తల్లి దండ్రుల పాత్రలో తులసి, నరేష్ లు బాగానే ఉన్నారు. తల్లిగా తులసి పాత్ర యొక్క నిడివి ఎక్కువగా ఉంటుంది. ఎమోషన్స్ అంత పెద్దగా హత్తుకొకపోవచ్చు. సంగీత్ శోభన్ కొడుకు పాత్రలో సాదాగా ఉన్నాడు. 3, 4 ఎపిసోడ్స్ సాగదీసినట్టున్నా హ్యాపీ ఎండ్ అవుతుంది. అమాయక తల్లి పాత్రలో తులసి కొడుకుపై ప్రేమ వర్షం కురిపించింది. ఓ మోస్తరుగా చూడదగిన సిరీస్.. మరి ఈ పింక్ ఎలిఫెంట్ నిహారిక ఇలా సిరీస్ లతోనే ఆగుతుందో లేక వెండితెరకి కూడా అప్ గ్రేడ్ అవుతుందేమో మరి చూడాలి..


---

శంకర్ 😊

#review #whatifacommonmanspeaks #okachinnafamilystoryreview #pinkelephant #niharikaproductions #zee5 #ott #moviereview

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog