Chaitanyam/ 'చైతన్యం'



'చైతన్యం'  అందరిలో రావాలి :-
--------------------------------------------------------------------

 కధకి తగిన టైటిల్ . ఓ గోదావరి తీర లంక గ్రామం. ఈ రోజుల్లో రాజకీయ నాయకుల ప్రభుత్వ పథకాల వలన మొద్దుబారిపోయిన మనుషుల బద్ధకానికి, సోమరితనానికి నిలువెత్తు నిదర్శనం. పేదరికం తాళలేక డబ్బు కోసం తండ్రికి తెలియకుండా కిడ్నీని అమ్మేసి దుబాయి వెళ్లిన ఓ కొడుకు. అది తెలిసినా కొడుకు అభివృద్ధికి అలా ఐనా ఉపయోగపడినందుకు సంతోషించిన తండ్రి. భావోద్వేగం. మోసపోయి తిరిగొచ్చి స్వేచ్ఛగా స్వయంశక్తితో బ్రతకడానికి చదువు,టెక్నాలజీనే ఏకైక మార్గమనుకొనే భ్రమలని చెరిపేసి సృజనాత్మక ప్రయత్నంతో ఏదైనా సాధించి ప్రపంచ హద్దులను దాటవచ్చు అని డైరెక్టర్ ఎంచుకున్న ఐడియాలజీ బావుంది. సహకార పాత్రలో హీరోయిన్ యాషిక ఒదిగిపోయింది. నటీనటులు కొత్తవారవడంతో ప్రేక్షకులని అంతగా ఆకర్షించలేకపోయిన సినిమా. చాలాసినిమాల్లా హీరో హీరోయిన్ అంటే కాస్త శృంగారం, ఒకింత ప్రేమ కోసమే అని ఉద్దేశ్యం మార్చిన సినిమా.

అమెజాన్ ప్రైమ్ టెలికాస్ట్


-- రాసుకోదగినవి --

ఓడిపోవటానికి కూడా ఓ అర్హత ఉండాలి అదే - "ప్రయత్నం "


గూగుల్ సీఈఓ మనోడు, మైక్రోసాఫ్ట్ సీఈఓ మనోడు, ఈస్ట్ ఇండియా కంపెనీ కొనింది కూడా మనోడేరా అని చంకలు గుద్దుకునే ముందు మనోళ్లు ఎప్పటికి ఎవరొకరి క్రింద బ్రతుకుతుండటం ఏమిటని ఆలోచించాలి


భారతదేశం ప్రపంచానికి ఏమిచ్చింది బానిసలుగా కష్టపడటం తప్ప అనే ఓ గల్ఫ్ వ్యాపారికి , భారతీయులంటే బానిసలు కాదు స్వయం శక్తి పైన ఆధారపడి బ్రతకగలరు అని సమాధానం ఇచ్చిన ఐడియాలజీ "అతిథిదేవోభవ "


భారతదేశ అభివృద్ధి ని GDP తో కాకుండా గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ రేషియో తో కొలిచే రోజు రావాలనే ఆకాంక్ష


--

3**/5

శంకర్ 😊

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog