రూల్స్ రంజన్: A Kiran Abbavaram film

   కిరణ్ అబ్బవరం - నేహా శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ నవంబర్ 30 నుండి ఆహ OTT లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రం. ఓ ఇంజినీరింగ్ మిడిల్ బెంచ్ స్టూడెంట్ కి ఓ సాఫ్ట్వేర్ జాబ్ రావడం తో ముంబై వెళ్తాడు. భీభత్సమైన రూల్స్ పెట్టుకుని ఏదో ఆనందంగా గడిపేస్తున్నా అనుకుంటూ ఆత్మసంతృప్తితో జీవితాన్ని లీడ్ చేస్తున్న కిరణ్ కి భాష పెద్ద సమస్యగ మారినా అదే ఉద్యోగంలో టర్న్ వచ్చేలా ట్యూన్ చేసారు. ఆలా సాగిపోతున్న కిరణ్ జీవితంలోకి ఎప్పుడో మర్చిపోయాయడనుకున్న బ్యూటిఫుల్ లాంటి నేహశెట్టి 'సన'- గా ముంబై లైఫ్ లోకి వస్తుంది హీరోయిన్. కొంచం పాత రోజుల్లోకి వెళ్లి తాను ప్రేమించిన విషయాన్ని చెప్పకనే చెప్తాడు  హీరోయిన్ కి.  ఫస్ట్ హాఫ్ కాస్త సాగతీసినట్టున్నా అప్పుడప్పుడు వెన్నెల కిశోర్ చేసే కామెడీ కొంచం రెఫ్రెషమెంట్ ఇస్తుంది. అక్కడి నుండి మన రూల్స్ రంజన్ తన రూల్స్ బ్రేక్ చేస్కుని ఆ ప్రేమని ఎలా సుఖాంతం చేసుకొన్నాడు అనేది కధ. ద్వితీయార్ధంలో హైపర్ ఆది తో పాటు వైవా హర్ష సమూహం స్నేహితులుగా చేసిన కామెడీ కొంచం సినిమాని బతికించాయి. కాసిన్ని నవ్వులు ఖర్చుపెట్టుకోవచ్చు. మొత్తం మీద ఓ టైం పాస్ చిత్రమే. పాత్ర దారులు అందరు అనుభవజ్ఞులే కనుక పాత్రలకి న్యాయం చేసారు. రెండో హీరోయిన్ మెహర్ చాహల్  పాత్ర కొంచం తక్కువగానే ఉంది. ఉన్నంత సేపు పాత్ర కధ కోసమే వుంది.

టెక్నికల్ యాస్పెక్ట్స్ : పెద్దగా గమనింపబడలేదు. 

డైరెక్టర్ :  రత్నం కృష్ణ 
సినిమాటోగ్రఫీ :  దులిప్ కుమార్  ఎం. ఎస్. 
సంగీతం : ఆమ్రేష్ గణేష్ (పోతూ వుంది )
ప్రొడ్యూసర్ : ఏ. ఎం రత్నం 
-- 
అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog